Gruhalakshmi September 10th Update: వినాయకుడు కలిపాడు ఇద్దరినీ- నిజం కక్కేసిన లాస్య, తులసిని క్షమాపణ అడిగిన సామ్రాట్
గృహలక్ష్మి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఎం జరిగిందంటే..
హనీ సామ్రాట్ ఇంటికి వెళ్ళడం ఏంటి అని లాస్య చిరాకుగా అంటుంది. ఆ సామ్రాట్ ఇంటికి వెళ్ళి మరి తులసితో గొడవ పడ్డాడు కదా ఏం మొహం పెట్టుకుని కూతుర్ని పంపిస్తున్నాడు అని నందు అంటాడు. కూతుర్ని పంపిస్తాడో లేదంటే తాను కూడా వెళతాడో అని లాస్య అంటే హనీని అడ్డం పెట్టుకుని తులసి సామ్రాట్ తో కలిసిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఉందని నందు అంటాడు. అంత జరుగుతుంటే మనం చూస్తూ ఉంటామా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని మనం కూడా తులసి ఇంటికి వెళ్దామని లాస్య అంటుంది. పిలవని పేరంటానికి మనం ఎలా వెళ్తాం అని నందు అంటాడు. కానీ వెళ్ళాల్సిందే తప్పదు అంటుంది. నేను రాను నువ్వు వెళ్ళు అనేసి నందు వెళ్ళిపోతాడు.
తులసి ఇంట్లో పండగ సంబరాలు మొదలవుతాయి. లక్కీ నేను వచ్చేశా అని ఎంట్రీ ఇచ్చేస్తాడు. అదేంటి రా ఇంట్లో ఏమైనా గొడవపడి వచ్చావా ఏంటి అని పరంధామయ్య అడుగుతాడు. లేదు మావయ్య పండగ అని మన ఇంటికి వచ్చాడు అని తులసి చెప్తుంది. హమ్మయ్య ఒక్కడే వచ్చాడు పూజ ప్రశాంతంగా జరుగుతుందిలే అని దివ్య మనసులో అనుకుంటుంది. ఇంట్లో మీ అమ్మకి చెప్పి వచ్చావా లేదంటే మా మీద అరుస్తుందని అనసూయ అంటే చెప్పి వచ్చాను వాళ్ళను రావొద్దని కూడా చెప్పాను మీరేం టెన్షన్ పడకండి నానమ్మ అని అనేసరికి అందరూ నవ్వుతారు.
Also Read: అదిరిపోయే ట్విస్టుల మీద ట్విస్ట్లు- ఒకేసారి రెండు నిజాలు బట్టబయలు, అద్దెకి ఇల్లు తీసుకున్న రుక్మిణి
సామ్రాట్ హనీని తీసుకుని తులసి ఇంటికి వస్తాడు. చిన్న పని ఉంది ముందు నువ్వు వెళ్ళు అని హనీని పంపిస్తాడు. నువ్వు కూడా రావొచ్చుగా అని పెద్దాయన అంటాడు. పిలవని పేరంటానికి వెళ్తే అసహ్యంగా ఉంటుందని సామ్రాట్ అంటాడు. ఇలా బయట కాపలాగా ఉంటే బాగోదేమో అని పెద్దాయన కౌంటర్ వేస్తాడు. హనీ, పెద్దాయన ఇంట్లోకి వెళ్లిపోతే సామ్రాట్ కారులోనే ఉండిపోతాడు. ఇంట్లో అందరూ హనీని చూసి సంతోషిస్తారు. నందు, లాస్య కూడా తులసి ఇంటికి వస్తారు.
సామ్రాట్ కారు అక్కడ ఉండటం చూసి లాస్య నోటికి పని చెప్తుంది. అంత నిద్రపట్టకుండా అల్లాడుతున్నాడా తెల్లరక ముందే వచ్చి వాలాడు పైకి మాత్రం ఎక్కడా లేని బెట్టు చూపిస్తాడు. తులసి అంటే పడదు అని ఫోజు కోడతాడు, తులసి వయ్యారాలు పోటు సామ్రాట్ గారు వస్తారా అని పిలిస్తే ఎగేసుకుని వచ్చేశాడు కొద్దిగా కూడా బుద్ధి లేదు. అంత పొడుగు ఉంటాడు ఇంత సిగ్గు కూడా ఉండదా అని లాస్య అంటుంది. నాకు రావడం ఇష్టం లేదని చెప్పిన తీసుకొచ్చావ్ సామ్రాట్ మొహం చూడాలంటే ఇరిటేషన్ గా అనిపిస్తుందని నందు చిరాకు పడతాడు.
Also Read: శౌర్యని చూసి ఆగిన కార్తీక్, మోనితని టెన్షన్లో పడేసిన దీప!
నందు లాస్య ఇంట్లోకి వెళ్తూ సామ్రాట్ కారు దాటిన తర్వాత ఆగుతారు. ‘ఒక్కటి గుర్తు పెట్టుకో నందు లోపలకి వెళ్ళిన తర్వాత ఎవరు నిన్ను రెచ్చగొట్టినా కూల్ గా ఉండు. మాజీ భర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకుండా దాచామని నువ్వే తులసిని రిక్వెస్ట్ చేసిన నిజం పొరపాటున కూడా బయట పెట్టకు అర్థం అయిందా’ అని హితబోధ చేస్తుంది. అది విని సామ్రాట్ షాక్ అవుతాడు. అంటే నందు రిక్వెస్ట్ చేయబట్టే తులసిగారు నందు తన మాజీ భర్త అనే నిజం దాచిందా.. ఓ మై గాడ్ పాపం తులసి గారిని ఎంతలా అపార్థం చేసుకున్నాను. విషయం అప్పుడే తులసిగారిని అడిగి ఉంటే అప్పుడే క్లారిఫై అయి ఉండేది ఇంతలా మనస్పర్థలు ఉండేవి కావు అని సామ్రాట్ పశ్చాత్తాపడతాడు. నందు, లాస్య ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి ఇక పూజ ప్రశాంతంగా జరిగినట్టే అని దివ్య బిక్కమొహం వేస్తుంది. దివ్య ఎగ్జామ్స్ బాగా రాయాలని గుడిలో నందు ప్రత్యేకంగా పూజ చేయించాడు ప్రసాదం ఇద్దామని వచ్చాము అని లాస్య కవర్ చేస్తుంది. నందు వెళ్దామా వచ్చిన పని అయిపోయిందని అంటుంది కానీ అభి మాత్రం వెళతారెంటి అని అడుగుతాడు. పండగ పూట ఇంటికి వచ్చిన కొడుకుని వెళ్లిపొమ్మంటారా తాతయ్య అని అభి అంటాడు. పూజకి ఉండమని తులసి చెప్తుంది.
తరువాయి భాగంలో..
ఇంటికి వచ్చి లోపలికి రాకుండా ఎలాగండి దయచేసి లోపలికి రండి అని సామ్రాట్ ని తులసిని బతిమలాడుతుంది. మీరు రావడం చాలా సంతోషంగా ఉందని పరంధామయ్య అంటాడు. నువ్వు కూడా మాతో పాటు వినాయకుడి పూజలో కూర్చోవాలి అని హనీ అంటుంది. మా ఇంటి మీద పడి గొడవ చేసి మా మామ్ ని మాటలు అన్నందుకు ముందు తనకి సోరి చెప్పాలి తర్వాత పూజలో కూర్చోవాలి అని అభి కోపంగా అంటాడు.