Ennenno Janmalabandham March 7th: హోలీ సంబరాల్లో క్యూట్ కపుల్, గన్ తో హల్చల్ చేసిన మాళవిక- బయటపడిన వసంత్ గతం
వసంత్ గతం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద చిత్రని పలకరించడానికి వెళ్తుంది. చిత్ర నవ్వుతూ తనకి ముంబయిలో జాబ్ వచ్చిందని అక్కడికి వెళ్లిపోతానని ఏడుపు ఆపుకుని మాట్లాడుతుంది. వసంత్ లేకుండా నేను బతకలేను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. అప్పుడేమో నిధి వచ్చి వసంత్ ని దూరం చేయాలని చూసింది. ఇప్పుడు మాళవిక వచ్చి మా పెళ్లి జరగకుండా ఆపేసింది. మా పెళ్లికి ఇన్ని అడ్డంకులు ఏంటి. వసంత్ నేను కలవకూడదా. నా సంతోషాన్ని ఎవరో కాదు వసంత్ వద్దని అనుకుంటున్నాడు. అసలు ఆ మాళవిక ఎవరు, తను వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వసంత్ ఎందుకు నోరు మూసుకుని ఉన్నాడు అని చిత్ర ఎమోషనల్ అవుతుంది. దీని వెనుక ఒక్క వసంత్ మాత్రమే కాదు మీ బావ కూడా ఉన్నాడు ఆయన్ని అడిగితే నిజం బయటకి వస్తుందని వేద అంటుంది.
Also Read: విక్రమ్ ప్రేమ దూరం చేసేందుకు రాజ్యలక్ష్మి స్కెచ్- లాస్య కుట్రబయటపెట్టిన అజయ్, షాక్లో తులసి
యష్ మాళవిక మాటలు తలుచుకుని బాధపడుతుంటే వేద కోపంగా వచ్చి అసలు ఏం జరుగుతుంది? మాళవిక వచ్చి పెళ్లికి అభ్యంతరం చెప్పి పెళ్లి ఆపడం ఏంటి? మీరు జోక్యం చేసుకోకపోవడం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవని అంటాడు. ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది నా చెల్లెలు ఏం సమాధానం చెప్పమంటారు అని భర్తని నిలదీస్తుంది. అసలు ఎవరు మాళవిక తనకి ఈ పెళ్లికి సంబంధం ఏంటి? ఎంత ధైర్యం దానికి నా కళ్ళ ముందు నా భర్తని అంటుంది. మీరు ప్రతిదీ దాచి పెడతారు అదే మీతో వచ్చిన సమస్య. అసలు మన పెళ్లి కూడా నిజమా అబద్ధమా అనే అనుమానం వస్తుందని వేద బాధగా అడుగుతుంది. ఎన్ని రకాలుగా అడిగినా కూడా నిజాన్ని రాబట్టలేవని యష్ అంటాడు.
వేద: అంటే మీరు మన బంధాన్ని అవమానిస్తున్నారా? మీ మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి
వసంత్: నేనే.. అన్నయ్య మౌనం వెనుక ఉన్న అసలు కారణం నేనే. నామీద ఒట్టు వేయించుకుని నేను తీసుకున్న నిర్ణయం వల్ల అన్నయ్య మౌనంగా ఉన్నాడు. మాళవిక ఎవరో కాదు నేను చెప్పుకోడానికి సిగ్గు పడే నా అక్క. నేను అసహ్యించుకునే ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన నా తోబుట్టువు. కానీ తను ఎప్పుడైతే నీచమైన పని చేసిందో భర్తని బిడ్డని వదిలేసి డబ్బు మీద మోజుతో ఒక పరాయి వాడి పంచన పడిందో ఆ క్షణమే తమ్ముడిగా తెగదెంపులు చేసుకున్నా. అక్కాతమ్ముడి బంధాన్ని తెంపేసుకున్నా. మాళవికకి నాకు ఉన్న బ్లడ్ రిలేషన్ గురించి ఎవరితో చెప్పొద్దని యశోధర్ తో ప్రమాణం చేయించుకున్నాను
Also Read: భార్యభర్తలుగా రిషిధార కొత్త ప్రయాణం ఎటువైపు- ప్రేమ జ్ఞాపకాల్లో తేలిపోతున్న వసు
యష్: వేద వసంత్ ని చూసి చాలా గర్వపడుతున్నా. ఈ లోకంలో ఎవరు తీసుకొని నిర్ణయం తీసుకున్నాడు. మా స్నేహానికి విలువ ఇచ్చి సొంత అక్కతో తెగదెంపులు చేసుకున్నాడు. ఖుషిని నా చేతిలో పెట్టి మాళవిక వెళ్ళిపోయింది చిన్న జీతం, సొసైటీలో భార్య వదిలేసిన భర్తగా చీదరింపు గుండె పగిలేలా ఏడ్చాను. నా పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అనుకున్నా. ఒక స్టేజ్ లో సూసైడ్ చేసుకుంటానేమో అని అమ్మానాన్న భయపడ్డారు. బండరాయిగా మారిపోయిన నా జీవితాన్ని మార్చి నా కష్టకాలంలో అండగా ఉంది వసంత్ ఒక్కడే. వాడు లేకపోతే నేను ఏమైపోయేవాడినని కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
ప్రేమబంధం కంటే స్నేహబంధానికి విలువ ఇచ్చినందుకు హ్యాట్సాఫ్ వసంత్ అని వేద మెచ్చుకుంటుంది. అలాగే చిత్రకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉందని అంటుంది. చిత్ర దిగాలుగా ఉంటుంది. ఇన్నాళ్ళూ మనకి తెలిసిన వసంత్ వేరు ఇప్పుడు వసంత్ వేరు అని వేద అంటుంది. మోసం చేసిన అక్కని వదులుకుని బావ వైపు నిలబడ్డాడు అది వాడి క్యారెక్టర్ అని రత్నం చెప్తాడు. అప్పుడే వసంత్ వచ్చి నిజం దాచిపెట్టినందుకు క్షమించమని అడుగుతాడు.