అన్వేషించండి

Gruhalakshmi October 17th Update: జాబ్ మానేసిన నందు, సామ్రాట్ ముందు అడ్డంగా బుక్కైన లాస్య- చేతులెత్తేసిన అనసూయ

సామ్రాట్ కి తనకి మధ్య స్నేహం తప్ప వేరే ఏమి లేదని తులసి అందరి ముందు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

దివ్య పొద్దు పొద్దున్నే లేచి హడావుడి చేస్తుంది. అంకిత పొద్దున్నే నిద్ర లేచిందని దివ్య ఆటపట్టిస్తుంది. ఈరోజు నుంచి నీ కొడుకు, కోడళ్లకి ఒక రూల్ పెట్టు నైట్ గదిలోకి వెళ్లేటప్పుడు మొబైల్స్ నీ దగ్గర పెట్టేయమని చెప్పు అని ఐడియా ఇస్తుంది. ఆ మాటకి అంకిత దివ్య చెవి మెలిపెట్టేసరికి పారిపోతుంది. ప్రేమ్, శ్రుతి ఎవరికి కనిపించకుండా వెళ్లాలనుకుంటే పరంధామయ్యకి చిక్కుతారు. అనసూయ స్వీట్స్ తీసుకొచ్చి పిల్లలు పుట్టే దాకా గది దాటకూడదని పరంధామయ్య ఆపుతాడు. కానీ ప్రేమ్ మాత్రం జారుకుంటాడు.

లాస్య అనసూయకి ఫోన్ చేస్తుంది. సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకుంటున్నాడు అని కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తుంది. మీ అబ్బాయి జాబ్ వదిలేశాడని చెప్తుంది. వీడికి ఈ వదిలెయ్యడం పిచ్చి ఏంటి ఈ అలవాటు మానదా, పెళ్ళాన్ని కాదని ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు మళ్ళీ ఈ ఉద్యోగం ఎందుకు వదిలేశాడని తిడుతుంది. మీ కోడలు కానీ కోడలికి ఆయన ఆఫీసులో ఉండటం  ఇష్టం లేదనుకుంటా సామ్రాట్ ని రెచ్చగొట్టి అవమానించేలా చేసింది. పండగ రోజు సామ్రాట్, తులసిని నిలదీశారు కదా అది మనసులో పెట్టుకుని మా మీద పగ సాధిస్తున్నాడు. నన్ను జాబ్ మానేయమంటున్నాడు. పస్తులతో ఉంటే కాళ్ళ బేరానికి వస్తామని తులసి అనుకుంటుందని లాస్య బాగా ఎక్కిస్తుంది. ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని అనసూయ అరుస్తుంది. తులసి ఎందుకు ఇలా తయారై అందరినీ ఇలా ఏడిపిస్తుందని అనసూయ మనసులో అనుకుంటుంది.

Also Read: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి

అప్పుడే తులసి అనసూయ దగ్గరకి వచ్చి బయటకి వెళ్తున్నా అని చెప్తుంది. నాకు ఎందుకు చెప్పడం అని నిష్టూరం ఆడుతుంది. అభి వచ్చి ఏమైందని అనసూయని అడుగుతాడు. ఈ ఇంటి బరువు బాధ్యతలు మోసేది మీ అమ్మే. నమ్ముకున్న దిక్సూచిని తప్పుదారి పడితే ఎలా. ఆఫీసులో మీ అమ్మ మీ నాన్న అవమానపడేలా చేసిందంట, మీ నాన్న ఉద్యోగం మానేశారు అని అనసూయ చెప్తుంది. ఆ మాటకి అభి అంతెత్తున ఎగిరిపడతాడు. తులసికి చెప్పగలిగేది ఒక్క మీ తాతయ్య ఆయనతో మాట్లాడుకో అని చెప్తుంది. సామ్రాట్ పరంధామయ్యకి ఫోన్ చేస్తాడు. ఎవరు లేని చోటకి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు.

నాకు చెప్పిన పని నేను పూర్తి చేశాను అని సామ్రాట్ చెప్తాడు. మీరు చేసిన ఒక మంచి పనిలో నాకు భాగస్వామ్యం కల్పించారు చాలా సంతోషంగా ఉందని అంటాడు. మీ లాంటి మంచి మావయ్య దొరకడం తులసి అదృష్టం అని సామ్రాట్ అంటే కాదు దురదృష్టం నా కొడుకు వల్ల తులసి పడరాని పాట్లు పడుతుంది. తులసి కోసం ఏం చేయలేకపోతున్నా అని బాధపడ్డాను మీ వల్ల అది నాకు దూరం అయ్యిందని పరంధామయ్య అంటాడు. సామ్రాట్ తులసిని చూసి మురిసిపోవడం చూసి వాళ్ళ బాబాయ్ కాసేపు ఆడుకుంటాడు. లాస్య నేరుగా సామ్రాట్ దగ్గరకి వస్తుంది. ఈసారి నుంచి నా క్యాబిన్ లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టు లేదంటే సెక్రటరీని అడిగి అపాయింట్ మెంట్ తీసుకో అని గాలి తీస్తాడు. నందు ఎక్కడ అని అడుగుతాడు. జాబ్ మానేశాడు అని లాస్య చెప్పడంతో సామ్రాట్ షాక్ అవుతాడు. నందులాంటి వాళ్ళని చూస్తే మనుషుల మీద నమ్మకం పోతుందని అంటాడు. నందు పనులు నేను చూసుకుంటాను, ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని అడుగుతుంది.

Also Read: దుర్గ కాళ్ళ మీద పడి బతిమలాడుకున్న మోనిత, చుక్కలు చూపించిన దీప- శౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్

టాప్ హెడ్ లైన్స్

Comedy Drama OTT: ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
Godavari Serial Today October 28th: 'గోదావరి' సీరియల్: జాను మీద నందు అసూయ! ఆఫీస్‌లో కొత్త తలనొప్పి! సంజయ్, జాను షికారు!
'గోదావరి' సీరియల్: జాను మీద నందు అసూయ! ఆఫీస్‌లో కొత్త తలనొప్పి! సంజయ్, జాను షికారు!
Nindu Manasulu Serial Today October 28th: నిండు మనసులు: గణలో ఊహించని మార్పు! షాక్‌లో ఇందిర, రాజశేఖరం! సంతోషంలో ఫ్యామిలీ!
నిండు మనసులు: గణలో ఊహించని మార్పు! షాక్‌లో ఇందిర, రాజశేఖరం! సంతోషంలో ఫ్యామిలీ!
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget