News
News
X

Gruhalakshmi January 3rd: తులసిని కంపెనీ సీఈవో చేస్తానన్న సామ్రాట్- శ్రుతిని చంటిపాపలా చూసుకుంటున్న ప్రేమ్

లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

బెనర్జీ ఫైల్ మీద సామ్రాట్ సంతకం పెట్టకుండా తులసి టైమ్ కి వచ్చి అడ్డుకుంటుంది. నీ చరిత్ర తెలిసే మాట్లాడుతున్నా నీ అర్హత లేని ప్రాజెక్ట్ ఎవరూ ఒకే చేయరు అని తులసి అంటుంది. దీంతో బెనర్జీ ఆగ్రహంతో అదే స్థలంలో స్కూల్ కట్టి ఓపెనింగ్ కి నిన్ను, నీ బాస్ ని పిలుస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. శ్రుతి తల తుడుచుకుంటూ ఉండగా ప్రేమ్ వచ్చి గట్టిగా అరుస్తాడు. తల తుడుచుకోవడానికి టెర్రస్ మీదకి ఎందుకు వచ్చావ్ అని కాసేపు హడావుడి చేస్తాడు. కడుపుతో ఉండి తల తుడుచుకుంటే కడుపులోని బిడ్డ ఏం కావాలి అని భయంకరమైన క్లాస్ తీసుకుంటాడు. అదంతా అంకిత చూస్తూ నవ్వుతూ ఉంటుంది. నువ్వు సేవలు చేయాల్సిన టైమ్ చాలా ఉందని శ్రుతి అంటుంది. కాసేపు ప్రేమ్ ని ఆటపట్టిస్తుంది.

Also Read: చారుశీల దగ్గర మాట తీసుకున్న దీప- ఇంద్రుడుని క్షమించమని అడిగిన హిమ

తనకి మాత్రమే తల్లి అయ్యే అవకాశం ఇచ్చాడు, అంకిత కూడా ప్రెగ్నెంట్ అయితే బాగుండేది అని శ్రుతి అంటుంది. ఆ మాట విని అంకిత కొద్దిగా ఫీల్ అవుతుంది. వదిన కడుపుతో ఉన్నప్పుడు నువ్వు చూసుకుంటావు కదా అని ప్రేమ్ అంటాడు. దేవుడి ప్లాన్ ఇదేనేమో అని అంటాడు. కానీ అంకిత మాత్రం ఇది దేవుడు వేసిన ప్లాన్ కాదు నాకు వేసిన శిక్ష, ఒకప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడు శిక్ష వేశాడాని బాధగా వెళ్ళిపోతుంది. అది చూసి లాస్య తనకి ఛాన్స్ దొరికిందని సంబరపడుతుంది. బెనర్జీ నుంచి సేవ్ చేసినందుకు సామ్రాట్ తులసిని మెచ్చుకుంటాడు. బెనర్జీ కారులో వెళ్తూ తులసి తనని రెచ్చగొట్టిందని రగిలిపోతూ ఉంటాడు. వేరే వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ చేసి తనెంటో నిరూపిస్తానని అంటాడు. బెనర్జీ విషయంలో తులసి చేసిన పని మెచ్చుకుంటూ కంపెనీ సీఈవో చేస్తానని అంటాడు. అది విని తులసి కాసేపు క్లాస్ తీసుకుంటుంది.

Also Read: ఒకరి మీద ఒకరు చిలిపి ఫిర్యాదులు చేసుకున్న వేద, యష్- భ్రమరాంబికని ఆట ఆడుకుంటానన్న మాళవిక

హనీ తులసి మీద అలుగుతుంది. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని బుంగమూతి పెడుతుంది. సరే అలక పోవాలంటే ఏం చెయ్యాలని అడుగుతుంది. అర్జెంట్ గా షికారుకి తీసుకెళ్లాలని హనీ అడుగుతుంది. సరే ఉంటానులే అని తులసి అనేసరికి హనీ హ్యపీగా ఉంటుంది. సామ్రాట్, తులసి, హనీ ముగ్గురు కలిసి గుడికి వెళ్లాలని అనుకుంటారు. హనీ ఈ మధ్య డల్ గా ఉంటుంది, కానీ నిన్ను చూడగానే ఎంత ఎనర్జీ వచ్చేసిందని సామ్రాట్ బాబాయ్ అంటాడు. ఆ మాటకి అంతే తులసి వెంటనే అందరినీ ఆకట్టుకుంటారు, అందరినీ తన మాటలతో మెస్మరైజ్ చేస్తారు అని తెగ ఉత్సాహంగా చెప్తాడు. ఆ మాట విని తులసి ఆశ్చర్యపోతుంది. వెంటనే మళ్ళీ సామ్రాట్ ఆ మాటని కవర్ చేసుకుంటాడు. ఇక ప్రేమ్ శ్రుతికి అన్నం తినిపిస్తూ ఉంటాడు.

Published at : 03 Jan 2023 08:37 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial January 3rd Update

సంబంధిత కథనాలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు

Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు