అన్వేషించండి

Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

మురారీ ప్రేమ విషయం కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మురారీ తన డైరీని బయట పడేయాలని వెళ్లబోతుంటే తాము బయటకి వస్తామని అందరూ అంటారు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మురారీ గదిలోకి వెళ్ళి ఆ డైరీ తన బట్టల కబోర్డ్ లో పెడతాడు. ఈ డైరీ వల్ల చాలా ప్రమాదం కృష్ణ తన మనసులో మాట చెప్తే బాగుండని అనుకుంటాడు. ఏసీపీ సర్ ఎందుకు అలా బిహేవ్ చేశారు కంగారుపడుతున్నారు అది ఆయన చెప్పకపోయినా నేనే కనిపెట్టాలి కనిపెడతానని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ మురారీ బట్టలు సర్దుతుంటే అన్నీ కిందపడిపోతాయి. అందులోనే డైరీ ఉండటంతో మురారీ టెన్షన్ గా నిద్రలో నుంచి సడెన్ గా ఉలిక్కిపడి లేస్తాడు.

Also Read: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?

బట్టలు తానే సర్దుతానని చెప్పి కృష్ణని వెళ్లిపొమ్మని కంగారుగా చెప్తాడు. తను వెళ్లిపోవడంతో డైరీ కోసం వెతుకుతుంటే మళ్ళీ కృష్ణ వచ్చేసరికి టెన్షన్ పడతాడు. మళ్ళీ వెళ్లిపోగానే డైరీ తీసి బెడ్ కింద పెట్టేస్తాడు. మధుకర్ ని ఉతికి ఆరేస్తుంది అలేఖ్య. పొద్దున్నే నిద్రలేచి కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. పెళ్ళాం తిరగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడైనా అర్థం అయ్యిందా అని భర్తని బెదిరిస్తుంది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని వణికిపోతాడు. కృష్ణ గదిలో బెడ్ సర్దుతూ ఉండగా డైరీ తన చేతికి తగులుతుంది. అందులో మురారీ తన ప్రేమ ముకుంద గురించి రాసుకున్నది చదువుతుంది. మెరుపులా కనిపించింది. హృదయంలో పూల వాన కురిపించి నా జీవితానికి ఒక పరిమళం అద్దింది అని రాసింది చూస్తుంది. ఏసీపీ సర్ జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందా? ఆ మనసులో ఈ అమ్మాయి మీద ఇంత ప్రేమ ఉందా? అని కృష్ణ షాక్ అవుతుంది.

Also Read: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?

డైరీలో పేజ్ తిప్పే టైమ్ కి మురారీ రావడంతో దాన్ని మళ్ళీ దాచి పెట్టేస్తుంది. కృష్ణ డైరీ చూసి చాలా బాధపడుతుంది. మురారీ వైపు బాధగా చూస్తుంటే ఏమైందని సైగ చేస్తాడు ఏమి లేదని కళ్ళతోనే చెప్తుంది. ఇద్దరి మధ్యలో టవల్ అడ్డుగీతలాగా సింబాలిక్ గా పడుతుంది. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పటికైనా వెళ్లిపోవాలని వచ్చాను. నిన్నటితో ఎప్పటికీ మీతో ఉండాలని కోరుకున్నా కానీ ఇప్పుడు మీ మనసులో మరొక అమ్మాయికి స్థానం ఇచ్చారని తెలిసేసరికి చిన్న టవల్ కూడా మన మధ్య అడ్డుగోడలాగా కనిపిస్తుందని కృష్ణ మనసులోనే బాధపడుతుంది. కృష్ణ వెళ్లిపోగానే డైరీ ఉందా లేదా అని చూసుకుంటాడు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కేసు వెనక్కి తీసుకున్న వల్లీ! ఇంట్లో నుంచి గెంటేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కేసు వెనక్కి తీసుకున్న వల్లీ! ఇంట్లో నుంచి గెంటేసిన భాగ్యం!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
Brahmamudi Serial Today October 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ కొత్త ప్లాన్‌ - లక్కీని తిట్టిన ఐశ్వర్య  
‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ కొత్త ప్లాన్‌ - లక్కీని తిట్టిన ఐశ్వర్య  
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Embed widget