News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gruhalakshmi May 31st: తులసి ప్లాన్ ఫెయిల్, నందుకి ఐదేళ్ల జైలు శిక్ష- దివ్యని ఇరికించేందుకు పక్కా స్కెచ్ వేసిన రాజ్యలక్ష్మి

నందుకి జైలు శిక్ష పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

తల్లిని నడిపించినందుకు విక్రమ్ దివ్యకి గులాబీ పువ్వు ఇస్తాడు. ఇది అమ్మ మీద ప్రేమతో ఇచ్చావా ఇంకా నా మీద ప్రేమతో అనుకున్నా అని ఆ పువ్వు తిరిగి ఇచ్చేస్తుంది. నీకు తల్లి మీద ఉన్న ప్రేమని తప్పుబట్టను కానీ భార్య మీద ప్రేమని గైడ్ చేయకూడదు అర్థం చేసుకోమని చెప్తుంది. ఇద్దరూ కలిసి కోర్టుకి వెళ్లాలని అనుకుంటారు. నందు, తులసి కోర్టుకి వెళ్ళడం కోసం ఇంట్లో నుంచి బయటకి రాగానే ఎదురుగా లాస్య ఉంటుంది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు మాదిరిగా బాగానే నడుస్తున్నారు కొంచెం కూడా సిగ్గు లేదా అని లాస్య దెప్పి పొడుస్తుంది. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు జైలుకి దగ్గర చేస్తుంది ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కాపాడలేదు. కారు కోర్టుకి చేరేలోపు ఒకనిర్ణయం తీసుకో, మనం కలిసి ఉండాలని అనుకుంటే నా దారికి రా అన్నీ మర్చిపోదాం లేదంటే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను మర్చిపోయేలా చేస్తానని లాస్య ఆఫర్ ఇస్తుంది. అందరూ కలిసి ఒకే కారులో కోర్టుకి వెళతారు.

Also Read: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్

కారులో వెళ్తూ లాస్య, తులసి పోట్లాడుకుంటారు. ఉప్పు నిప్పులా ఉండేలా మీరు ఇప్పుడు ఏం జరగనట్టు తిరుగుతున్నారని దెప్పిపొడుస్తుంది. నువ్వు ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటిదానికి వేసుకుంటే చావే గతి. తులసి అమృతం లాంటిది. నమ్మిన వాళ్ళని బతికిస్తుంది. నువ్వు కూడా అమృతాన్ని ఇష్టపడమని నందు లాస్యకి గడ్డి పెడతాడు. ఆ అమృతం ఇష్టం లేకనేగా నా సంకలో దూరావు ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడోనని తిడుతుంది. కోర్టు దగ్గరకి రాగానే నందు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎంత దగ్గర అవుదామని చూస్తున్న దూరం అవుతున్నాడని లాస్య తులసితో అంటుంది. నువ్వు మారుతున్నా అంటున్నావ్ కానీ మారావా నిజంగా.. ఇప్పటికీ కూడా నువ్వు రాజ్యలక్ష్మితో టచ్ లో ఉన్నావని తులసి తిడుతుంది.

ఇంతకముందు నా ఫోన్లో వీడియో చూశావ్ మర్చిపోయావా? అది చూపిస్తే ఐదేళ్ల శిక్ష పడుతుందని లాస్య బెదిరిస్తుంది. నీ వల్ల కాదు నువ్వేం చేయలేవని తులసి ధీమాగా చెప్తుంది. అయితే నా దగ్గర ఉన్న వీడియో మామూలుది కాదని అంటే అయితే చూపించు అంటుంది. ఫోన్లో వీడియో లేకపోయే సరికి షాక్ అవుతుంది. కోర్టులో వాదనలు స్టార్ట్ అవుతాయి. లాస్య కాసేపు ఆలోచనలో పడి వీడియో తీసుకొచ్చి చూపించి అందరికీ షాక్ ఇస్తుంది. ఆ వీడియో చూసి జడ్జి అడుగుతాడు. లాస్య మీద చేయి చేసుకుంటున్న ట్టు ఒప్పుకుంటున్నారా? అని అంటాడు. వీడియో ఎలా వచ్చిందా అని తులసి టెన్షన్ పడుతుంది. గృహహింస కేసులో నందుని దోషిగా తేల్చి ఐదు సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిస్తాడు. దివ్య నందుని పట్టుకుని ఏడుస్తుంది. మీ అమ్మకి చేసిన దానికి పడిన శిక్ష అని బాధపడతాడు.

Also Read: అభిమన్యుని చితక్కొట్టిన యష్- మాళవికని ఇంటికి తీసుకొచ్చిన వేద

దివ్యని జాగ్రత్తగా చూసుకోమని విక్రమ్ కి అప్పగిస్తాడు. వీడియో విషయంలో ముందు జాగ్రత్త పడతాను కదా తప్పుడు సలహాలు ఇచ్చి నందుని జైలుకి వెళ్ళేలా చేశావని లాస్య తప్పుని తులసి మీదకు నెట్టేస్తుంది. సోరి నందు నిన్ను జైలుకి పంపించాలనే ఉద్దేశం లేదు ఇప్పటికైనా మించి పోయింది లేదు నా మాట విను అంటుంది. కానీ నందు మాత్రం వినే ప్రసక్తే లేదు జైలు నుంచి వచ్చిన తర్వాత నీ లైఫ్ నేను మారుస్తానని నందు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

Published at : 31 May 2023 10:59 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial May 31st Update

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!