Ennenno Janmalabandham January 2nd: ఒకరి మీద ఒకరు చిలిపి ఫిర్యాదులు చేసుకున్న వేద, యష్- భ్రమరాంబికని ఆట ఆడుకుంటానన్న మాళవిక
వేద, యష్ ని కలిపేందుకు తన అమ్మమ్మ ఊరుకి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రాణి వాళ్ళ ఇంట్లో ఉన్న ముత్యాలు, బంగారు గొడవపడుతూ ఉంటారు. అది చూసి వేద కంగారుగా వచ్చి తన అమ్మమ్మకి వచ్చి చెప్తుంది. వాళ్ళు గొడవపడటం కొత్తేమీ కాదు అని అంటుంది. నువ్వు నీ భర్త ఎప్పుడు గోడవపడలేదా? అలకలు, కీచులాటలు ఇవన్నీ కలిస్తేనే దాంపత్యం. కానీ కాపురంలో కీచులాటలు ఉండవచ్చు కానీ దాపరికాలు ఉండకూడదు. నీ భర్తని నువ్వు అర్థం చేసుకున్నట్టే, నీ మనసుని నీ భర్త అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. కీచులాటలు సహజం. సంసారం అంటే సర్దుకుపోవాలి. పెళ్లి అంటే ఒక్కరు ఇద్దరు అవడం కాదు ఇద్దరు ఒక్కటి అవడం ఒక్కటిగా ఉండటం అని భార్యాభర్తల బంధం గురించి చాలా చక్కగా చెప్తుంది.
Also Read: నందు దుమ్ముదులిపిన తులసి- చిక్కుల్లో పడబోతున్న సామ్రాట్?
వేద తన యష్ లో నచ్చని విషయం ఒక పేపర్ మీద రాస్తుంది. తను రాయడం యష్ చూస్తాడు. ఏంటి లెటర్ రాస్తుందని అనుకుంటాడు. ఏదైనా కంప్లైంట్ రాస్తుందా? అది కంప్లైంట్ బాక్స్ లో వేస్తే చదవాలా? అని ఇగోగా మాట్లాడుకుంటాడు. వేద రాసిన ఆ చీటీ తీసుకెళ్ళి ఫిర్యాదుల బాక్స్ లో వేస్తుంది. నా మీద నాకే ఫిర్యాదా అనుకుని తను కూడా వేదలో తనకి నచ్చని విషయం గురించి రాయాలని అనుకుంటాడు. ఇద్దరూ ఒకరిమీద మరొకరు పోటీగా ఫిర్యాదులు రాసుకుంటారు. అభి భ్రమరాంబిక మాళవిక బుట్టలో ఎలా పడిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మాళవిక వస్తుంది. అభి, ఖైలాష్ మాళవిక తెలివితేటలు తెగ మెచ్చుకుంటారు.
తన అక్కతో అంత ఈజీ కాదని అభి అంటాడు. మీ అక్క పొగరు దించడానికి తన మాట చాలని మాళవిక అంటుంది. మీ అక్కతో ఎలా ఆడుకుంటానో నువ్వే చూడు అని అభిమన్యుతో చెప్తుంది. వేద రాసిన లెటర్ తీసుకుని చదువుతూ మురిసిపోతాడు. వేద పక్కనే ఉండి లెటర్ చదువుతున్నట్టు చూపిస్తారు. ‘ఫిర్యాదుల పెట్టెలో లెటర్ వేశాను అంటే మీ మీద ఫిర్యాదు అని కాదు. మీరు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళతో చాలా ప్రేమగా నడుచుకున్నారు. అందులో ఫుల్ హ్యాపీ. ఇక కంప్లైంట్ ఏంటి అనుకుంటున్నారా? బెడ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత సెంబాడీ స్ప్రే కొట్టుకుంటున్నారు. ఆ వాసన చాలా ఘాటుగా ఉంది. ప్లీజ్ అది వద్దు’ అని రాస్తుంది. అది చూసి యష్ నవ్వుకుంటాడు.
Also Read: జగతి ప్లాన్ వినేసిన దేవయాని- రాజీవ్ తో వసు పెళ్ళిని రిషి అడ్డుకుంటాడా?
యష్ ఆ లెటర్ పట్టుకుని గదిలోకి వచ్చి వేద చూడాలి అన్నట్టుగా దాన్ని చూపిస్తూ బిల్డప్ కొడతాడు. అది చూసి యష్ తన లెటర్ చదివాడు గుడ్ బాయ్ అని మనసులో అనుకుంటుంది. మళ్ళీ యష్ వెళ్ళి సెంట్ బాటిల్ తీసి చెత్త బుట్టలో వేస్తాడు. అది చూసి వేద మురిసిపోతుంది. తన ప్లీజ్ ని అంగీకరించినందుకు సంతోషంగా ఉంటుంది. తన కోసం బాడీ స్ప్రే వదిలేసినందుకు కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్లిపోయిందని యష్ మండిపోతూ ఉంటాడు. వేద మూతి తిప్పి బయటకి వచ్చేసరికి ఫిర్యాదుల బాక్స్ లో లెటర్ చూస్తుంది. అది తీసి చదువుతుంది. బెడ్ రూమ్ లోకి రాగానే చేతి గాజులు, కాలి పట్టీలు తీసేస్తున్నావ్ అని రాస్తాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

