అన్వేషించండి

Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య

నందు మీద లాస్య గృహహింస కేసు పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే,..

లాస్య నందు మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తుంది. కేఫ్ లో నందు లాస్యని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తుంది. ఈ బాధ తట్టుకోలేక మీ ఆయన నీ కాళ్ళ బేరానికి వస్తాడని సోషల్ మీడియాలో వీడియో పెట్టె వ్యక్తి చెప్తాడు. వెంటనే పని పూర్తి చేయమని అతనికి డబ్బులు ఇస్తుంది. కేఫ్ లో నందు, తులసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందని నందు నవ్వుతూ ఉంటాడు. ఇంట్లో కూర్చుంటే కేసు గురించి ఆలోచనలు, చుట్టూ లాస్య గురించి ఆలోచనలు. కేఫ్ కి వస్తే అవన్నీ ఉండవని చెప్పానని తులసి అంటుంది. నువ్వు చెప్పిన ప్రతీసారి మంచే జరుగుతుందని నందు అంటాడు. కేఫ్ లో కూర్చున్న అమ్మాయి నందు లాస్యని కొట్టిన వీడియో చూస్తుంది.

Also Read: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

చూడటానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు భార్యని కొట్టడానికి సిగ్గు లేదా? అని అడుగుతుంది. కొట్టడం ఏంటని నందు అంటే ఆన్ లైన్ లో వీడియో వస్తుందని చెప్తుంది. నందు అది చూసి షాక్ అవుతాడు. డివోర్స్ ఇచ్చారు పద్ధతిగా ఉండవచ్చు కదా ఆ ఇకఇకలు పకపకలు ఏంటి? పబ్లిక్ లో ఎలా కులుకుతున్నారు? వీళ్లిద్దరి క్యారెక్టర్ అంత మంచిది కాదు వీళ్ళ కేఫ్ లో ఉంటే మనకి చెడ్డ పేరు అందరం కలిసి బాయ్ కాట్ చేద్దామని వెళ్లిపోతారు. ఏంటి తులసి ఇదంతా ఈ న్యూస్ ఏంటి? ఎవరు ఇదంతా చేశారని నందు అంటుండగా ఇది నా పనే అని లాస్య ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు మీకు కేఫ్ కి సంబంధం లేకుండా పోయింది జనం మిమ్మల్ని బాయ్ కాట్ చేశారనేసరికి నందు మళ్ళీ లాస్య మీదకి చెయ్యి ఎత్తితే తులసి ఆపుతుంది. దివ్య రాజ్యలక్ష్మి కాలికి నూనె రాసి మసాజ్ చేస్తుంటే నొప్పిగా ఉన్నట్టు అమ్మా అని గట్టిగా అరుస్తుంది. నీ పెళ్ళాం మీ అమ్మ కాలు విరిచేలాగా ఉందని బసవయ్య అంటుంటే తానొక డాక్టర్ అనే సంగతి మర్చిపోవద్దని చెప్తుంది. అమ్మ బాధపడుతుంటే చూడలేకపోతున్నానని విక్రమ్ అనేసరికి అయితే బయటకి వెళ్ళమని అంటుంది.

అందరినీ బయటకి పంపించేస్తుంది. ఇంత తొందరగా నా చేతికి చిక్కుతావని అనుకోలేదు. రేపటితో మీ నాటకానికి శుభం కార్డు పడాలి. లేదంటే మీకు కుడి కాలు తీసి ఎడమ చేతిలో పెడతా పిచ్చి వేషాలు వేయకని వార్నింగ్ ఇస్తుంది. భాగ్య అనసూయ దగ్గరకి వస్తుంది. లాస్యని కాదు బయటకి గెంటాల్సింది నిన్ను అని తన మీదకి వెళ్లబోతుంటే తులసి వచ్చి తనని నేనే రమ్మని పిలిచానని చెప్తుంది. తను పరాయిది కాదు ఈ ఇంటి కోడలని అంటుంది. తులసక్క పిలిచిందని తోక ఊపుకుంటూ వచ్చి తప్పు చేశానా ఏంటని భాగ్య మనసులో అనుకుంటుంది. భాగ్య ఇప్పుడు కష్టాల్లో ఉంది వాళ్ళ ఆయన ఉద్యోగం పోయింది మూడు నెలల నుంచి జీతం లేక ఇబ్బందులు పడుతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గరకి రావచ్చు కదా భాగ్య. చేతనైన సహాయం చేసేదాన్ని కదా. నాకున్న పరపతితో మీ ఆయన సస్పెషన్ క్యాన్సిల్ చేయించాను. వెళ్ళి మీ ఆయన ఉద్యోగంలో చేరమని చెప్తుంది. భాగ్య తులసి కాళ్ళ మీద క్షమాపణ అడుగుతుంది.

Also Read: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?

న్యాయం వైపు నిలబడమని సలహా ఇస్తుంది. తప్పు తెలుసుకున్న భాగ్య లాస్య నిద్రపోతుంటే తన గదికి వెళ్ళి ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేస్తుంది. రాజ్యలక్ష్మి నిద్రపోతుంటే దివ్య అమ్మవారిలా వచ్చి రోకలి బండ తీసుకుని తన కాలు విరగ్గొట్టినట్టు కల కంటుంది. దీంతో ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. తులసికి ఫోన్ చేసి వీడియో డిలీట్ చేసినట్టు చెప్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Kajal Aggarwal : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
Embed widget