By: ABP Desam | Updated at : 31 May 2023 09:26 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
రాహుల్ శృతిని ఎప్పుడూ తీసుకొచ్చే హోటల్ దగ్గరకి కావ్యని తీసుకుని వస్తుంది. అదే హోటల్ లో స్వప్నని కూడా ఉంచాడాని మేనేజర్ సంగతి ఎలాగైనా తేల్చి రాహుల్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలని కావ్య డిసైడ్ అవుతుంది. తనని గుర్తు పడితే విషయాలు చెప్పడని కావ్య మాస్క్ పెట్టుకుని హోటల్ లోకి వస్తుంది. మేనేజర్ దగ్గరకి వచ్చి శృతి పలకరిస్తుంది. ఆయన ఎప్పుడు వచ్చిన 420 నెంబర్ రూమ్ లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే ఆ రూమ్ ఆయనకే ఇస్తాను. రాహుల్ గారితో ఎంతో మంది వస్తారు. ఆ విషయాలన్నీ చెప్పడం కుదరదని అనేసరికి కావ్య మేనేజర్ ని లాగిపెట్టి ఒకటి పీకుతుంది. తను ఎవరో తెలుసా సైబర్ సిటీ పోలీసాఫీసర్ నిజాలు చెప్పకపోతే ఊరుకొనని బెదిరిస్తుంది. వారానికి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు వాళ్ళకి అన్నీ నేనే చూసుకుంటాను టిప్ కోసం కక్కుర్తి పడి చేశానని అంటాడు. స్వప్న హోటల్ కి వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడిగితే దాన్ని రాహుల్ డిలీట్ చేసేశాడాని చెప్తాడు. ఉన్న ఒక్క ప్రూఫ్ లేకుండా చేశాడని వాడిని మళ్ళీ కొట్టేసి కావ్య వాళ్ళు వెళ్లిపోతారు.
Also Read: అభిమన్యుని చితక్కొట్టిన యష్- మాళవికని ఇంటికి తీసుకొచ్చిన వేద
అప్పు, కళ్యాణ్ ఇంటికి వస్తారు. స్వప్నని తీసుకుని వస్తుంటే కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. పెళ్లి కొడుకు అరుణ్ తనని చెక్ చేసి ఈ నిశ్చితార్థం జరగదు స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అటు దుగ్గిరాల ఇంట్లో తాంబూలాలు మార్చుకునేందుకు రెడీ అవుతారు. ఇవాళే లగ్నపత్రిక రాసుకుందామని రుద్రాణి అరుంధతిని అడుగుతుంది. ముందు నిశ్చితార్థం జరగనివ్వమని అపర్ణ అంటుంది. ఎందుకు అన్నీ నీ కొడుక్కి జరిగినట్టే జరుగుతాయనా? ఎవరో అనామకురాలిని నీ కోడలిని చేసుకున్నావ్. పంతులుగారు మీరు రాజ్ కి పెట్టినట్టు కాకుండా మంచి ముహూర్తం పెట్టమని చెప్తుంది. ఇక్కడ ఎవరూ ముసుగు వేసి తీసుకొచ్చే వారు లేరని అపర్ణ కౌంటర్ వేస్తుంది. వెన్నెల తరఫున అపర్ణ వాళ్ళు తాంబూలం తీసుకుని కన్యాదానం కూడా వాళ్ళే చేస్తారని అరుంధతి చెప్తుంది.
హోటల్ ఎదురుగా వేరే బిల్డింగ్ మీద సీసీటీవీ కెమెరా ఉండటం కావ్య గమనిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి పోలీసాఫీసర్ అని అబద్ధం చెప్పి సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతారు. ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. వాడు దుర్మార్గుడు ఎదురు వెళ్లలేనని శృతి అనేసరికి ఆ వీడియో మొత్తం కావ్య తన ఫోన్ లోకి ఎక్కించుకుంటుంది. స్వప్న పరిస్థితి గురించి ఇంట్లో అందరూ బాధపడతారు. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని చంపాలా నేను చావాలా? నీ కూతురు లేచిపోయి తిరిగొచ్చిందా అన్నవాళ్లు ఇప్పుడు కడుపుతో తిరిగి వచ్చిందా అంటారు. ఆడపిల్ల చెడిపోయింది అంటే అది తల్లి పెంపకంలో లోపమేనని కనకం గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఇది చేసిన తప్పు సరిదిద్దడానికి కావ్య అక్క చాలా కష్టపడుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే న్యాయం చేయమని అడుగుదామని అప్పు అంటుంది. తనని తీసుకుని అప్పు, కళ్యాణ్ బయల్దేరతారు.
Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన తింగరిపిల్ల - కృష్ణని వదులుకోలేనని బాధపడుతున్న మురారీ
స్వప్నని రాజ్ ఇంటికి తీసుకుని వస్తుంది. అక్కడ రాహుల్, వెన్నెల నిశ్చితార్థం ఫ్లెక్సీలు చూసి స్వప్న రగిలిపోతుంది. రాహుల్ స్టేజ్ మీద వెన్నెలకి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నా జీవితంలో నేను తలెత్తి చూసిన ఏకైక అమ్మాయివి నువ్వే. వెన్నెలని చేసుకుంటే నా లైఫ్ అంతా వెన్నెలే. ఇవాళ మా ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుటుందంటే నమ్మలేకపోతున్నా. వెన్నెల ఐలవ్యూ అని రాహుల్ అందరి ముందు స్టేజ్ మీద చెప్పడం మొత్తం స్వప్న కళ్ళారా చూస్తుంది.
Bigg Boss Telugu Season 7 Episode 19: మగాళ్లకు సెన్స్ ఉండాలి, ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు: శోభాశెట్టి కామెంట్స్ - గౌతమ్కు అన్యాయం?
నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!
మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
New Parliament: కొత్త పార్లమెంట్ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>