Ennenno Janmalabandham March 9th: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్- తన తలకే గన్ గురిపెట్టుకున్న మాళవిక
వసంత్ గతం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ కి రంగులు తాను పూస్తానని వేద అంటుంది. రంగుల్లో వేదని చూసి ఆ రంగులు ఏంటి చిన్నపిల్లలా అని తిడతాడు. వసంత్, విన్నీ రంగులు కొట్టడానికి వెళ్తుంటే వద్దని వాళ్ళ మీద కూడా సీరియస్ అవుతాడు. నేను మీలా పని పాటా లేకుండా లేను ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి వెళ్తు తన దారి రహదారి అని డైలాగ్ కొడతాడు. ఖుషి, వేద కలిసి ప్లాన్ చేసి రంగులు కొట్టుకుంటూ యష్ వైపు పరుగులు పెడుతుంది. వచ్చి యష్ వెనుక దాక్కుని రంగులు కొట్టొద్దు అంటూ తిరుగుతుంది. నో హోలీ నో కలర్స్ అని యష్ చెయ్యి పట్టుకుంటుంది. అది చిన్న పిల్ల దాని మీద నువ్వు కొట్టొచ్చు కానీ అది నీ మీద కొట్టకూడదా అని వేదని తన ముందు నిలబెట్టి పట్టుకుంటాడు. వేద సైగ చేసి తప్పుకోగానే ఖుషి రంగు నీళ్ళు యష్ మీద కొట్టేస్తుంది.
Also Read: రాజ్ ఇంట కోడలిగా అడుగుపెట్టిన కావ్య- రచ్చరచ్చ చేసిన అపర్ణ
తన వైట్ షర్ట్ కాస్త పింక్ షర్ట్ అయిపోతుంది. తర్వాత అందరూ కలిసి యష్ మీద రంగులు చల్లుతారు. సోరి డాడీ మమ్మీ మీద కొట్టబోతుంటే నీ మీద పడ్డాయని ఖుషి అంటుంది. తర్వాత అందరూ వేదకి మెచ్చుకుంటుంది. మొదటి సారి యష్ మీద రంగులు కొట్టించావ్ అని పొగిడేస్తారు. అంటే ఏంటి ఇదంతా నువ్వు చేశావా అని యష్ అంటాడు. ఖుషి కోసం అలా చేశానని వేద అంటుంది. అవునా అయితే ఖుషి కోసం నేను కూడా ఒక పని చేస్తానని యష్ వేదకి రంగులు పూయడం కోసం తన వెంట పరుగులు తీస్తాడు. ‘నువ్వంటే నా నవ్వు’.. అని బ్యూటీఫుల్ సాంగ్ వేసి ఆ సీన్ చాలా రొమాంటిక్ గా చూపించారు. వేద పడిబోతుంటే యష్ పట్టుకుంటాడు. నీ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టను నీకు తోడుగా నేనుంటాను. కష్టం సుఖం సగం సగం అని యష్ మనసులో అనుకుంటాడు. మంచి చెడు సరిసమానమని వేద కూడా మనసులో అనుకుంటుంది.
Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య
మీకు నచ్చే మంచి భార్యని అవుతానని వేద అంటుంది. నువ్వు మెచ్చే భర్తని అవుతాను, ఖుషికి అమ్మవి మాత్రమే కాదు నాకు భార్యవి. నా మీద నీకు హక్కు ఉంది. మనసులు ముడిపడ్డ మూడు ముళ్ళ బంధం మనది. ఏడడుగుల బంధం మనది ఎన్నెన్నో జన్మల బంధమని కాసేపు ఇద్దరూ మనసులతోనే ఊసులాడుకుంటారు. వసంత్, చిత్ర కూర్చుని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చిత్ర కాలికి పట్టీలు తొడుగుతాడు. యష్ తన మొహానికి ఉన్న రంగులు వేదకి పూస్తాడు. అప్పుడే మాళవిక గన్ పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. యష్ వేద వెంట పరిగెడుతూ ఉంటే మాళవిక ఎదురుపడుతుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. తన చేతిలో గన్ వేద చూస్తుంది. వసంత్ మాళవిక దగ్గరకి కోపంగా వస్తాడు.