Gruhalakshmi March 7th: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య
దివ్య, విక్రమ్ ఎంట్రీతో సిరియల సరికొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దివ్య పెళ్లి విషయంలో లాస్య చేసిన కుట్రని అజయ్ బయటపెడతాడు. విషయం తెలిసి తులసి ఉగ్రరూపం దాలుస్తుంది. ఇంటికి వచ్చి లాస్యని నిలదీస్తుంది. కేఫ్ విషయంలో సహాయం చేస్తామని చెప్పేసరికి డీల్ కుదుర్చుకుని నన్ను అమ్మడానికి సిద్ధం చేసిందని దివ్య అంటుంది.
లాస్య: నా గురించి కాదు నీ మంచి గురించి ఆలోచించి చేశాను
నందు: ఏంటి నువ్వు ఆలోచించింది
లాస్య: వాళ్ళు కోటీశ్వరులు నాలుగు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది దివ్య ఆ ఇంటి కోడలు అయితే ప్రిన్సెస్ లా బతుకుతుంది. కన్నతల్లిని అని గుండెలు బాదుకోవడం కాదు దాని జీవితం బాగుపడేలా ఆలోచించు అనేసరికి తులసి చెయ్యి ఎత్తుతుంది. నందు నీ భార్య మీదకి తులసి చెయ్యి ఎత్తింది మాట్లాడవు ఏంటి నిలదీయవు ఏంటి
నందు: తులసి చెయ్యి లేపడం కాదు చెంప పగలగొట్టాల్సింది. నా విషయంలో ఎన్ని తప్పులు చేసిన భరిస్తాను కానీ నా కూతురు విషయంలో చేస్తే ఒప్పుకునేది లేదు
లాస్య: తనని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టాలని దూరాలోచన చేశాను
Also Read: హోలీ సంబరాల్లో క్యూట్ కపుల్, గన్ తో హల్చల్ చేసిన మాళవిక- బయటపడిన వసంత్ గతం
దివ్య: దూరాలోచన కాదు దురాశతో
తులసి: డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం నీకు అలవాటు నా కూతురికి అలాంటి ఖర్మ పట్టలేదు. నా కూతురిలో ఉంది నా రక్తం దానిలో నీతి నిజాయితీ మంచితనం ఉన్నాయి. డబ్బుకోసం జీవితాన్ని తాకట్టు పెట్టె లక్షణాలు లేవు. డబ్బున్న మహారాజు రాకపోయిన పరవాలేదు గుండెల్లో పెట్టుకుంటే చాలు. నా కూతుర్ని అడ్డం పెట్టుకుని బాగుపడటానికి ప్రయత్నించొద్దని వార్నింగ్ ఇస్తుంది.
రాజ్యలక్ష్మికి బసవయ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. విక్రమ్ ఏదో ఒకరోజు ఎవతినో సంకనేసుకొచ్చి తీసుకొస్తాడు. అందుకే వెంటనే పెళ్లి చేయాలని బసవయ్య అనేలోపు పంతులు వస్తాడు. అప్పుడే విక్రమ్ వస్తాడు. ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి చేద్దామని అనుకుంటున్నట్టు చెప్తుంది. నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే మొహమాటం లేకుండా ముందే చెప్పమని అడుగుతుంది. విక్రమ్ దివ్య గురించి ఆలోచిస్తాడు కానీ బయటకి మాత్రం పెళ్లి విషయంలో తల్లి నిర్ణయమే తన నిర్ణయమని చెప్తాడు.
పెద్దమ్మగారు మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నిజం చెప్పాలి కదా అని దేవుడు విక్రమ్ ని అడుగుతాడు. తన మనసులో నేను ఉన్నానో లేదో తెలిసే దాకా ఈ దాగుడుమూతలు తప్పవని అంటాడు. పంతులు గొప్ప ఇంటి అమ్మాయి ఫోటో చూపిస్తే అది వద్దని చెప్పి తనకి చదువు సంధ్య లేని చెత్త ఊడ్చే మనిషి, దానికి బుర్ర ఉండకూడదు, నా ఆలోచనలే దాని ఆలోచనలు కావాలి. కంటితో సైగ చేస్తే బెదిరిపోవాలని రాజ్యలక్ష్మి చెప్తుంది. పంతులు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాడు. అది చూసిన బసవయ్య పనిమనిషి కళ ఉట్టిపడుతోందని అంటాడు. ఈ సంబంధం ఖాయం చేయమని రాజ్యలక్ష్మి చెప్తుంది. ఆ అమ్మాయి వాళ్ళని ఈ ఇంటికే పెళ్లి చూపులకు రమ్మని చెప్తుంది.
Also Read: భార్యభర్తలుగా రిషిధార కొత్త ప్రయాణం ఎటువైపు- ప్రేమ జ్ఞాపకాల్లో తేలిపోతున్న వసు
నందు లాస్య మీద అరుస్తాడు. అయినా రెండో పెళ్లి వాడిని చేసుకోవడం తప్పా అని లాస్య అంటుంది. చాలా విషయాల్లో మొండితనానికి తల వంచాను. దివ్య విషయంలో జోక్యం చేసుకుంటే నరసింహ అవతారం ఎత్తుతాను. మా కూతురి పెళ్లి మా ఇష్టం నువ్వు జోక్యం చేసుకోవద్దని నందు వార్నింగ్ ఇస్తాడు. తులసి దివ్య గది సర్దుతూ డబ్బులు చూసి ఎవరివి అని అడుగుతుంది. దివ్య విక్రమ్ గురించి జరిగింది మొత్తం చెప్తుంది. తులసి కూడా శ్రుతిలాగా డౌట్ పడుతుంది. నుదుటి మీద బొట్టు ప్రశాంతమైన మొహంతో మంచివాడిలా కనిపించాడని దివ్య అంటుంది.