By: ABP Desam | Updated at : 31 May 2023 08:18 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
చెత్తలో పడిన మాళవిక మన కోసం ఎవరూ రారని ఏడుస్తుంది. దేవుడా మోసం చేసిన వాడిని ఎందుకు చూస్తూ వదిలేశావ్, మోసపోయిన మమ్మల్ని చెత్త పాలు చేశావు. నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు దిక్కులేని వాడిలా మారాలని మాళవిక బాధపడుతూ అభిమన్యుని తిడుతుంది. వేద, యష్ ఒక్కటవుతున్న వేళ ఆదిత్య ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే డాడీ డాడీ అని ఏడుస్తాడు. ఎక్కడ ఉన్నావ్ ఏమైందని యష్ కంగారుగా అడుగుతాడు. త్వరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆదిత్య ఫోన్ చేశాడు ఎక్కడో బార్ దగ్గర ఉన్నాడంట భయంగా ఉందని చెప్పి ఏడుస్తున్నాడని యష్ వేదతో చెప్తాడు. దీంతో వెంటనే ఇద్దరూ ఆదిత్య చెప్పిన ప్లేస్ కి వెళతారు. తన తల్లికి హెల్ప్ చేయమని ఆదిత్య రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ బతిమలాడతాడు.
Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన తింగరిపిల్ల - కృష్ణని వదులుకోలేనని బాధపడుతున్న మురారీ
యష్, వేద ఆదిత్యని వెతుక్కుంటూ వస్తారు. చెత్తలో పడి ఉన్న మాళవికని చూసి షాక్ అవుతారు. యష్ ని చూడగానే ఆదిత్య నాన్న అని గట్టిగా ఏడుస్తాడు. ఆదిత్యని తీసుకుని యష్ వెళ్లిపోదామని అంటాడు. మమ్మీ రాకపోతే నేను రానని ఆదిత్య మళ్ళీ తల్లి దగ్గరకి వెళతాడు. మాళవికని కూడా తమతో పాటు తీసుకెళ్దామని వేద అంటే వద్దని యష్ కోపంగా అరుస్తాడు. ఈరోజు నా కొడుకు రోడ్డు పక్కన ఉండి అందరి కాళ్ళ వేళ్ళా పడుతున్నాడంటే అందుకు కారణం ఎవరు ఈ మాళవికనే. తాగి ఇలాగేనా రోడ్డు మీద పడిపోయేదని సీరియస్ అవుతాడు. ఆడదాన్ని ఇలాగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని వేద సర్ది చెప్తుంది. తను మారదు ఆమె నీడ కూడ నీమీద పడకూడదని అంటాడు. తను ఈ పరిస్థితిలో నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని యష్ చెప్తాడు.
Also Read: కావ్య ఫినిషింగ్ టచ్ సూపర్- అన్ని నిజాలు చెప్పేసిన స్వప్న, రాహుల్ పని ఇక ఇత్తడే
వేద ఆదిత్యని రమ్మని అంటుంటే మమ్మీ లేకుండా ఎక్కడికి రానని అంటాడు. ఆదిత్యని తీసుకెళ్లాలంటే మాళవికని కూడా మనతో తీసుకుని వెళ్ళాలి తప్పదని వేద చెప్తుంది. చెత్తలో ఉన్న తనని లేపి ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో మాలిని వాళ్ళు వేద వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుని సంబరపడతారు. అప్పుడే యష్ ఆదిత్యని తీసుకుని ఇంటికి వస్తాడు. తను ఏడవటం చూసి ఏమైందని కంగారుపడుతుంది. యష్ ఏమైంది ఆదిత్య ఎందుకు ఏడుస్తున్నాడు, నువ్వు వేద కలిసి వెళ్లారు కదా ఆదిత్య ఎక్కడ నుంచి వచ్చాడని అడుగుతుంది. అప్పుడే వేద తాగి తూలిపోతున్న మాళవికని తీసుకుని ఇంటికి వస్తుంది. తప్పతాగి ఉన్న తనని చూసి మాలిని కోపంగా ఉంటుంది. ఇది కూడా నీ ఇల్లేనని వేద తనని ఇంట్లోకి తెస్తుంది. తనని శుభ్రం చేసి గదిలో పడుకోబెడుతుంది. నాకు ఎవరూ లేరు అందరూ నన్ను మోసం చేశారని మాళవిక గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆవిడని తల్లిలా, చెల్లిలా చూసుకుంటున్నావని యష్ వేదని అడుగుతాడు. వాళ్ళు గతంలో ఎలా ప్రవర్తించారోనని ఆలోచించకూడదని వేద నచ్చ జెపుతుంది.
‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Jamal Kudu Song: బాబీడియోల్ ‘జమల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?
Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
/body>