(Source: ECI/ABP News/ABP Majha)
Gruhalakshmi September 19th Update: సామ్రాట్, హనీకి యాక్సిడెంట్- అల్లాడిపోయిన తండ్రి మనసు, టెన్షన్ పడుతున్న నందు
నందు సామ్రాట్ కారు బ్రేక్ వైర్ కట్ చేస్తాడు. దీంతో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు సామ్రాట్ కారుకి బ్రేకులు తీసేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఈ పాటికి తులసి, సామ్రాట్ కారులో బయల్దేరి ఉంటారు నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఉంటుందా అని నందు ఆలోచిస్తూ ఉంటాడు. అభికి ఫోన్ చేసి తులసి ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు. ఏదైనా ప్రాబ్లం ఉందా అని అభి అడుగుతాడు. ఈరోజు ఆఫీసులో మీటింగ్ ఉంది, తులసి, సామ్రాట్ పని మీద బయటకి వెళ్ళి ఆఫీసుకి వస్తాను అన్నారు ఇంకా రాలేదు ఏంటి అని నీకు కాల్ చేశాను అని నందు కవర్ చేస్తాడు. ఈరోజు మీ మీటింగ్ జరగదులే డాడ్ అని అభి అంటాడు. అదేంటి నిజంగా యాక్సిడెంట్ అయ్యిందా అని నందు నోరు జారతాడు. యాక్సిడెంట్ ఏంటి డాడ్ అని అభి భయంగా అడుగుతాడు. ఏదో ఆలోచిస్తూ అలా అన్నాలే అంటాడు. ఇంతవరకు సామ్రాట్ గారు రాలేదు మామ్ వెయిటింగ్ అని చెప్తాడు.
దేవుడు దయ వల్ల తులసి ఇప్పటి వరకు సేఫ్ సామ్రాట్ పరిస్థితి ఏంటో అని నందు అనుకుంటాడు. సామ్రాట్ తులసికి ఫోన్ చేసి బయల్దేరుతున్నా అని చెప్తాడు. ఇద్దరు కలిసి సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటారు. హనీ వచ్చి ఈరోజు నువ్వు నన్ను స్కూల్లో దింపు అని అడుగుతుంది. నాకు అర్జెంట్ పని ఉంది ఈరోజుకి తాతయ్యతో వెళ్ళమ్మా అని అంటాడు. తులసి ఆంటీ పిల్లల్ని ఎలా పెంచాలో మా నాన్నకి కాస్త నేర్పించొచ్చు కదా అని హనీ తులసితో ఫోన్లో చెప్తుంది. హనీని స్కూల్లో దింపి నాదగ్గరకి రండి అని తులసి చెప్తుంది. దీంతో సామ్రాట్, హనీ కారులో స్కూల్కి బయల్దేరతారు. కారులో వెళ్తుంటే సడెన్ గా బ్రేక్ పడటం లేదని సామ్రాట్ గ్రహిస్తాడు. అటు నందు ఇంట్లో టెన్షన్ గా ఉంటాడు.
Also Read: ప్రేమపక్షుల మధ్య మనస్పర్థలు, వసుకి రిషి సూటి ప్రశ్న- దూరమవుతోన్న తండ్రీ కొడుకుల బంధం
సామ్రాట్ కారు వేగంగా నడుపుతూ వెళ్ళి చెట్టుని ఢీ కొడతాడు. దేవుడా తెలియక తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చెయ్యను సామ్రాట్ గారికి ఏమి కాకుండా చూడు అని నందు కోరుకుంటాడు. కానీ అప్పటికే సామ్రాట్ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బలు తగులుతాయి. తులసికి ఎవరో ఫోన్ చేసి విషయం చెప్తారు. నందు వాళ్ళకి కూడా విషయం తెలిసి హడావుడిగా హాస్పిటల్ కి వస్తారు. తులసి కూడా టెన్షన్ గా వస్తుంది. సామ్రాట్ గారికి ఏమి కాలేదు చిన్న దెబ్బలతో బయట పడ్డారు అని డాక్టర్ చెప్తాడు.
సామ్రాట్ కళ్ళు తెరిచి హనీ అని గట్టిగా అరుస్తాడు. నా హనీ ఎక్కడా అని అంటాడు. వెంటనే నేను హనీని చూడాలి అని బాధగా అరుస్తాడు. ఐసీయూలో హనీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. తనని చూసి సామ్రాట్ చాలా ఏడుస్తాడు. ఆవేశంలో తాగిన మత్తులో ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు దేవుడా హనీకి ఏమి కాకుండా చూడు అని నందు దేవుడ్ని వేడుకుంటాడు. అంతా నావల్లే అని నా నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని సామ్రాట్ చాలా కుమిలిపోతాడు. రాత్రి వరకు మీ కారు బాగానే ఉంది కదా తెల్లారే సరికి బ్రేక్ ఫెయిల్ అవడం ఏంటి సార్ అని లాస్య అంటుంది. అంతా నా ఖర్మ అని సామ్రాట్ ఏడుస్తాడు. పాపాకి ప్రాణాపాయం ఏమి లేదని డాక్టర్ చెప్తుంది. పడటం వల్ల చెయ్యి బెణికింది ఇబ్బంది ఏమి లేదు, యాక్సిడెంట్ తాలూకు షాక్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తుంది. అది విని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. హనీని చూసి సామ్రాట్ చాలా ఎమోషనల్ అవుతాడు. సామ్రాట్ గారు ఒక్క నాలుగు రోజుల్లో హనీ మామూలు అవుతుంది టెన్షన్ పడకండి అని అందరూ ధైర్యం చెప్పేందుకు చూస్తారు.
తరువాయి భాగంలో..
హనీకి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు అని అటు సామ్రాట్ ఇటు తులసి బాధ పడుతూ ఉంటారు. తన బాధని చూడలేక పరంధామయ్య హనీని నాలుగు రోజులు మన ఇంట్లో ఉంచుకుందామని చెప్తాడు. సామ్రాట్ గారు ఒప్పుకుంటారా అని తులసి ఆలోచిస్తుంది.