News
News
X

Devatha September10th: అదిరిపోయే ట్విస్టుల మీద ట్విస్ట్లు- ఒకేసారి రెండు నిజాలు బట్టబయలు, అద్దెకి ఇల్లు తీసుకున్న రుక్మిణి

మాధవ్ తన నిజస్వరూపం బయట పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఎం జరిగిందంటే..

FOLLOW US: 

రాధ, మాధవ్ మాత్రమే ఇంట్లో ఉంటారు. మాధవ్ మెట్లు దిగుతూ పడిపోయినట్టు నాటకం ఆడతాడు. అది చూసి రాధ కంగారుగా వంట గదిలో నుంచి బయటకి వచ్చి మాధవ్ ని లేపుదామని కూడా ఆగిపోతుంది. సారు ఏసువంటి వాడు అయినా ఆపదలో ఉన్నాడు ఇలాంటప్పుడు కూడా సాయం చేయకపోతే ఆయనకి నాకు తేడా ఏముందని మనసులో అనుకుని మాధవ్ ని పైకి లేపుతుంది. మాధవ్ రాధ భుజం మీద చేయి వేసేసరికి చిరాకుగా ఫీల్ అవుతుంది. రాధ నువ్వే నాకు తోడుగా ఉంటే ఇంకా దీనితో పనేముంది అని చేతి కర్ర తీసి పక్కకి విసిరేస్తాడు. అది చూసి రాధ షాక్ అవుతుంది. మాధవ్ రాధ ముందు మామూలుగా నడుస్తూ ఉంటాడు.

మాధవ్: ఈరోజు కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను రాధ. ఈ నిజం నీకు చెప్పాలి అని కానీ నీ మనసులో నాకు చోటు దక్కాలి అంటే నాలో ఒక లోపం ఉండాలి కదా. అందుకే అవసరం లేకపోయినా కాలిని అద్దం పెట్టుకున్నా. నిన్ను కోరుకున్న నాకు ఏ లోపం లేదు అందరిలా నడవగలను అవసరం అయితే పరిగెత్తగలను. ఆ కర్ర సాయం లేకుండా నేను నడవడం నువ్వు చూడలేదు కదా

రాధ: కన్నవాళ్లని, కడుపున బిడ్డని ఇంత మోసం చేస్తావా

మాధవ్: కొన్ని సార్లు తప్పదు రాధ నమ్మకమే చాలా సార్లు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది

Also Read: శౌర్యని చూసి ఆగిన కార్తీక్, మోనితని టెన్షన్లో పడేసిన దీప!

అప్పుడే జానకి మాధవ్ అని పిలిచేసరికి మళ్ళీ చేతి కర్రతో నిలబడి ఉండటం చూసి రాధ బిత్తరపోతుంది. ఇంట్లో దేవి, చిన్మయి ఆడుకుంటూ ఉంటారు. మనమే ఉన్నాం వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అని దేవి ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇంటికి రారా అంటావ్ వస్తే చప్పుడు చేయకుండా ఉంటావ్ అని దేవుడమ్మతో అంటుంది. ఇప్పుడు నేనేమీ చెయ్యాలి అని దేవుడమ్మ అంటే నాతో కలిసి ఆడుకుందాం రమ్మని దేవి పిలుస్తుంది. హైడ్ అండ్ సీక్ ఆడుకుందామని చిన్మయి అంటుంది. మనం అందరం దాక్కుంటే దేవుడమ్మ అవ్వ వచ్చి అందరినీ పట్టుకోవాలని చెప్తుంది. సరే అని అందరూ దాక్కోవడానికి వెళతారు. దేవి, చిన్మయి ఒక గదిలోకి వెళ్ళి దాక్కునేందుకు వస్తారు. ఆ రూంలోని కబోర్డ్ లో ఒక దాంట్లో దేవి దాక్కుంటే మరొక దాంట్లో చిన్మయి దాక్కుంటుంది.

చిన్మయి వెళ్ళి కూర్చునే సరికి అందులో ఉన్న ఫైల్స్ అన్నీ తన మీద పడిపోతాయి. వాటిని తీసి పైన పెడుతూ ఉండగా ఒక ఫోటో కనిపిస్తుంది. ఆదిత్య, రుక్మిణి పెళ్లి ఫోటో చూసి చిన్మయి షాక్ అవుతుంది. ‘అమ్మ ఏంటి ఆఫీసర్ అంకుల్ తో ఫోటో దిగింది, ఇది పెళ్లి ఫోటో కదా అంటే అమ్మకి ఆఫీసర్ అంకుల్ కి పెళ్లి అయ్యిందా? మరి అమ్మ నాన్న దగ్గర ఎందుకు ఉంది? సత్య పిన్ని ఆఫీసర్ అంకుల్ భార్య అంటున్నారు. ఏంటి ఇది ఏమి అర్థం కావడం లేదే’ అని చిన్మయి ఆలోచిస్తుంది.   

Also Read: దేవయాని ప్లాన్ రివర్స్ - రిషిని ఆలోచనలో పడేసిన జగతి మాటలు, సంబరం చేద్దామన్న వసు

రాధ ఏడుస్తూ బాధగా ఉండటం చూసి భాగ్యమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. నేను ఎవరి గురించో ఆలోచించి ఇక్కడ ఉన్నా ఇక ఇక్కడ నిమిషం కూడా ఉండలేను జల్ది వెళ్లిపోవాలి. ఇంకా ఈ ఇంట్లో ఉండటం నాకు నా బిడ్డకి మంచిది కాదు. వెంటనే వెళ్లిపోవాలి అని రుక్మిణి అంటుంది. ఏమైంది బిడ్డ అని భాగ్యమ్మ మళ్ళీ అడుగుతుంది. ఇల్లు చూసుకోవాలి వస్తావా రావా అని రుక్మిణి కోపంగా అడుగుతుంది. వస్తాను అనేసరికి రుక్మిణి, భాగ్యమ్మ ఇల్లు చూడటానికి వెళ్లిపోతారు. ఎవ్వరూ చూడని నా అసలు రూపం రాధకి చూపించాను అని మాధవ్ పైశాచికనందం పొందుతాడు. రాధ, భాగ్యమ్మ ఇంటి కోసం వెతుకుతూ ఉంటారు. ఒక ఇల్లు చూసుకుని దాన్ని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.

Published at : 10 Sep 2022 07:52 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Devatha Serial Today Episode Written Update Devatha Serial September 10th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా