By: ABP Desam | Updated at : 30 May 2023 09:17 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
రుద్రాణి కొడుకు రాహుల్ కి ఇంట్లో నిశ్చితార్థం పెట్టుకున్నారని కనకం చెప్పడం స్వప్న విని షాక్ అవుతుంది. రుద్రాణి ఇందాకే ఫోన్ చేసింది మన పరిస్థితి ఇలా ఉందని నేను రానని చెప్పానని అంటుంది. రౌడీలు కావ్య, శృతిని కట్టి పడేస్తారు. మాకు ఒక కాల్ వస్తుంది అప్పటి వరకు మిమ్మల్ని వదిలేది లేదు అప్పటి వరకు గొడవ చేయకుండా ఉంటే మీకు మాకు మంచిదని చెప్పేసి రౌడీలు వెళ్లిపోతారు. తన దగ్గర ఫోన్ ఉన్న విషయం గుర్తు చేసుకుని కావ్య వెంటనే అప్పుకి మెసేజ్ చేస్తుంది. అప్పు మేం కిడ్నాప్ అయ్యాం వచ్చి హెల్ప్ చేయమని మెసేజ్ వస్తుంది. మా అన్నయ్యని కిడ్నాప్ చేశారా? తనని కాపాడదామని కళ్యాణ్ భయపడతాడు. ఇంత ప్రేమగా అప్పు అని పిలిచారంటే మెసేజ్ చేసింది కావ్య అక్క వెంటనే వెళ్ళి కాపాడాలని చెప్తుంది. లెటర్ బంటికి ఇచ్చి ఎవరికి తెలియకుండా స్వప్నకి ఇవ్వమని వెళ్లిపోతారు.
Also Read: రోడ్డు పక్కన చెత్తలో మాళవిక, ఏడిపించేసిన ఆదిత్య- యష్, వేద రొమాంటిక్ మూమెంట్
రాహుల్ కి పెళ్ళా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో గొడవ అయ్యిందని అన్నాడు, ఇంతలోనే పెళ్ళా, ప్రేమించిన వాడిని నమ్మాలా లేదంటే చెల్లిని నమ్మాలా అని ఆలోచిస్తూ ఉండగా బంటి తీసుకొచ్చి లెటర్ ఇస్తాడు. రాహుల్ నిన్ను ప్రేమించలేదు ప్రేమించినట్టు నటించాడు. నిన్నే కాదు ఎంతోమందిని మోసం చేశాడు. నువ్వు నా మాటలు నమ్మవని తెలుసు కావాలంటే ఒక్కసారి మా ఇంటికి రా రాహుల్ అసలు రంగు నీకు తెలుస్తుందని కావ్య లెటర్ లో రాస్తుంది. నా రాహుల్ నన్ను మోసం చేశాడా?ఎవరిని నిందించాలని ఆలోచనలో పడుతుంది. అటు దుగ్గిరాల ఇంట్లో రాహుల్, వెన్నెలకి నిశ్చితార్థం చేసేందుకు పూజ జరుగుతుంది. కావ్య ఎక్కడని సీతారామయ్య రాజ్ ని అడుగుతాడు. ఏమైంది మళ్ళీ కనపడకుండా పోయిందా అని రుద్రాణి వెటకారంగా అడుగుతుంది. తానే బయటకి పంపించానని రాజ్ అబద్ధం చెప్తాడు. కావ్య ఎక్కడికి వెళ్లిందో రాజ్ కి తెలుసా తెలియదా? అయినా కిడ్నాప్ చేయించాను కదా ఎంగేజ్మెంట్ అయినాక వదిలిపెడతారని రాహుల్ మనసులో అనుకుంటాడు.
Also Read: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య
నిశ్చితార్థం చేసుకునేందుకు అరుణ్ కుటుంబం స్వప్న ఇంటికి వెళతారు. రాజ్ కావ్య ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడతాడు. వెంటనే తన బాబాయ్ దగ్గర ఫోన్ తీసుకుని కావ్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ కలవకపోవడంతో ఏమైందా అని రాజ్ టెన్షన్ పడతాడు. కావ్య దగ్గర ఫోన్ రింగ్ అవడం రౌడీలు చూసి ఫోన్ తీసేసుకుంటారు. అప్పుడే అప్పు ఎంట్రీ ఇస్తుంది. కళ్యాణ్ కూడా అప్పు వెంట ఉంది కావ్య వాళ్ళని రక్షిస్తాడు. అప్పు రౌడీలని చితకబాదుతుంది. మిమ్మల్ని ఎవరు పంపించారని కావ్య అడుగుతుంది. అప్పు వాళ్ళని స్వప్నని ఇంటికి తీసుకురమ్మని చెప్పి కావ్య వాళ్ళు సాక్ష్యాల కోసం వెళ్లిపోతారు. రాహుల్ నిశ్చితార్థం కోసం రెడీ అయి వస్తే మీడియా వాళ్ళు వచ్చి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. కావ్యని అవమానించేలా మీడియా వాళ్ళు కావాలని ప్రశ్నలు వేస్తారు. మీతో ఎవరైనా కావాలని ఇలా అడిగిస్తున్నారా? ఏంటని ఇంద్రాదేవి అనేసరికి రుద్రాణి గుటకలు వేస్తుంది. స్వప్నని పెట్టిన హోటల్ దగ్గరకి కావ్యని శృతి తీసుకొస్తుంది.
Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్రను చెప్పేశారు!
Bigg Boss Telugu Season 7 Episode 19: మగాళ్లకు సెన్స్ ఉండాలి, ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు: శోభాశెట్టి కామెంట్స్ - గౌతమ్‌కు అన్యాయం?
నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!
మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>