అన్వేషించండి

Devatha October 26th Update: అందరి అనుమానాలని నిజం చేస్తానంటున్న మాధవ్- దేవి ఆచూకీ తెలుసుకున్న రుక్మిణి, ఆదిత్య

దేవి కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ గా వెతుకుతూ ఉంటారు. కానీ సత్య మాత్రం దేవి కోసం వెళ్ళిన ఆదిత్య, రుక్మిణి గురించి అపార్థం చేసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

సూరి, భాషకి దొరికిన బకరా కరెన్సీ వాళ్ళని పీల్చి పిప్పి చేస్తాడు. తనకి నచ్చింది తెప్పించుకుని లాగించేస్తూ ఉంటాడు. అది చూసి సూరి ఏడుస్తాడు. తట్టుకోలేక కరెన్సీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తారు. కరెన్సీ ఫోన్ లిఫ్ట్ చేసి నా దగ్గర డబ్బులు ఎవరో కొట్టేశారు మీరు నాకు ఒక రూ.50 వేలు పంపించండి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దేవుడమ్మ దేవుడికి పూజ చేస్తూ దేవి కనిపించేలా చెయ్యమని వేడుకుంటుంది. నా బిడ్డ, అటు రాధ దేవి కోసం వెతుకుతుంటే ఇటు సత్య అపార్థం చేసుకుని గుడిలో నిద్రలు చేస్తుంది. ఇద్దరికీ చెప్పలేను. దేవి కనిపించకపోతే నా కుటుంబంలో ఈ కలతలు రావడం ఏంటో అర్థం కావడం లేదని దేవుడమ్మ తన బాధని మొరపెట్టుకుంటుంది. ఎప్పుడు లేనిది సత్య ఈ విషయంలో ఎందుకు అపార్థం చేసుకుంటుందో తెలియడం లేదని బాధపడుతుంది.

Also Read: మాళవిక కన్నింగ్ ప్లాన్- గుండె పగిలేలా ఏడుస్తున్న వేద, అల్లుడిని ఆకాశానికి ఎత్తేసిన సులోచన

మాధవ్ ఎటువంటి టెన్షన్ లేకుండా నిమ్మళంగా కూర్చుని ఉండటం చూసి భాగ్యమ్మ అనుమానపడుతుంది. రాధ నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు నాలో తెలియని ఆనందం అలాంటిది నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావని ఆశపడుతుంటే ఆ ఆదిత్య అడ్డు వచ్చేవాడు, ఈసారి మా అమ్మ అడ్డు వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేసిందని అనుకుంటూ ఉండగా భాగ్యమ్మ కోపంగా వస్తుంది. దేవమ్మ కోసం ఊరంతా చూసిన ఎక్కడా కనిపించలేదు. తనని నీ బిడ్డలాగే చూశావ్ చేతి మీద పచ్చ బొట్టు కూడా వేయించుకున్నావ్ అలాంటిది బిడ్డ కనిపించడం లేదని నా బిడ్డ కంగారుపడుతుంటే నువ్వు నిమ్మళంగా ఉన్నావంటే అనుమానం వస్తుంది. బిడ్డ కనిపించకపోవడానికి నువ్వే కారణం అని అనిపిస్తుందని అంటుంది.

నీ అనుమానాలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాధవ్ చెప్తాడు. మర్యాదగా దేవిని తీసుకొచ్చి నా బిడ్డ చేతిలో పెట్టకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇస్తుంది. నా మీద నీకు అనుమానం కదా దాన్ని నిజం చేస్తాను అప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అని మాధవ్ సైలెంట్ గా చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవి కోసం ఆదిత్య, రుక్మిణి వాళ్ళు అనాథ ఆశ్రమంకి వెళతారు. ఒక్కరి కోసం నువ్వు చేసిన త్యాగం నన్ను నా బిడ్డని దూరం చేసింది అని ఆదిత్య రుక్మిణి మీద అరుస్తాడు. రుక్మిణిగా చచ్చిపోయి రాధగా బతికి నీ కష్టాలు నువ్వే తెచ్చుకున్నావ్ అని తిడతాడు. ఆ పొద్దు సత్య కోసమే కాదు నీ కోసం కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండాలని వచ్చేశాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఆ రోజే నేను ప్రాణాలు తీసుకున్న పోయేది ఇలా అయ్యేది కాదని రుక్మిణి ఏడుస్తుంది.

Also Read: బాబోయ్ ఇవేమి అరచకాలు సామీ!- అనసూయకి నూరిపోస్తున్న లాస్య

అనాథ ఆశ్రమం దగ్గర ఒక వ్యక్తి దేవి ఫోటో చూసి ఎవరో ఈ పాపని జీబులో ఎక్కించుకుని వెళ్ళడం చూశాను అని చెప్తాడు. ఎవరు తీసుకెళ్లారు ఎటు వెళ్లారని అడుగుతాడు.  వాళ్ళు కొయ్యగూడెం వైపు వెళ్లారు మీరు అటు వెళ్తే పాప ఖచ్చితంగా దొరుకుతుందని అతను చెప్తాడు. దేవుడమ్మ మాధవ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. బిడ్డ కనిపించకపోతే ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. బిడ్డ కనిపించకపోతే కనీసం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా అని నిలదిస్తుంది. పిల్ల మాతో కాసేపు ఉంటేనే దూరం చేస్తున్నాం అని గొడవ చేస్తావ్ కదా మరి ఇప్పుడు ఏమైంది.. ప్రేమ చూపించాల్సింది ఇప్పుడు అనేసి దేవుడమ్మ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. రుక్మిణి ఇంటికి ఫోన్ చేసి దేవి కనిపించిందంట ఒకాయన చెప్పారు మేము వెళ్తున్నాం నువ్వేమి టెన్షన్ పడకు అని చిన్మయికి ఫోన్ చేసి చెప్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget