Guppedanta Manasu Septembar 19th Update: ప్రేమపక్షుల మధ్య మనస్పర్థలు, వసుకి రిషి సూటి ప్రశ్న- దూరమవుతోన్న తండ్రీ కొడుకుల బంధం
గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
![Guppedanta Manasu Septembar 19th Update: ప్రేమపక్షుల మధ్య మనస్పర్థలు, వసుకి రిషి సూటి ప్రశ్న- దూరమవుతోన్న తండ్రీ కొడుకుల బంధం Guppedanta Manasu Septembar 19th Episode 559 Written Update Today Episode Guppedanta Manasu Septembar 19th Update: ప్రేమపక్షుల మధ్య మనస్పర్థలు, వసుకి రిషి సూటి ప్రశ్న- దూరమవుతోన్న తండ్రీ కొడుకుల బంధం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/f72a0c00f90994590b703c48226775411663561500131521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎంతో సంతోషంగా సెలెబ్రేట్ చేసిన మహేంద్ర, జగతిల పెళ్లి రోజు వేడుకని దేవయాని చెడగొట్టేస్తుంది. జగతిని అమ్మా అని పిలిపించాలనే ఒప్పందం మహేంద్ర, వసుల మధ్య ఉందనే విషయం తెలుసుకుని అది ఫంక్షన్ రోజు రిషి ముందు బయట పెట్టేస్తుంది. దీంతో రిషి కోపంతో ఊగిపోతాడు. వసుని, మహేంద్రని తప్పుగా అర్థం చేసుకుంటాడు. నిన్ను రిషి ముందు ఓ మోసగత్తెలాగా నిలబెట్టాను అని దేవయాని వసుతో అంటుంది. ఇక ఈరోజు హైలెట్స్ విషయానికి వస్తే రిషి వసుని దూరం పెడతాడు. ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటే వసు రిషి చెయ్యి పట్టుకోబోతుంది. కానీ రిషి మాత్రం తను చెయ్యి పట్టుకోకుండా తన చేతిని పక్కకి తీసేసుకుంటాడు. ఒక చోట కారు ఆపి వసుని నిలదీస్తాడు. వసుధారా ఒక మాట సూటిగా అడుగుతాను చెబుతావా.. అని రిషి అంటాడు. నన్ను రిషీలా ప్రేమించావా, జగతి మేడమ్ కొడుకులా ప్రేమించావా అని అడుగుతాడు. ఆ మాటలకి వసు చాలా బాధపడుతుంది.
జరిగిన కథ
ఫంక్షన్ జరగడానికి కొద్ది నిమిషాల ముందు మహేంద్ర, జగతి గదిలో మాట్లాడుకోవడం బయట నుంచి దేవయాని వింటుంది. గురు దక్షిణగా రిషి, జగతిలని కలిపి తనతో అమ్మా అని పిలిపించమని మహేంద్ర వసుని అడిగిన విషయం జగతితో చెప్తాడు. అదంతా విన్న దేవయాని ఫంక్షన్ చివర్లో బయటపెడుతుంది. వసు అందుకోసమే నీకు దగ్గర అయ్యిందని అంటుంది. రిషి నిన్ను అమ్మా అని పిలిచిన వెంటనే వెళ్ళి వసుధార వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడదాము అని దేవయాని జగతితో చెప్తుంటే ఆపండి పెద్దమ్మా అని రిషి కోపంగా అరుస్తాడు. వసుధారా ఆగమని చెప్పినా కూడా తనని తప్పుకోమని చెప్పి మరి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత వసు దగ్గరకి దేవయాని వెళ్ళి తన మనసులో ఉన్న కుట్ర బయట పెడుతుంది. రిషిని, నిన్ను ఎప్పటికీ కలవనివ్వను అని ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత రిషి దగ్గాయకి మహేంద్ర వెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు.
Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!
రిషి: మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారా డాడ్ మీరు అలా చేసి ఉండకూడదు. మా ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉందని అనుకున్నాను కానీ మీతో గురుదక్షిణ ఒప్పందం కూడా ఉందని ఈరోజే తెలిసింది
మహేంద్ర: ఇప్పుడు ఏమైందని రిషి
రిషి: ఇంకా ఏం కావాలి.. పోగొట్టుకోవడం నాకు అలవాటు అయిపోయింది డాడ్..
మహేంద్ర: అసలేం జరిగిందంటే.. అని చెప్పబోతుంటే వద్దని అంటాడు. కొన్ని చెప్తేనే తెలుస్తాయి నాన్న
రిషి: జరిగిన దానికి సవరణలు, దిద్దుబాట్లు నాకు వద్దు డాడ్.. మీరు ఏం మాట్లాడుతారో నాకు తెలుసు. నన్ను ఒక వస్తువులా జమ కట్టి పథకం ప్రకారం వసుధారని ప్రయోగించారా..
మహేంద్ర: రిషి ఏం మాట్లాడుతున్నావ్
రిషి: నా వెనక ఇంత జరిగిందా.. ఇద్దరు కలవడానికి మరో ఇద్దరు కలిసినట్టు నటించడం అవసరమా డాడ్
మహేంద్ర: ఇందులో నటన ఏమి లేదు
రిషి: కనిపిస్తుంది కదా డాడ్ మన ఫ్రెండ్ షిప్ గురించి గొప్పగా అనుకున్నా కానీ మీరు కూడా..
మహేంద్ర: రిషి కొన్నిటి కోసం కొన్ని తప్పవు కదా
రిషి: అంటే మీరు ఒప్పుకుంటున్నారా.. పెద్ద చేప కోసం చిన్న చేపని ఏరా వేశారా? ప్రపంచం అంతా దూరం అయినా మీరు నా వెనకే ఉంటారు అనుకున్నా కానీ మీరు కూడా నా వెనక అని మహేంద్ర చెప్పేది వినకుండా వెళ్లిపొమ్మని బయటకి చూపిస్తాడు. మనుషుల స్వార్థాలు నాకు అలవాటు అయ్యాయి డాడ్ కానీ మీ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుందని అనుకోలేదు అనేసరికి మహేంద్ర గుండె పగిలిపోతుంది. కళ్ల నిండా నీళ్ళతో జగతి దగ్గరకి వెళ్ళి చిన్న పిల్లడిలా ఏడుస్తాడు.
Also Read: బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత,దీప చేతిరాత గుర్తుపట్టిన శౌర్య - వంటలక్క ఏం చేయబోతోంది!
Guppedantha Manasu - Promo | 19th Sep 2022 | #StarMaaSerials #GuppedanthaManasu | Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/tfX4XqIWsz
— starmaa (@StarMaa) September 18, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)