Guppedanta Manasu December 31st: జగతి ప్లాన్ వినేసిన దేవయాని- రాజీవ్ తో వసు పెళ్ళిని రిషి అడ్డుకుంటాడా?
Guppedantha Manasu December 31th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
![Guppedanta Manasu December 31st: జగతి ప్లాన్ వినేసిన దేవయాని- రాజీవ్ తో వసు పెళ్ళిని రిషి అడ్డుకుంటాడా? Guppedanta Manasu Serial December 31st Episode 648 Written Update Today Episode Guppedanta Manasu December 31st: జగతి ప్లాన్ వినేసిన దేవయాని- రాజీవ్ తో వసు పెళ్ళిని రిషి అడ్డుకుంటాడా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/31/0d609089215fb565bd08b9d73a7a2ec81672458307006521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వసుధారకి జగతి ఫోన్ చేస్తే చక్రపాణి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. రిషి తన కన్నా కొడుకు అని జగతి చెప్పేసరికి అలా అయితే అసలు తనకి ఇచ్చి పెళ్లి చెయ్యనని అంటాడు.
చక్రపాణి: నీ ట్రైనింగ్ వల్ల పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కొడుక్కి ఇస్తే మా ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు అని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేస్తాడు. నీ పెళ్లి నా ఇష్టమని వసు మీద అరిచి తనని గదిలో పెట్టి గది పెడతాడు. ఫోన్ కూడా తన దగ్గర నుంచి తీసుకొచ్చేస్తాడు. వసు తలుపు తియ్యమని బతిమలాడుతుంది. తలుపు తీసే పాడే ఎక్కుతాను అని మంచి నీళ్ళ బాటిల్ లో విషం కలుపుకుంటాడు. తలుపు తీస్తే అది తాగి చస్తాను అని బెదిరిస్తాడు. ఫోన్ కూడా ఇవ్వొద్దని అంటాడు. ఆ మాటకి వసు, సుమిత్ర ఇద్దరూ కూలబడి ఏడుస్తూ ఉంటారు.
Also Read: 'చావులోనూ నీతోనే నేను' ఎమోషనల్ అయిన కార్తీక్, దీప- పండరిని హిమ కలుస్తుందా!
రాజీవ్ కి చక్రపాణి ఫోన్ చేస్తాడు. పరువు, కుటుంబాన్ని కాపాడాలని చక్రపాణి రాజీవ్ ని అడుగుతాడు. చక్రపాణి మాట్లాడిన విషయాలను మహేంద్రతో జగతి చెప్తుంది. ఈ విషయం రిషికి చెప్దామని మహేంద్ర అంటాడు. జగతి మాత్రం వద్దని అంటుంది. వసు పరిస్థితి ఎలా ఉందో ముందు మనం అక్కడికి వెళ్దాం. ఇంట్లో తెలియకుండా వెళ్ళాలి అని జగతి అంటుంది. వదినకి అనుమానం వస్తుందేమో అని మహేంద్ర అంటాడు. కానీ జగతి మాత్రం వెళ్ళాలి మనం వచ్చే దాకా బావగారు ఇంట్లోనే ఉంటారు, మనం వెళ్తే అక్కడి పరిస్థితి సరి చెయ్యొచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు అన్నీ దేవయాని వింటుంది. ఇంత ప్లాన్ చేస్తావా అని దేవయాని రాజీవ్ కి కాల్ చేస్తుంది. రిషి కోసం జగతి, మహేంద్ర వాళ్ళు అక్కడికి వస్తున్నట్టు చెప్తుంది.
మహేంద్ర వాళ్ళు ఎవరూ చూడటం లేదు కదా అని బయటకి వెళ్లబోతుంటే ఏమి తెలియనిదానిలా దేవయాని ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. సామాన్లు, చీరలు కొనాలి అన్నారు కదా వాటి కోసం వెళ్తున్నాం అని మహేంద్ర అబద్ధం చెప్తాడు. దేవయాని వాళ్ళని పంపించేసి సంతోషపడుతుంది. వసు గదిలో ఉండి తలుపు తియ్యమని బతిమలాడుతూ ఉంటుంది. సుమిత్ర మాత్రం చక్రపాణి బెదిరించిన విషయం గుర్తు చేసుకుని భయపడుతుంది. నాన్న ఊరికే బెదురిస్తున్నారు అలా ఏమి చేయరు. నాన్న వస్తే బయటకి వెళ్లలేను కనీసం ఫోన్ అయినా ఇవ్వమని అడుగుతుంది. ఫోన్ ఇచ్చే టైమ్ కి చక్రపాణి పూల దండాలు పట్టుకుని ఇంట్లోకి వస్తాడు.
రాజీవ్ తో వసుకి పెళ్లి చేస్తున్నా అని చక్రపాణి చెప్తాడు. ఆ మాట విని వసు, సుమిత్ర షాక్ అవుతారు. రిషి సార్ ని పెళ్లి చేసుకుంటాను అని వసు అంటుంది. కానీ చక్రపాణి మాత్రం తన మాట వినకపోతే విషం తాగి చస్తాను అని బెదిరిస్తాడు. సుమిత్ర ఏమి చేయలేక ఏడుస్తుంది. చక్రపాణి ఇంట్లో పెళ్లికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. వసు అది చూసి తలుపు తియ్యమని వేడుకుంటుంది. కానీ వసు తండ్రి మాత్రం సుమిత్రని బెదిరిస్తూనే ఉంటాడు. అప్పుడే వసుకి ఫోన్ వస్తుంది. కానీ చక్రపాణి మాత్రం ఫోన్ ఇవ్వను అని చిరాకు పెట్టిస్తాడు. రిషి ఫోన్ సుమిత్ర లిఫ్ట్ చేసి స్పీకర్ అణ్ చేస్తుంది. రిషి కంగారుగా ‘ఏం జరుగుతుంది, మీ బావ వచ్చి ఏదేదో వాగి నీకు తనకి పెళ్లి అని అంటున్నాడు. నేను వస్తున్నాను, భయపడకు మా వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ బావ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాడు. అందుకే నువ్వు వద్దన్నా ఎన్ను ఇంటికి వస్తున్నా’ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. రాజీవ్ పంతుల్ని తీసుకుని ఇంట్లో అడుగుపెడతాడు. పెళ్లి ఏర్పాట్లు చూసి రాజీవ్ నవ్వుకుంటాడు. మీరు ఇంత కష్టపడి పెళ్లి చేస్తున్నారని చూసి సంబరపడతాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)