News
News
X

Karthika Deepam December 31st: 'చావులోనూ నీతోనే నేను' ఎమోషనల్ అయిన కార్తీక్, దీప- పండరిని హిమ కలుస్తుందా!

కార్తీకదీపం డిసెంబరు 30 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

దీప, కార్తీక్ సౌందర్య వాళ్ళకి కనిపించకుండా చాటుగా ఉండి మాట్లాడుకుంటారు. యాక్సిడెంట్ లో నేను చనిపోయాను అని చెప్పి మీరు అత్తయ్య వాళ్ళ దగ్గరకి వెళ్లిపోండి అని దీప అంటుంది.

కార్తీక్: అదేంటి నా ప్రాణాలు కదా పోయేది

దీప:  నాకు అంతా తెలుసు, నేను నిద్రపోయాను అనుకుని మీరు మాట్లాడుకోవడం విన్నాను. అందుకే చెప్తున్నా నేను బతికేలేను అని చెప్పండి అప్పుడు వాళ్ళకి ఏ బాధ ఉండదు మీరు అయినా ఉన్నారని సంతోషిస్తారు వెళ్ళండి

కార్తీక్: అది జరగదు దీప వెళ్తే ఇద్దరం వెళ్తాం లేదంటే లేదు

సౌందర్య హేమచంద్రతో మాట్లాడి వెళ్లిపోతుంటే దీప కార్తీక్ ని తనతో పాటు వెళ్ళమని అంటుంది. కానీ అందుకు కార్తీక్ ఒప్పుకోడు. ఆవిడ బాధ చూసి కూడా మీ మనసు కరగడం లేదా అని హేమచంద్ర అడుగుతాడు. మనసు కరగడం కాదు అమ్మని కౌగలించుకుని ఏడ్వాలని అనిపించిందని కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. హిమ కార్తీక్ వాళ్ళ ఫోటో చూపిస్తూ రోడ్డు మీద తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. ఎవర్ని అడిగినా చూడలేదని చెప్పేసరికి దిగాలుగా కూర్చుంటుంది. అప్పుడే పండరి అటుగా వెళ్తుంటే ఒక బైక్ గుద్దేసి వెళ్లడంతో ఆమె చేతిలోని కూరగాయలు కిందపడిపోతాయి. వాటిని హిమ ఎత్తిస్తుంది. తనని అడిగితే అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కదా అనుకుని ఆమె కోసం వెళ్తుంది కానీ అప్పటికే పండరి వెళ్ళిపోతుంది.

Also Read: రిషిసార్ నాకు కాబోయే భర్త - తండ్రికి తేల్చి చెప్పిన వసు, పెళ్లి చెడగొట్టేందుకు రాజీవ్-దేవయాని నయా ప్లాన్!

దీపని ట్యాబ్లెట్స్ వేసుకోమని కార్తీక్ అడుగుతాడు. కానీ దీప మాత్రం తను బతికే అవకాశమే లేదు కదా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్తాడు. తనని వదిలేసి ఇంటికి వెళ్లిపొమ్మని అంటుంది కానీ కార్తీక్ మాత్రం ఒప్పుకోడు. బతుకు ఎటు పంచుకోలేకపోయాను కనీసం చావు అయినా పంచుకొనివ్వు అని బాధగా మాట్లాడతాడు. బతికిన ఈ కొన్ని రోజులు అయినా నీతోనే ఉండనివ్వు అని కార్తీక్ తేల్చి చెప్తాడు. వాళ్ళ మాటలు విని పండరి కూడా కూడా బాధపడుతుంది. ఆనందరావు వాళ్ళు భోజనం చేస్తుంటే ఇంద్రుడు వస్తాడు. తను కింద కూర్చుని తినబోతుంటే వద్దని చెప్పి డైనింగ్ టేబుల్ మీద కూర్చోమని చెప్తాడు. హిమ అన్నం తినకుండా శౌర్య అమ్మానాన్న కోసం చూడకుండా హ్యపీగా ఉంటుందని గొడవపెట్టుకుంటుంది.

అమ్మ వాళ్ళ కోసం నేను కొన్ని నెలల నుంచి ఇక్కడే ఉండి వెతుకుతున్నా అని అంటుంది. ఇంద్రుడు, చంద్రుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడే హిమకి అమ్మానాన్న గుర్తుకు వచ్చారా కావాలనే ఇలా చేస్తుందని శౌర్య తిడుతుంది. చారుశీల కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోనితది పిచ్చి ప్రేమ కానీ నాకు మాత్రం కార్తీక్ ఆస్తి కావాలి అని మనసులో అనుకుంటుంది. దీప పోయాక కార్తీక్ ఒంటరి వాడు, మోనిత జైలు నుంచి బయటపడే ఛాన్స్ లేదు కాబట్టి తనకి ఛాన్స్ ఉందని అనుకుంటుంది. తన తర్వాత కార్తీక్ నాతోనే సంతోషంగా ఉంటాడని నమ్మకం కలిగించాలి దీప మనసు మార్చాలి అని స్కెచ్ వేస్తుంది.

Also Read: షాకిచ్చిన భ్రమరాంబిక, బిక్కమొహం వేసిన అభిమన్యు- ప్రేమపక్షుల విహారయాత్ర అధ్బుతం

Published at : 31 Dec 2022 08:31 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 31st

సంబంధిత కథనాలు

Guppedanta Manasu January 28th Update:  వసుని సపోర్ట్ చేస్తూ దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, చక్రపాణిని మాట వినిపించుకోని జగతి-మహేంద్ర

Guppedanta Manasu January 28th Update: వసుని సపోర్ట్ చేస్తూ దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, చక్రపాణిని మాట వినిపించుకోని జగతి-మహేంద్ర

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Vishnu Priya Mother Died: యాంకర్ విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం - జీవితాంతం రుణపడి ఉంటా అమ్మా అంటూ భావోద్వేగం

Vishnu Priya Mother Died: యాంకర్ విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం - జీవితాంతం రుణపడి ఉంటా అమ్మా అంటూ భావోద్వేగం

Guppedanta Manasu January 27th Update: చుట్టూ కమ్మే రేయో,మాయో మొత్తం కరగాలి - వసుని మరింత గాయపర్చిన రిషి

Guppedanta Manasu January 27th Update: చుట్టూ కమ్మే రేయో,మాయో మొత్తం కరగాలి - వసుని మరింత గాయపర్చిన రిషి

Janaki Kalaganaledu January 27th: పరీక్షల్లో ఫెయిలైన జానకి- కొడుకులకి గడ్డి పెట్టిన గోవిందరాజులు

Janaki Kalaganaledu January 27th: పరీక్షల్లో ఫెయిలైన జానకి- కొడుకులకి గడ్డి పెట్టిన గోవిందరాజులు

టాప్ స్టోరీస్

Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ

Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ

Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక

Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక

Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి