News
News
X

Ennenno Janmalabandham October 27th: పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వేద- మాళవికని ఎత్తుకుని పరుగులు పెట్టిన యష్

యష్ తన కొడుకు ఆదిత్య కోసం వేదకి తెలియకుండా మాళవికని కాపాడేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. దీంతో ఇద్దరి మధ్య అపార్థాలు వస్తాయి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
నాపై ఇంత ద్వేషం ఉన్నా ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ అని మాళవిక అడుగుతుంది.

యష్: నీకు నేను రెండు విషయాలు చెప్పాలి, నేను ఇదంతా చేస్తుంది కేవలం నా కొడుకు ఆది కోసం. రెండు నీకు నాకు మధ్య భార్యాభర్తల సంబంధం ముగిసిపోయిన అధ్యాయం. ఎప్పటికైనా నేను నీకు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.. చేసిన పనికి నువ్వంటే నాకు అసహ్యం. నీతో ప్రస్తుతం తిరుగుతున్నా ఇదంతా చేస్తున్నా అంటే కేవలం ఆది కోసమే

మాళవిక: నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావ్

యష్: నువ్వు కాదు నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నా. వేద నన్ను ఎంత గుడ్డిగా నమ్ముతుందో తెలుసా తనకి నేను అన్యాయం చేస్తున్నా.. అయిన ఇంత చేస్తున్నా అంటే అది కేవలం ఆది కోసమే. వేద నా కోసం ఎంత చేసింది. ఖుషిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తప్పని తెలిసినా నేను ఇంత చేస్తున్నా అంటే ఎందుకో తెలుసా వేద ధైర్యం, తన మంచితనం. వేద గొప్పతనమే నా భరోసా  

News Reels

Also read: మోడ్రన్ డ్రెస్ వేసి చిందులు వేసిన తులసి, సామ్రాట్ - తప్పు చేశావన్న అనసూయ

యష్, మాళవిక లాయర్ ని కలుస్తారు. మాళవిక జరిగిందంతా లాయర్ కి చెప్తుంది. మీరు చెప్పింది అంతా విన్న తర్వాత పైకి ఇది సింపుల్ గా అనిపించినా చాలా కాంప్లికేట్ అని లాయర్ అంటాడు. వేద పరధ్యానంగా ఉండటం తన బావ శశిధర్ గమనించి ఏమైందని అడుగుతాడు. ఈరోజు ఒక విచిత్రమైన విషయం జరిగింది బావ అని అంటుంది. మాళవిక, యష్ కలిసి వెళ్ళిన విషయం చెప్తుంది. యష్ నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పి ఉంటాడు ఒకవేళ ఆదికి సంబంధించిన విషయం ఏమో అంటాడు. అవును కానీ నేను ఎప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్లలేదు కదా అలాంటిది నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది.

యశోధర్ ఒక పని చేశాడు నీకు నచ్చలేదు నాతో షేర్ చేసుకుంటున్నావ్.. కానీ నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంటుంది. గోరంతని కొండంతని చేసుకోకూడదు. ఒప్పందం పెళ్లి అయినప్పుడు షరతులు వర్తిస్తాయి, యష్ తో మాట్లాడి క్లియర్ చేసుకో అని చెప్తాడు. యష్ వాళ్ళు లాయర్ దగ్గర ఉన్నప్పుడు వేద కాల్ చేస్తుంది. కానీ యష్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. ఈ కేసుతో నా జీవితం  ముడి పడి ఉంది, ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు మీరే కాపాడాలి అని యష్ లాయర్ ని అడుగుతాడు. వేద ఫోన్ చేస్తూనే ఉంటుంది. వేద వసంత్ కి ఫోన్ చేసి యష్ గురించి అడుగుతుంది. వసంత్ యష్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతాడు.

Also Read: అందరి అనుమానాలని నిజం చేస్తానంటున్న మాధవ్- దేవి ఆచూకీ తెలుసుకున్న రుక్మిణి, ఆదిత్య

హోటల్ దగ్గర ఉన్నా అని అడ్రస్ చెప్తాడు. వసంత్ ఇదే విషయం వేదకి ఫోన్ చేసి చెప్తాడు. వేద పోలీసు స్టేషన్ కి వెళ్ళిందని, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అసలు వదిలి పెట్టొద్దు అని వేద పోలీసులకి చెప్పినట్టు లాయర్ చెప్తాడు. అది విని యష్, మాళవిక షాక్ అవుతారు. ఇలాంటి విషయంలో సీసీటీవీ ఇంపార్టెంట్ అది మేనేజ్ చేయాలని లాయర్ చెప్తాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత యష్ వేదకి కాల్ చేస్తాడు కానీ మాట్లాడదు. నేరుగా వెళ్ళి మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయేలా మాట్లాడుకుంటే సరిపోతుంది బావగారు అదే చెప్పారు కదా అని వేద అనుకుంటుంది. నాకు, వేదకి మధ్య ఈ దోబూచులాట ఎందుకు అని యష్ మరోపక్క బాధపడతాడు.

Published at : 27 Oct 2022 07:42 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial October 27th Episode

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?