Gruhalakshmi October 27th: గృహలక్ష్మికి అగ్నిపరీక్ష- తులసిని నీచంగా అవమానించిన నందు, అనసూయ
సామ్రాట్, తులసి ఒక రోజంతా వేరే చోట కలిసి ఉండటంతో కథ కీలక మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు కూడా తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తులసి, సామ్రాట్ మధ్య స్నేహం మాత్రం ఉంటే పర్వాలేదు కానీ అంతకమించి ఏమైనా ఉంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది, లాస్య విషయంలో నేను ఏం చేశానో తులసి విషయంలో సామ్రాట్ అలాగే ఉంటే ఏంటి పరిస్థితి అని నందు ఆలోచిస్తూ ఉంటాడు. అటు సామ్రాట్ కి జ్వరం వస్తుంది. తులసి నాకు తెలిసిన వైద్యం చేస్తాను అని అంటుంది. తులసి దగ్గరుండి మరి కషాయం తాగిస్తుంది. నందు తులసి ఫోన్ చేసిన నెంబర్ కి ఫోన్ చేస్తాడు. ఒక అబ్బాయి లిఫ్ట్ చేసి ఎవరు కావాలి అని అడుగుతాడు. తులసికి ఫోన్ ఇస్తారా అని అడుగుతాడు. అంకుల్ కి బాగా ఫీవర్ గా ఉంది, ఆంటీ పక్కనే ఉంది చూసుకుంటున్నారని చెప్తాడు కానీ ఆ మాటలు నందుకి వినిపించవు. ఏంటి మళ్ళీ చెప్పు అనేసరికి అంకుల్, ఆంటీ బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారని ఆ అబ్బాయి చెప్తాడు. అది మాత్రం నందు చెవిన పడుతుంది.
Also Read: ఆదిత్యపై దేవుడమ్మ అనుమానం - మాధవ్ ఇంట్లో భాగ్యమ్మని చూసిన షాకైన సత్య
తెల్లారగానే సామ్రాట్ నిద్రలేచి తులసికి థాంక్స్ చెప్తాడు. రాత్రంతా నాకోసం నిద్రపోకుండా కష్టపడ్డారు అని అంటాడు. రాత్రి నేను ఏమైనా గీత దాటి ప్రవర్తిస్తే సోరి అని చెప్తాడు. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు. మగతగా ఉన్నప్పుడు మనసులో మాట బయటకి వస్తుంది. అయిన మనసులో ఎటువంటి కల్మషం లేనప్పుడు అగౌరవంగా ప్రవర్తించరు అని తులసి చెప్తుంది. ఇంట్లో నందు తులసి మీద ఫుల్ కోపంగా ఉంటాడు. అమ్మ ఫోన్ చేసింది దగ్గర్లోనే ఉందంట వచ్చేస్తుందని ప్రేమ్ చెప్తాడు. అది విని లాస్య వెటకారం ఆడుతుంది. మీ కోడలు కానీ కోడలు విజయోత్సాహంతో వస్తుంది సెలెబ్రేట్ చేసుకోవాలి, జంటగా వస్తారు కదా గుమ్మం దగ్గర పేర్లు చెప్పించే ప్రోగ్రామ్ కూడా పెడదాం ఒక పని అయిపోతుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది.
అది విని నందు కోపంతో రగిలిపోతాడు. ఇంటి గుమ్మం ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. అప్పుడే తులసి ఇంటికి వస్తుంది. ప్రయాణం ఎలా జరిగింది ఆంటీ అని శ్రుతి అడుగుతుంది.
నందు: ప్రయాణం కాదు ప్రేమాయణం ఎలా జరిగిందని అడుగు
తులసి: మిస్టర్ నందగోపాల్
అనసూయ: అరవకు నందు తప్పేమీ మాట్లాడలేదు. నీ అవతారమే చెప్తుంది నువ్వేదో అవకతవక పని చేశావని
ప్రేమ్, దివ్య; మామ్ గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు
నందు: చుప్.. ఈరోజు ఎవరి గొంతు వినపడటానికి, మా మధ్య రావడానికి వీల్లేదు
దివ్య: మామ్ ని ఎవరు ఏమన్నా నేను ఊరుకొను డాడ్
తులసి: పిల్లల మీద అరవకండి
Also Read: పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వేద- మాళవికని ఎత్తుకుని పరుగులు పెట్టిన యష్
నందు: వాళ్ళు నాకు కూడా పిల్లలే. వాళ్ళ మీద అరిచే హక్కు నాకు కూడా ఉంది. ముందు నీ ఒంటికి అంటించుకొచ్చిన బురద గురించి సంజాయిషీ ఇవ్వు
తులసి; నేను ఏం తప్పు చేశాను అని సంజాయిషీ ఇవ్వడానికి , ఆర్డర్స్ వేయకండి కాలుతుంది. నిజం ఏంటో జరిగింది ఏంటో అది మాత్రమే చెప్తాను అని జరిగింది అంతా చెప్తుంది
అనసూయ: నువ్వు బట్టలు తీసుకెళ్లలేదు కదా
తులసి: ఏ కుర్రాడి ఇంట్లో దిగామో ఆ కుర్రాడి తల్లి బట్టలు ఇవి. నేను మళ్ళీ ఇవి ఉతికి తిరిగి ఇవ్వాలి. వానలో తడిచినందుకు సామ్రాట్ కి హై ఫీవర్ కూడా వచ్చింది
నందు: ఓ.. అందుకేనా చలిగా ఉందని ఇద్దరు ఒకే బెడ్ రూమ్ లో ఉన్నారు. నేను రాత్రి అక్కడికి కాల్ చేశాను. ఒక కుర్రాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. రాత్రి మూడు గంటలకి మీరు ఇద్దరు బెడ్ రూమ్ లో ఉన్నారని చెప్పాడు. బెడ్ రూమ్ లో అతనితో కలిసి లేనని చెప్పకు
తులసి: ఉన్నాను.. నేను అతనితో ఒకే రూమ్ లో ఉన్నాను. కానీ అప్పట్లో మీరిద్దరు తలుపు మూసుకుని బెడ్ రూమ్ లో ఉన్నట్టు కాదు సేవలు చేస్తూ అతని మీద ధ్యాస ఉంచాను
లాస్య: మరి ఈ వీడియో చూస్తే అలా అనిపించడం లేదే.. అని తులసి వాళ్ళు డాన్స్ వేసిన వీడియో చూపిస్తుంది
అనసూయ: ఇప్పుడు ఏమంటావ్ అబద్ధం చెప్పడానికి సిగ్గు ఉండాలి
తులసి: ఇది ఫీవర్ రాకముందు చేసిన డాన్స్ తర్వాత ఇంకో వీడియోలో డాన్స్ చేస్తూ సామ్రాట్ గారు పడిపోయారు అది కూడా ఉంటుంది చూడండి