అన్వేషించండి

Madhuram Song Lyrics: కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?

Sathi Leelavathi Songs: సింగర్ కార్తీక్ ఫ్యాన్ బేస్, ఆయన మెలోడీ పాటలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలు లావణ్య కొత్త సినిమా 'సతీ లీలావతి'లో ఆయన ఓ పాట పాడారు. ఆ సాంగ్ లిరిక్స్...

సింగర్ కార్తీక్ (Singer Karthik)కు మన తెలుగు ప్రేక్షకుల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా ఆయన మెలోడీ సాంగ్స్ అంటే మళ్ళీ మళ్ళీ లూప్‌లో వినే శ్రోతలు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం మరో పాట వచ్చింది. మెగా కోడలు లావణ్య  త్రిపాఠి కొత్త సినిమాలో ఆయన ఒక పాట పాడారు. అది విన్నాక... 'కార్తీక్ మెలోడీ పాడితే మధురమే' అంటున్నారు ఆయన అభిమానులు. ఆ సాంగ్ ఏ సినిమాలోనిది? ఎవరు రాశారు? లిరిక్స్ ఏమిటి? అనేది చూడండి.

మధురమే... వాడి జత మధురమే!
Sathi Leelavathi Songs Lyrics In Telugu: లావణ్య త్రిపాఠి కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సతీ లీలావతి'. ఇందులో ఆమెకు జోడీగా మలయాళ నటుడు, సమంత 'శాకుంతలం' ఫేమ్ దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమాలోని మెలోడీ సాంగ్ 'మధురం'ను కార్తీక్ పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా... వనమాలి రాసిన ఆ సాంగ్ లిరిక్స్ చూడండి: 

ఇన్నాళ్లీ పరిచయాన్ని నువ్వూహించావా?
నీలో ఏం జరుగుతోందో గమనిస్తున్నావా?
ఏముందో వాడిలోనా తెలిసే లోగానే
గుండెల్లో చోటు కాస్త పంచేస్తున్నావా?
ఒక్కో క్షణం ఓ వింత...
చూస్తున్నావా తన చెంత
అంతందంగా మారిందా?
నీకీ జగమంతా
కళ్లు రెండూ కలిశాకా...
ఉన్నట్టుండి మనసంతా
తుళ్లి తుళ్లి పడుతోందా?
నిన్నే నువ్వే మరిచేంతా

మధురం... వాడి జత మధురం
మధురంలే... ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం... మది మదరం

మధురం... వాడి జత మధురం
మధురంలే... ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం... మది మదరం

Also Read: Chittoor Pilla Song Lyrics: చిత్తూర్ పిల్ల సాంగ్ లిరిక్స్... 'సతీ లీలావతి'లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి పాట - అమ్మాయిలు పాడుకునేలా

ఇన్నాళ్లీ పరిచయాన్ని నువ్వూహించావా?
నీలో ఏం జరుగుతోందో గమనిస్తున్నావా?
ఏముందో వాడిలోనా తెలిసే లోగానే
గుండెల్లో చోటు కాస్త పంచేస్తున్నావా? 

చరణం 1
ఇది వరకు ఉరికిన ఈ సమయం 
నేడు విసిగిస్తుందా?
తన కొరకు వేచే నీ హృదయం
ఆగనంటోందా?
కనుల ముందు వాడిని చూస్తూనే
గంతులే వేస్తుందా?
నిన్ను నడిపించే నమ్మకం వాడే
నీ బలం నీకే తెలిపే సాటిలేని సరిజోడే..

కళ్లు రెండూ కలిశాకా...ఉన్నట్టుండి మనసంతా
తుళ్లి తుళ్లి పడుతోందా? నిన్నే నువ్వే మరిచేంతా

Also Read: Gunji Gunji Song Lyrics: 'గుంజి గుంజి' లిరిక్స్... పాటలో ఇంత యాటిట్యూడా? చంద్రహాస్ 'బరాబర్ ప్రేమిస్తా'లో సాంగ్ విన్నారా?

మధురం... వాడి జత మధురం
మధురంలే... ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం... మది మదరం

మధురం... వాడి జత మధురం
మధురంలే... ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం... మది మదరం

Also ReadGira Gira Gingiraagirey Song Lyrics: గిరగిర గింగిరాగిరే లిరిక్స్... ట్రెండింగ్‌లో 'ఛాంపియన్' ఫస్ట్ సాంగ్... కాసర్ల శ్యామ్ ఏం రాశారంటే?

'సతీ లీలావతి' చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు నేచురల్ స్టార్ నాని హీరోగా 'భీమిలి కబడ్డీ జట్టు', నవ దళపతి సుధీర్ బాబు 'శివ మనసులో శృతి - ఎస్ఎంఎస్' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 'సతీ లీలావతి' సినిమాలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గా దేవి పిక్చర్స్ పతాకంపై నాగ మోహన్ నిర్మించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Pradeep Ranganathan: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS Highest Score in IPL 2026: పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
US Iran Ceasefire: అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
 Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Embed widget