Gruhalakshmi March 10th: సంజయ్ రాసలీలలు చూసిన దివ్య- ఆత్మహత్యాయత్నం చేసిన శిరీష
దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అనసూయ, పరంధామయ్య గార్డెన్ లో కూర్చుని ఉండగా నందుని లాస్య వెళ్ళి మాట్లాడమని చెప్తుంది. ఏం మాట్లాడాలి అని నందు భయపడుతుంటే లాస్య వెళ్ళమని తోసేస్తుంది. నందు వెళ్ళి పరంధామయ్య దగ్గర కూర్చోగానే తులసి వస్తుంది. నీతో ఏదో చెప్పాలని చూస్తున్నాడని అనేసరికి నందు చటుక్కున లేచి ఏం మాట్లాడలేక నిలబడతాడు. పర్సనల్ గా మాట్లాడాలా అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ వాసుదేవ్ యూఎస్ నుంచి వస్తున్నాడని తనతో మాట్లాడింది మొత్తం చెప్తాడు. అదంతా విని అనసూయ వాళ్ళు కోపంగా అరుస్తాడు. ఇలాంటి దరిద్రపు గొట్టు ఆలోచన నీ మనసుకి ఎలా వచ్చిందని అనసూయ తిడుతుంది. కాపురం చేసినన్ని రోజులు కాల్చుకుని తిన్నావ్ ఇప్పుడు భార్యగా నటించమని అడుగుతున్నావ్ సిగ్గు ఉందా, అసలు ఎలా ఒప్పిస్తామని అనుకున్నావ్ అని అరుస్తారు.
Also Read: తగ్గుదాం డ్యూడ్ తప్పేముంది, మాజీ భార్యకి పెళ్లి చేసేయమని వసంత్ ని ఒప్పించిన యష్
భార్యాభర్తల సంబంధం అంటే బొమ్మలాట కాదు నచ్చినప్పుడు ఉండటానికి వద్దని అన్నప్పుడు వెళ్లిపోడానికి అని కాస్త గడ్డి పెట్టి వెళ్లిపోతారు. నందు దిగాలుగా గదిలోకి వస్తాడు. అంతా ఒకేనా అనుకున్నట్టే జరిగిందా అని లాస్య ఆత్రంగా అడుగుతుంది. అనుకున్నట్టే జరిగింది నేను అనుకున్నట్టు విషయం చెప్పగానే ఛీ కొట్టారు. వాసుదేవ్ రాగానే నిజం చెప్పేస్తానని నందు అంటాడు. కానీ లాస్య మాత్రం అందుకు ఒప్పుకోదు డైరెక్ట్ గా తులసితో వెళ్ళి మాట్లాడతానని అంటుంది. తులసి ఛీ కొడితే భరిస్తాను కావాల్సింది మనం ఎదగడమని అంటుంది. దివ్య రాజ్యలక్ష్మి కొడుకు సంజయ్ గదికి వెళ్తుంది. అక్కడ సంజయ్ నర్స్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది కాస్త దివ్య చెవిన పడుతుంది. కర్టెన్ తెరచి చూసేసరికి నర్స్, సంజయ్ భోగతం కంటపడుతుంది. ఏం జరుగుతుందని నిలదీస్తుంది. ఈ హాస్పిటల్ లో జరుగుతున్న తప్పు ఏంటి అని దివ్య సంజయ్ ప్రశ్నిస్తుంది.
ఇక్కడ నువ్వు ఎంప్లాయ్ వి మాత్రమే లిమిట్స్ ఉండమని చెప్పేసి సంజయ్ వెళ్ళిపోతాడు. తులసి కిచెన్ లో ఉంటే లాస్య వచ్చి కూరగాయలు కోస్తానంటూ బిస్కెట్లు వేస్తుంది. ప్రతి ఇంటి గృహలక్ష్మి నిన్ను చూసి నేర్చుకోవాలని కాకాపడుతుంది. సడెన్ గా ఎందుకు అలా అనిపించిందని తులసి అడిగేస్తుంది. కూరగాయలు కింద పడేసి తులసి కావాలని తన చీర కూడా సరిచేసేస్తుంది. ఏదో అడగాలని వచ్చావ్ అదేంటో అడగమని తులసి అంటుంది. వాసుదేవ్ వస్తున్న విషయం తెలుసు కదా.. మీ డివోర్స్ మ్యాటర్ తనకి తెలియదు. మీరు భార్యాభర్తలని అనుకుంటున్నాడు. విడాకులు తీసుకున్నారని తెలిస్తే బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేస్తాడు. అలా జరగకుండా నువ్వే చూడాలి. నువ్వు, నందు డివోర్స్ తీసుకున్న విషయం వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు ఉన్న రెండు రోజులు పక్కపక్కన ఉండి భార్యాభర్తలుగా నటిస్తే చాలు అని లాస్య అడుగుతుంది.
తులసి: ఆయనతో కలిసి జీవించలేక విడాకులు తీసుకున్నా అసలు అలా అడగాలని ఎలా అనిపించింది. నాకు ఇష్టం లేదు నటించలేను
లాస్య: నందు ఎదగడానికి సహాయం చేశావ్ కదా
తులసి: నువ్వు అడిగింది చేయలేను
Also Read: జానకి ఆన్ డ్యూటీ- రామతో గొడవపడిన ఎస్సై మనోహర్, కష్టాలు మొదలాయెనే
లాస్య: నటించడం వల్ల నష్టం ఏముంది, నందు డబ్బు సంపాదిస్తే మనకే కదా మంచిది. నందుకు సహాయం చెయ్యడానికి ఏమైంది జస్ట్ రెండు రోజులు
తులసి: అది మొండిది మాట వినలేదని చెప్పు ఉన్న కేఫే జాగ్రత్తగా నడుపుకోమని చెప్పు
లాస్య కోపంగా గదికి వచ్చి నందు మీద చిర్రుబుర్రులాడుతుంది. ఏం జరగాలో అదే జరుగుతుందని నందు అంటాడు. శిరీష ఆత్మహత్యాయత్నం చేయడంతో దివ్య హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. తనని చూసి దివ్య ఏమైందని అడుగుతుంది. ప్రేమించిన వాడు మోసం చేశాడని ఎవరికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుందని శిరీష తల్లి దివ్యకి చెప్తుంది. మోసం చేసింది విక్రమ్ అనుకుని తిడుతుంది.