Ennenno Janmalabandham December 16th: హడలెత్తించిన భ్రమరాంబిక- మాళవికని ఇంట్లో నుంచి పంపించేయమన్న అభీ సిస్టర్
కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వడంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద, యష్ ఇద్దరూ అగ్రహారం వెళ్తు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటని అడుగుతారు. రాజా, రాణి అని చెప్తుంది. వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు, ఈ వయస్సులో కూడా స్వచ్చమైన ప్రేమికులుగా ఉంటారని వేద సంతోషంగా చెప్తుంది. నేను కూడా నా భర్తతో అలాగే ఉండాలని అనుకుంటున్నా’ అని వేద అనేసరికి యష్ ఆశ్చర్యంగా చూస్తాడు. అవి వాళ్ళ అసలు పేర్లు కాదని తన తాతయ్య పేరు వీరవెంకట సుబ్రమణ్య రామచంద్రమూర్తి అని చెప్తుంది. అమ్మమ్మ పేరు ఏంటని అడుగుతాడు. సగం పేరు చెప్పి ఆపేస్తుంది. ఎందుకు ఆపేశావ్ చెప్పమని అంటాడు. వెంకట సుబ్బలక్షి శ్రీవల్లి శ్రీదుర్గ అని చెప్పి తర్వాత చెప్పడానికి సిగ్గు పడుతుంది. నవ్వను అంటే చెప్తానని అంటుంది. శ్రీ వేదస్విని అని చెప్తుంది.
ఆ పేరు వినగానే యష్ బాగుంది ని వెటకారంగా అంటాడు. అంటే నీ పేరు ఉత్త పేరు కాదు చాంతాడంత ఉంది కదా అని నవ్వుతూ ఉంటాడు. అభిమన్యు అక్క ఎంట్రీ ఇస్తుంది. బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పగానే ఈ బ్యాడ్ హేబిట్ ఇంకా మారలేదా అని తిడుతుంది. కాళ్ళకి నమస్కారం చేసి ఆశ్వీరవాదం తీసుకోవాలని తెలియదా అని చిన్న క్లాస్ పీకుతుంది. వెంటనే ఖైలాష్ ఆమె కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం పెడతాడు. ఎవడు వీడు ఓవరాక్షన్ కి పరాకాష్టలాగా ఉన్నాడు, చాలా డేంజర్ వీడితో జాగ్రత్తగా ఉండమని అభికి చెప్తుంది. ఆవలిస్తే పేగులు లెక్కబెడుతుంది ఇప్పుడు బంగారం ఎదురుపడితే పరిస్థితి ఏంటో అని అభి మనసులోనే టెన్షన్ పడతాడు.
Also Read: వేడుకగా జెస్సి సీమంతం- జానకి దాస్తున్న నిజాన్ని మల్లిక బయటపెడుతుందా?
వేద వాళ్ళు హ్యపీగా కార్లో పాటలు వింటూ వెళతారు. ఇద్దరి సిచ్యుయేషన్ కి తగినట్టు ఓ పాట వేసి కాసేపు ఒకరికొకరు చూసుకుంటారు. భ్రమరాంబిక ఇంట్లోకి రాగానే మాళవిక ఎదురుపడుతుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంది. చెప్పు అభి అని తన వైపు చూస్తుంది. అభి ఏంటి రెస్పెక్ట్ లేకుండా అని సీరియస్ అవుతూ మళ్ళీ ఎవరు నువ్వు అని అడుగుతుంది.
అభి: తను మిస్ మాళవిక నా ఫ్రెండ్
భ్రమరాంబిక: ఇద్దరు పిల్లల తల్లిలా ఉంది, ఈవిడ మిస్ ఏంటి
అభి: చాలా కష్టాల్లో ఉంది, అందుకే షెల్టర్ ఇచ్చాను
భ్రమరాంబిక: రెండు రోజుల్లో ఇల్లంతా క్లీన్ చేసేయ్ తనని పంపించేసేయ్ అని చెప్తుంది.
Also Read: లాస్య వంకర బుద్ధి తెలుసుకున్న అంకిత- చిన్ననాటి ఇంట్లోకి అడుగుపెట్టిన తులసి
మాళవిక: ఏంటి మీ అక్క అంత చీప్ గా మాట్లాడుతుంది. నేను అడిగితే మన రిలేషన్ షిప్ గురించి ఆల్రెడీ చెప్పాను అన్నావ్ మరి ఇదేంటి అని అభిని నిలదీస్తుంది. కొంచెం చెప్పాను ఇంకొంచెం చెప్పాలి అని వెళ్ళిపోతాడు. ఆమెని చూసి ఖైలాష్ బిత్తరపోతాడు. ఈవిడ తనంతట తను వచ్చినట్టు లేదు, తను చెప్పించాల్సింది అక్కతో చెప్పించడానికి అభి బ్రో ప్లాన్ చేసి తీసుకొచ్చినట్టు ఉంది, నువ్వు డేంజర్లో పడ్డావ్ అని ఖైలాష్ మంట పెడతాడు. ఇంటి దగ్గర రాజా, రాణి వాళ్ళు వేద కోసం ఎదురు చూస్తూ ఉంటారు.