Janaki Kalaganaledu 4th: ఐపీఎస్ అయిపోయిన జానకి, పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్న కుటుంబం- మల్లిక కల నిజమయ్యేనా
జానకి ఐపీఎస్ ఫలితాలు రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబకి భర్త గోవిందరాజులు తన కిడ్నీ ఇచ్చి బతికించుకుంటాడు. జానకి చాలా గొప్పది అని గోవిందరాజులు కాసేపు పొగుడుతాడు. ఇంట్లో అందరికీ పరీక్షలు చేయించిన తర్వాత జానకి కిడ్నీతో పాటు తనది కూడా పనికి వస్తుందని చెప్పారు కానీ జానకి మాత్రం నా ఆరోగ్యం విషయం ఆలోచించి ఈ విషయం ఎవరికి తెలియనివ్వలేదని, డాక్టర్ చెప్పడంతో తను కిడ్నీ ఇచ్చినట్టు చెప్తాడు. అప్పటికి జానకి వద్దని ఎంతో బతిమలాడింది మన కోసం తన లక్ష్యం పాడుచేసుకోవద్దని సర్ది చెప్పాను తను మన ఇంటి కోడలు కాదు దేవత అని అంటాడు.
జ్ఞానంబ: నన్ను బతికుంచుకోవడం కోసం ఎంత నలిగిపోయావ్ నేను మళ్ళీ బతికున్నా అంటే అందుకు కారణం ఆయనే అయినా అందుకు కంకణం కట్టుకుంది నువ్వు కూతుర్లు ఆస్తులు పంచుకోవడానికి కోడళ్ళు ఇంటిని చీల్చడానికి అంటారు. కానీ నా పెద్ద కొడుకు, కోడలు అలా కాదు అందరూ బాగుండాలని కోరుకుంటారు
Also Read: లాస్య కుట్ర తెలిసి తులసి ఉగ్రరూపం- లిమిట్స్ లో ఉండమంటూ దివ్య స్ట్రాంగ్ వార్నింగ్
రామ గుడికి వచ్చి జానకి ఐపీఎస్ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయని దేవుడికి దణ్ణం పెట్టుకుని పూజ చేయమని పంతులకి చెప్తాడు. ఇంట్లో గోవిందరాజులు కూడా హడావుడి చేస్తాడు. మలయాళంని పిలిచి చాలా వంటలు చేయాలని చెప్తుంటే మల్లిక ఏంటి విశేషమని అడుగుతుంది. కాసేపు మల్లిక చదువుకోలేదని దెప్పి పొడుస్తాడు. జానకి ఐపీఎస్ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయని చెప్తాడు. ఇంట్లో ఒక పోలీసాఫీసర్ రెడీ అవుతుందంటే సంతోషమే కదా అని అందరూ అంటారు. అందరి హడావుడి చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే తను పరీక్షల్లో పాస్ అయితే ఎలా ఉంటుందోనని అనుకుంటుంది.
రామ న్యూస్ పేపర్ తీసుకొచ్చి సాధించేశారని తనని ఎత్తుకుని తెగ తిప్పేస్తాడు. జానకి ఐపీఎస్ పాస్ అయ్యిందని చెప్పడంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. అనుకన్నది సాధించిందని జ్ఞానంబ సంతోషపడుతుంది. ఊళ్ళో వాళ్ళు జ్ఞానంబ ఇంటికి వచ్చి జానకిని పొగడ్తలతో ముంచేస్తారు. ఇంటికి వస్తూ వస్తూ ఊళ్ళో వాళ్ళందరికీ విషయం చెప్పేసి వచ్చానని రామ చెప్తాడు. ఇంటికి వచ్చిన వాళ్ళు జ్ఞానంబ కోడళ్ళ చదువు గురించి కాసేపు మాట్లాడతారు. తన కోడలు నలుగురికి ఆదర్శం అయ్యిందని జ్ఞానంబ మురిసిపోతుంది. ఇంట్లో బాధ్యతలు మోస్తూ బాగా చదువుకోవడం అంటే మామూలు విషయం కాదని అంటారు. విష్ణు కూడా మల్లికని అనేస్తాడు. పెళ్లి అయిన తర్వాత ప్రైవేట్ గా పది పరీక్షలు రాయమంటే కూడా రాయలేదని విష్ణు అంటాడు. అందరూ జానకిలా చదువుకోలేరు కదాని జ్ఞానంబ అంటుంది. జానకికి సన్మానం చేయాలని ఊళ్ళో వాళ్ళు అనేసరికి చేసేస్తున్నారు అని మల్లిక ఏడుస్తూ కలలో నుంచి బయటకి వస్తుంది. అప్పుడే రామ ఇంటికి వస్తాడు. కలలోలా కాకుండా మామూలుగా వస్తున్నారు అని మల్లిక అనుకుంటుంది.
Also Read: తాళి కట్టే టైమ్‌కి ముసుగుతీసేసిన కావ్య - అప్పు నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన స్వప్న
రామ డల్ గా రావడం చూసి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని జ్ఞానంబ చెప్తుంది. రిజల్స్ రాగానే కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్తానన్నారని రామ చెప్తాడు. ఇంట్లో అందరూ జానకి పొగడ్తల దండకం మొదలుపెట్టేస్తారు.