News
News
X

Gruhalakshmi October 28th: అభి, ప్రేమ్ కొట్లాట- తులసిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న పరంధామయ్య

సామ్రాట్, తులసి కలిసి తప్పు చేశారని ఇంట్లో అందరూ అవమానిస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

సామ్రాట్, తులసి ఒక రాత్రంతా కలిసే ఉన్నారని తెలిసి ఇంటికి వచ్చిన తులసిని నీచంగా అవమానిస్తూ మాట్లాడతాడు.

నందు: నా ముగ్గురు పిల్లల తల్లి మర్యాద దిగజారి పడిన వీడియో లేదా

తులసి: నాముగ్గురు పిల్లల తండ్రి, నా దృష్టిలో పాతాళానికి దిగజారిన వీడియో కూడా లేదు మిస్టర్ నందగోపాల్

నందు: దిగజారింది నువ్వు తులసి.. ఆ వర్షంలో ఆ రాత్రిలో ఆ బెడ్ రూమ్ లో

News Reels

తులసి: ఆ వర్షంలో ఆ బెడ్ రూమ్ లో ఉండి కూడా నేను దిగజారలేదు. కానీ ఇక్కడ ఉండి బుర్ర పాడు చేసుకుంటూ నువ్వు దిగజారిపోయావు

నందు: ఎక్కడ నీ కౌగిలిలోనా

తులసి: కాదు నా ఒళ్ళో.. చాలా

అనసూయ: బురదలో కాలు పెట్టి మట్టి అంటలేదంటే ఎలా తులసి

తులసి:  మనసు పవిత్రంగా ఉంటే ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి అత్తయ్య. నేను బురదలో కాలు పెట్టలేదు

నందు నీచపు మాటలకి ప్రేమ్ కోపంతో రగిలిపోయి ఇక చాలు ఆపు మిస్టర్ నందగోపాల్ అని అంటాడు. అభి అడ్డుపడి డాడ్ అడిగే దాంట్లో తప్పులేదని అంటాడు.

ప్రేమ్: అంటే నువ్వు అమ్మని అనుమానిస్తున్నావా

Also read: గుండె పగిలేలా ఏడుస్తున్న వేద- మాళవిక మీద ఆగ్రహంతో ఊగిపోతున్న అభిమన్యు, ఆజ్యం పోస్తున్న ఖైలాష్

అభి: అనుమానించడం లేదు ప్రేమ్ అదే నిజమని అంటున్నా. నిన్న రాత్రి సామ్రాట్.. అమ్మా అని మాట్లాడుతుంటే ప్రేమ్ ఆవేశంగా కొట్టేందుకు వెళతాడు. అందరూ కలిసి వాళ్ళిద్దరినీ ఆపుతారు. నువ్వు హద్దులు దాటి పాపం చేశావని అనసూయ కూడా అనేస్తుంది. నేను ఎలాంటి పాపం చేయలేదని తులసి చెప్తుంది. నేను గత 25 ఏళ్లలో ఎప్పుడైనా చిన్న తప్పు అయినా చేశానా, చెప్పలేరు ఎందుకంటే ఆ నిజం మీరు చెప్పడానికి మీ మనసు ఒప్పుకోదు. 25 ఏళ్లుగా చిన్న పొరపాటు చేయలేని నేను పాపం ఎలా చేస్తాను. ఆ మాట ఎలా అనగలిగారు అని బాధపడుతుంది.

ఈ విషయాన్ని ఇక్కడితో ఆపండని తులసి కోపంగా అడుగుతుంది. బుకాయించకుండా నీకు ఆ సామ్రాట్ కి మధ్య ఏం జరిగిందో చెప్పమని అనసూయ అడుగుతుంది. ఎన్ని సార్లు అడుగుతారు, నిజం చెప్తే ఎందుకు నమ్మడం లేదు సామ్రాట్ గారికి నాకు మధ్య స్నేహం తప్ప వేరే ఏమి లేదని చెప్తుంది. మీరు ఆశించే సమాధానం చెప్పడానికి నేను ఒప్పుకోను లేని దాన్ని ఎలా చెప్తాను, నాకు సామ్రాట్ గారికి మధ్య ఏమి లేదు నమ్మితే నమ్మండి లేదంటే చావండి అని ఏడుస్తుంది.

Also read: గృహలక్ష్మికి అగ్నిపరీక్ష- తులసిని నీచంగా అవమానించిన నందు, అనసూయ

లాస్య కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే అనసూయ సపోర్ట్ చేస్తుంది. నా పిల్లల ముందు నా కూతురు ముందు నా పరువు తీసేలా మాట్లాడకండి నిందలు వేసి తలదించుకునేలా చేయకండి అని తులసి చేతులు జోడించి వేడుకుంటుంది. తల్లిగా ఏ ఆడది చేయకూడని పని చేసినందుకు వాళ్ళు పడాల్సిందే అని నందు అంటాడు. ఇంట్లో తాతయ్య లేని టైమ్ చూసి మా అమ్మని ఇలా మాట్లాడతారా అని దివ్య అంటే అనసూయ నోరు మూయిస్తుంది. అవును తప్పు నాదే సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు పడి ఇంకా బతికే ఉన్నా చూడు అది నా తప్పు అని ఆవేదనగా మాట్లాడుతుంది. ఇక నేను ఈ అగ్ని పరీక్షకి నిలబడలేను అని తులసి అంటుంది.

నందు: ఇలాంటి నీతిమాలిన పని చేసినప్పుడు అగ్నిపరీక్షకి నిలబడాలి

తులసి: అయిన అడగటానికి మీరెవరు. అగ్నిపరీక్షకి నిలబడమనే హక్కు రాముడికి ఉంటుంది రావణాసురుడికి కాదు

అనసూయ తులసి అని గట్టిగా అరుస్తుంటే తులసి ఆపు అని చెయ్యి చూపిస్తుంది. ఇంకొక్క మాట కూడా అనొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ద్రౌపదికి పది మందిలో వస్త్రాపహరణం జరిగితే నాకు ఇంట్లోనే నా పిల్లల ముందు నా గౌరవానికి వస్త్రాపహరణం జరిగింది. నన్ను అవహేళన చేశారు. ఇంత జరిగినాక కూడ నేను ఇంట్లో ఉండలేను. నేను ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ప్లాన్ సక్సెస్ అయ్యిందని సామ్రాట్ కి ఫోన్ చేసి చెప్పనా.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని లాస్య నీచంగా మాట్లాడుతుంది.   

తరువాయి భాగంలో.. 

తులసి ఇల్లు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంటే దివ్య, అంకిత వాళ్ళు వెళ్లొద్దని బతిమలాడతారు. అప్పుడే పరంధామయ్య వచ్చి తులసి ఈ ఇంట్లో ఉంటాను అన్నా ఉండటానికి నేను ఒప్పుకొనమ్మ అని అంటాడు. 

Published at : 28 Oct 2022 08:16 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial October 28th Update

సంబంధిత కథనాలు

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని

టాప్ స్టోరీస్

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!

MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!

IND vs NZ 2nd ODI: చివరి 5 వన్డేల్లో ఓటమే! గబ్బర్‌ సేన కివీస్‌ను ఆపేదెలా?

IND vs NZ 2nd ODI: చివరి 5 వన్డేల్లో ఓటమే! గబ్బర్‌ సేన కివీస్‌ను ఆపేదెలా?