News
News
X

Gruhalakshmi March 9th: ఛీ ఛీ లాస్య చెత్త ఐడియా, చీవాట్లు తిన్న నందు- పెళ్లికి ఒకే చెప్పిన విక్రమ్

దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ కొత్త మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

దివ్య విక్రమ్ మీద చిరాకు తులసి ముందు చూపిస్తుంది. వాసుదేవ్ పెట్టిన కండిషన్స్ చెప్పి తననే ఏదో ఒక మార్గం అడుగుదామని నందు వంట గదిలో ఉన్న తులసి వైపు తొంగి చూస్తూ ఉంటాడు. అది పరంధామయ్య కంట పడుతుంది. ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి అని వెళ్ళి నందు దగ్గరకి వెళ్ళి ఏం చేస్తున్నావని అడుగుతాడు. చూస్తున్నా తులసి మూడ్ ఎలా ఉందోనని నందు అంటాడు. ఎందుకని పరంధామయ్య అనేసరికి అయ్యో నాన్న మీరు అనుకున్న విధానంలో కాదని అక్కడి నుంచి పారిపోతాడు. పెళ్లి చూపుల విషయం బావ, మీ మావయ్యకి చెప్పొచ్చు కదా అని రాజ్యలక్ష్మితో బసవయ్య అంటాడు. వద్దు కాళ్ళకి అడ్డం పడతారని అంటుంది. అప్పుడే విక్రమ్ డల్ గా ఇంట్లోకి వెళ్తుంటే ఆపి ఏమైందని అడుగుతుంది. దివ్య అన్న మాటలు గుర్తి చేసుకుని పని మనిషి మీద అరుస్తాడు. అది చూసి రాజ్యలక్ష్మి వచ్చి విక్రమ్ కి అన్నం తినిపిస్తుంది.

Also Read: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్- తన తలకే గన్ గురిపెట్టుకున్న మాళవిక

నీ మొహంలో ఏదో దిగులు, బాధ కనిపిస్తుంది ఏదోలా ఉన్నావ్ ఏమైందని మళ్ళీ అడుగుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఏమి దాయడం లేదని చెప్తాడు. రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టు చెప్తుంది. అది విని సరే నువ్వు ఎలా చెప్తే అలా అనేసి విక్రమ్ బాధగా వెళతాడు. లాస్య నిద్రపోయిన తర్వాత నందు మెల్లగా లేచి కూర్చుంటాడు. దేవుడు నా చేతిలో బందరు లడ్డూ పెట్టి తినకుండా నోటికి తాళం వేశాడు. లైఫ్ లో ఎదిగే అవకాశాన్ని వదులుకోలేను. ఈ సమస్యని పరిష్కరించే శక్తి తులసికి మాత్రమే ఉంది. పగలు కలిసి మాట్లాడటం కుదరలేదు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలని నందు మెల్లగా జారుకుంటాడు. తులసి గదికి మెల్లగా వెళ్లబోతుంటే అనసూయ నిద్రలో లేచి చెడామడా తిట్టేస్తుంది. అది విని నందు బిక్క మొహం వేస్తాడు. దీని కలవరింతలతో చచ్చిపోతున్నానని లేచి పరంధామయ్య తనని తిడతాడు. నందు వెంటనే వాళ్ళకి కనిపించకుండా చాటుగా ఉంది ఈ తంటాలు ఏవో ఉదయం పడదామని వెళ్లబోతుంటే లాస్య ఎదురుపడుతుంది.

ఎన్నాళ్ళు నుంచి సాగుతుంది ఈ భాగోతం అర్థరాత్రి పెళ్ళాం పక్క నుంచి లేచి మాజీ భార్య గదికి ఎందుకు వెళ్ళావ్ అని నిలదీస్తుంది. తానొక సమస్యలో ఇరుక్కున్నానని దానికి పరిష్కారం తులసి మాత్రమే చెప్పగలుగుతుందని అంటాడు. అదేంటని లాస్య అడుగుతుంది. వాసుదేవ్ బిజినెస్ డీల్ గురించి చెప్పేసరికి లాస్య సంతోషపడుతుంది. తులసి, నేను భార్యాభర్తలం అనుకుంటున్నాడు, డివోర్స్ విషయం తెలిస్తే నా మొహం కూడా చూడడని చెప్తాడు. వాసుదేవ్ ఇక్కడ ఉండే రెండు రోజులు నువ్వు, తులసి భార్యాభర్తలుగా యాక్ట్ చేయమని లాస్య సలహా ఇస్తుంది. రెండు రోజులు మొగుడిని వదులుకుంటా కానీ డబ్బులు ఎలా వదులుకుంటానని లాస్య అంటుంది. విడిపోయిన తర్వాత తులసి భార్యగా నటించడానికి ఒప్పుకోదేమోనని అంటాడు. ముందు మీ నాన్నని ఒప్పించమని సలహా ఇస్తుంది.

Also Read: రాజ్ ఇంట కోడలిగా అడుగుపెట్టిన కావ్య- రచ్చరచ్చ చేసిన అపర్ణ

విక్రమ్ తాతయ్య కాళ్ళు నొక్కుతుంటే దేవుడు వచ్చి పెళ్లి సంబంధం గురించి చెప్తాడు. ఆ సంబంధం విక్రమ్ బాబుకి చూసినట్టు లేదు, నాకు పనికి అసిస్టెంట్ గా తీసుకొస్తున్నట్టు ఉందని అంటాడు. ఈ సంబంధం వద్దని చెప్పమని విక్రమ్ తాతయ్య ఎంత చెప్పినా కూడా వినడు.

Published at : 09 Mar 2023 08:46 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial March 9th Update

సంబంధిత కథనాలు

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి