By: ABP Desam | Updated at : 06 Mar 2023 08:52 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
జగతి రిషి దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. వసుధార చేసింది కరెక్ట్ అనిపించలేదు, తనంతట తానుగా మెడలో తాళి వేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని రిషి అంటాడు.
రిషి: తను చేసిన దానికి మీరు దిద్దుబాటు చర్య చేశారు
జగతి: మీ బంధానికి కాపాడటానికి అలా చేశాను తప్ప మరో ఉద్దేశం నాకు లేదు
రిషి: మీరు చేసింది పొరపాటని నేను అనలేదు కదా, మీరే పొరపాటు చేసి ఉంటే నా పేరు చెప్పగానే కాదనే వాడిని కదా. మీరు అందరి ముందు చెప్పిన విషయాన్ని నిజమని నేను ఎందుకు ఒప్పుకుంటాను. జరిగిన విషయానికి మీరు నన్ను కన్వీన్స్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు చేసింది రైట్ అని నమ్ముతాను అలాగే గతంలో మీరు చేసినవి రైట్ అని అనను. రోజులు మారితే గాయం మానుతుందని అంటారు. కానీ మనసుకి అయిన గాయం ఎప్పటికీ మానదు
Also Read: భ్రమరాంబిక స్కెచ్, మాళవిక ఔట్- ఆగిపోయిన వసంత్, చిత్రల పెళ్లి
జగతి: వసూని క్షమించలేవా?
రిషి: ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు
జగతి: అందరూ మనసుకి అయిన గాయం తట్టుకోలేరు కదా వసుకి నా పరిస్థితి రాకూడదు
వసు ఇంటికి రిషి వస్తాడు. బాగా తలనొప్పిగా ఉంది నీ చేత్తో చేసిన కాఫీ తాగాలని వచ్చానని చెప్తాడు. మీకు కూడా తలనొప్పి వస్తుందా అని వసు విచిత్రంగా అడుగుతుంది. నాకు కూడా తల ఉంది కదా అని అంటాడు. రిషి ఏ మాట్లాడకుండా ఉండటంతో వసునే మాట్లాడుతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఏకైక మార్గం ఇదే అనిపించింది మీరే అర్థం చేసుకోవడం లేదని అంటుంది. ఆ ఒక్క పని చేయకుండా ఉంటే బాగుండేది కదా అని రిషి మనసులో అనుకుంటాడు. కాఫీ తాగి వెళ్లిపోతుంటే వసు నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు మాట్లాడుకుండానే వెళ్లిపోతున్నారని అడుగుతుంది. జగతి మాటలు తలుచుకున్న రిషి వెంటనే వసుని కౌగలించుకుంటాడు. ఇదే మన బంధం, ఇదే మన దూరం అనేసి వెళ్ళిపోతాడు.
Also Read: ఐపీఎస్ అయిపోయిన జానకి, పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్న కుటుంబం- మల్లిక కల నిజమయ్యేనా
రిషి కాలేజ్ కి వచ్చేసరికి కొంతమంది స్టూడెంట్స్ దారికి అడ్డంగా నిలబడతారు. అప్పుడే జగతి వాళ్ళు కూడా వస్తారు. రిషి ఏమైందని అడిగేసరికి స్టూడెంట్స్ బొకే, ప్లకార్డ్ తీసి కంగ్రాట్స్ చెప్తారు. మేడమ్ రాలేదా అని స్టూడెంట్స్ అడుగుతారు. నిన్నటి ప్రెస్ మీట్ ప్రభావమని మహేంద్ర అంటాడు. రిషి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వసు జరిగినవన్నీ తలుచుకుని హ్యపీగా ఉంటుంది. అప్పుడే మినిస్టర్ పీఏ ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. కాలేజ్ లో రిషి ఇంకా వసుధార రాలేదేంటని ఆలోచిస్తూ ఉంటాడు. కాలేజ్ కి వెళ్లాలని లేదని, మెసేజ్ పెడితే ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటుంది. అటు రిషి కూడా వసు కాలేజ్ కి వస్తుందా రావడం లేదని కనీసం మెసేజ్ కూడా చేయలేదేంటని ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే వసు కాలేజ్ కి రావడం లేదని పర్మిషన్ కావాలని మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తుంది. ఇద్దరూ కాసేపు ఒకరిగురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మినిస్టర్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాడు.
Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే - పర్సనల్ లైఫ్లో కాదు!
New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!
Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి
Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం
Bhishma Combo Repeat: నితిన్, రష్మిక మూవీకి మెగాస్టార్ క్లాప్ - ‘భీష్మ’ త్రయంపై ఫ్యాన్స్ ఆశలు
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల