By: ABP Desam | Updated at : 16 Dec 2022 09:33 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
తులసి తన పుట్టిన ఊరుకి వెళ్తుంది. అక్కడ తను పుట్టిన ఇల్లు చూసి ఎమోషనల్ అవుతుంది. ఇంట్లోకి వెళ్ళడానికి తాళం పగలగొడతాడు. సాయం చేస్తున్నందుకు తులసి సంతోషంగా ఉంటుంది. ఏకంగా సామ్రాట్ ని బ్రహ్మ దేవుడితో పోల్చేస్తుంది. ఇల్లంతా తిరుగుతూ తులసి ‘ఏదో ఒక రాగం’ అంటూ పాట కూడా పాడుతుంది. అప్పుడే ఒకాయన వచ్చి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తాడు. బయటకి వచ్చి ఆయన్ని చూసి సంతోషిస్తుంది. నీకు సంగీతం నేర్పించిన జగన్నాథం మాస్టర్ ని అని అంటాడు. ఆయన తులసి పాట విని, తన గొంతు బాగుందని తెగ మెచ్చుకుంటాడు. కాసేపు తులసిని పొగడటం చేస్తాడు. సామ్రాట్ ని చూపించి తన స్నేహితుడు అని పరిచయం చేస్తుంది.
గొప్ప గాయని అయ్యావా అని మాస్టర్ అడుగుతాడు. పెళ్లి చేసుకునే ముందే సంగీతాన్ని పుట్టింట్లో వదిలేశానని చెప్తుంది. మ్యూజిక్ స్కూల్ పెడుతున్నా, దాన్ని మీరే ప్రారంభించాలని తులసి ఆయన్ని అడుగుతుంది. ఏదో ఒక రోజు ఈ ఇంటిని తన తమ్ముడికి బహుమతిగా ఇవ్వాలని తులసి కోరుకుంటుంది. ఇంకేముంది మన హీరో గారు ఇంటిని కూడా కొనేస్తారు అన్నమాట. అంకిత లాస్య దగ్గరకి వచ్చి గొడవ పడుతుంది.
Also Read: హడలెత్తించిన భ్రమరాంబిక- మాళవికని ఇంట్లో నుంచి పంపించేయమన్న అభీ సిస్టర్
అంకిత: వాళ్ళు నా పేషెంట్స్ వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేసే హక్కు నీకు ఎక్కడ ఉంది. పేద వాళ్ళకి ఉచితంగా సేవ చెయ్యాలని నేను చూస్తుంటే నువ్వు ఎందుకు నాకు చెప్పకుండా ఫీజు వసులు చేశావ్
లాస్య: పేషెంట్స్ నీ వాళ్ళే అయినా వాళ్ళు కూర్చుంది నా ఇంట్లో. నా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళని ఎందుకు ఇంటికి రమ్మన్నావ్. ఇక్కడ ఉండటానికి మీకు పర్మిషన్ ఇచ్చాను కానీ నీ పేషెంట్స్ కాదు ఇదేమి ధర్మాసుపత్రి కాదు. నీకే ఠికాణ లేదు నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం ఏంటి నవ్వుతారు
అప్పుడే నందు వచ్చి ఏంటి విషయం అని అడుగుతాడు. పేదవాళ్ళకి ఉచితంగా సేవ చెయ్యాలని అంకిత అనుకుంటుంది, నువ్వు సెటిల్ అయిన తర్వాత అలా చెయ్యొచ్చు కదా అని చెప్పాను అని లాస్య మాట మార్చి నందుతో చెప్తుంది. ఆ మాటకి నందు కూడా లాస్యకి వంత పాడతాడు. మన పరిస్థితి బాగోలేదు అది ఆలోచించమని అంటాడు. తులసి ఆంటీ ఉన్నప్పుడు కూడా మన పరిస్థితి ఇదే కదా అని అంకిత అంటుంది. తులసి ఆంటీ చేసింది తప్పు పట్టడం లేదు కానీ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
Also Read: వేడుకగా జెస్సి సీమంతం- జానకి దాస్తున్న నిజాన్ని మల్లిక బయటపెడుతుందా?
తులసి ఇంట్లో ట్రంకు పెట్టె కోసం వెతుకుతూ ఉంటుంది. అది దొరకగానే దాన్ని తీసుకుని జాగ్రత్తగా కిందకి దించుతుంది. తవ్వకాల్లో లంకె బిందె దొరికినంత ఆనందంగా ఉంది మీ మొహం అని సామ్రాట్ పొగిడేస్తాడు. ఆ బాక్స్ లో ఏంటో నిధి ఉన్నట్టు కలరింగ్ ఇస్తారు. అందులో మాసిపోయిన బట్టలు ఏవో వస్తువులు ఉంటాయి. అందులో చిరంజీవి ఫోటో కూడా ఉంటుంది. ఒక్కొక్కటి చూపిస్తూ వాటి చరిత్ర చెప్పమని మరీ అడుగుతాడు.
Swara Bhaskar Pregnancy : తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి - పెళ్ళైన మూడు నెలలకే గుడ్ న్యూస్
నితిన్, రష్మికల 'VNRTrio' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం
Lust Stories 2 Teaser : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!
Mukesh Khanna: భారీ బడ్జెట్‌తో ‘శక్తిమాన్’ నిర్మాణం - ‘స్పైడర్ మ్యాన్’ నిర్మాణ సంస్థ చేతికి ఇండియన్ మూవీ: ముఖేష్ ఖాన్నా
Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం
WTC Final 2023: మాకా.. నాకౌట్ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్ రెస్పాన్స్ ఇదీ!