అన్వేషించండి

Ennenno Janmalabandham May 30th: రోడ్డు పక్కన చెత్తలో మాళవిక, ఏడిపించేసిన ఆదిత్య- యష్, వేద రొమాంటిక్ మూమెంట్

అభిమన్యు మాళవికని కాదని నీలాంబరిని పెళ్లి చేసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

బిజినెస్ పార్టీ అని చెప్పి వేదని హోటల్ తీసుకొస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం చెప్పలేక తిప్పలు పడుతూ ఉంటాడు. రూమ్ చూపించి లోపలికి వెళ్ళు అంతా నీకే అర్థం అవుతుంది నేను చిన్న ఫోన్ మాట్లాడి వస్తానని అబద్దం చెప్పి వెళ్ళిపోతాడు. వేద గదిలోకి వచ్చేసరికి లోపల బెడ్ ని అందంగా పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యపడుతుంది. మనసులో ఉన్న మాట బయటకి చెప్పలేక ఇన్ని పాట్లు పడుతూ ఇలా చూపించారా? పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ముందుగా ఎదురుచూసేది ఈ మధుర క్షణాల కోసమే. ఎప్పుడెప్పుడు భర్తకి దగ్గర కావాలా అని ఎదురుచూస్తుంది. కానీ మన విషయంలో అది చాలా ఆలస్యమైంది యష్. ఈ మధురమైన క్షణాలను మిగిలిన జీవితం అంతా గుర్తుండిపోయేంత గొప్పగా ఏర్పాటు చేశారు. ఐయామ్ ఇంప్రెస్. ఇన్ని అబద్ధాలు దీని కోసమా. అందుకే చెమటలు పట్టాయా? అసలు దీని కోసమే ఇంత టెన్షన్ పడ్డారా? చెప్పేస్తే మీ ఒడిలో వాలిపోయేదాన్ని కదా. ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ మాలిని మాటలు తలుచుకుంటుంది. అంటే ఇంట్లో దీని గురించి అందరికీ తెలుసన్న మాట. నకొక్క దానికే సర్ ప్రైజ్ అన్న మాట అని సంతోషపడుతుంది.

Also Read: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య

ఆదిత్య ఏడ్చుకుంటూ ఇంటి నుంచి బయటకి వస్తాడు. వాచ్ మెన్ దగ్గర ఫోన్ తీసుకుని తల్లికి ఫోన్ ట్రై చేస్తాడు. మాళవిక బార్ లో రచ్చ రచ్చ చేస్తుంది. అసలు నేను ఎందుకు బతకాలి నన్ను మోసం చేశాడని ఏడుస్తుంది. మాళవిక ఫోన్  బార్ మేనేజర్ లిఫ్ట్ చేసి విషయం చెప్తాడు. పాపం ఆదిత్య పరుగులు పెట్టుకుంటూ అక్కడికి బయల్దేరతాడు. యష్ గదిలోకి వచ్చి ఏమి తెలియనట్టు మొహం పెడతాడు. వేద ఏం మాట్లాడకుండా వెళ్ళి కౌగలించుకుని యష్ ఐయామ్ ఇంప్రెస్ అనేసరికి చాలా సంతోషిస్తాడు. ఆదిత్య బార్ కి వచ్చేసరికి తాగి తూలుతూ ఉంటుంది. తనని చూసి ఆ పసి మనసు అల్లాడిపోతుంది. ఏంటి మమ్మీ ఏమైంది నీకు అని ఏడుస్తాడు. ఇంటికి వెళ్దాం రమ్మని అంటాడు. నాకు ఇల్లు లేదు నన్ను అందరూ వదిలేశారు దిక్కులేని దాన్ని అయ్యానని మాళవిక ఏడుస్తుంది. ఆదిత్యని చూసి తనని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది.

Also Read: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

ఒక్కడివే నువ్వు మీ మమ్మీని తీసుకెళ్లలేవు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయమని మేనేజర్ చెప్తాడు. వాళ్ళు ఎవరూ రారని ఏడుస్తాడు. వేద, యష్ అందంగా రెడీ అయిపోతారు. ఇది చెప్పడానికి ఎందుకు కష్టపడ్డారు నాకే నేరుగా చెప్పొచ్చు కదా అని సిగ్గుపడుతుంది. ఇద్దరూ రొమాంటిక్ గా గడుపుతారు. మాళవిక తూలుతూ నన్ను అందరూ చీట్ చేశారు వదిలేయ్ అని నడుస్తూ రోడ్డు పక్కన చెత్తలో పడిపోతుంది. లేమమా వెళ్దాం రామ్మా అని ఆదిత్య ఏడవడం ప్రేక్షకులని కన్నీరు పెట్టిస్తుంది. నీకు ఏమైందని ఏడుస్తున్నావ్ నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. మనకి నాన్న ఉన్నాడు రామ్మా అని తనని బతిమలాడతాడు. ఆదిత్య యష్ కి ఫోన్ చేస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Best Smart TV Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే - 43 అంగుళాల భారీ డిస్‌ప్లేతో!
రూ.20 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే - 43 అంగుళాల భారీ డిస్‌ప్లేతో!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget