Gruhalakshmi April 25th: దివ్యకి చుక్కలు చూపిస్తున్న రాజ్యలక్ష్మి- తులసి వాళ్ళని అవమానించి పంపించమన్న లాస్య
దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పూజ కోసం అక్షింతలు సిద్ధం చేసేందుకు బియ్యంలో పశువు కలిపితే సరిపోతుందని దివ్య అనుకుంటుంది. పసుపు తడి చేయకుండా డైరెక్ట్ గా కలుపుతుంటే ప్రసూనాంబ వచ్చి ఏంటి ఇదని అడుగుతుంది. పసుపు వేసే ముందు బియ్యాన్ని తడి చేయాలి అప్పుడే పసుపు అంటుంది ఈ మాత్రం కూడా మీ అమ్మ నేర్పించలేదా అంటుంది. ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు నాకే టైమ్ లేకపోవడం వల్ల నేర్చుకోలేదని చెప్తుంది. పెళ్లి టైమ్ కి అన్నీ నేర్పించి పంపించే బాధ్యత తల్లిదేనని వెటకారంగా మాట్లాడుకుంటుంది. ఇందాక నువ్వు మా వాడు చెంగు చెంగున పరుగులు పెట్టారు కదా అది ఎవరు నేర్పించారు అక్షరాభ్యాసంలాగా ఎవరూ నేర్పించరని బసవయ్య దెప్పి పొడుస్తాడు. తర్వాత పూజా సామాగ్రి కడుగుతుంటే అవి నూనె జిడ్డు వదలడం లేదని తిట్టుకుంటుంది. మళ్ళీ ప్రసూనాంబ వచ్చి దీపపు కుందులు పీతాంబరంతో తోమాలని వచ్చి దెప్పి పొడుస్తూ మాట్లాడుతుంది.
Also Read: మనసుల్ని మెలిపెట్టేసిన ఎమోషన్- భవానీ మాటలకు గుండెలు పగిలేలా ఏడ్చిన మురారీ
రాజ్యలక్ష్మి వచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతుంది. దివ్య మీద చాలా ఆశలు పెట్టుకున్నావ్ కానీ తనకి ఏ పని చెప్పినా తెమలడం లేదు తనకి ఏమీ రావని అంటుంది. అవి క్లీన్ చేసి దేవుడి దగ్గర పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టమని పురమాయిస్తుంది. అప్పటికీ అమ్మ నేర్చుకోమని చెప్పింది కానీ నేనే వినలేదని తనని తాను తిట్టుకుంటుంది. దివ్య పని చేస్తుంటే తొందరపెడుతూ పరుగులు పెట్టిస్తారు. గుమ్మానికి తోరణాలు కట్టడానికి దివ్య కష్టపడుతుంటే వెళ్ళి తనని ఎత్తుకుంటాడు. ఎవరూ చూడటం లేదు కట్టేసెయ్ అని అంటాడు. వాళ్ళని చూసి రాజ్యలక్ష్మి కోపం కట్టలు తెంచుకుంటుంది. హహయి వాళ్ళని తిడుతుంది. పూజ పనులు నిన్నే చేయమని చెప్పాను కదా మళ్ళీ ఏంటి ఇది నువ్వేమి చిన్న పిల్లవి కాదు పెళ్ళైన పిల్లవి. పూజ చేసేటప్పుడు పవిత్రంగా ఉండాలి వాడు ముట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళి తలస్నానం చేసి రమ్మని చెప్తుంది. గుమ్మానికి తోరణం కట్టడానికి గుమ్మం అందకపోతే సాయం చేశానని విక్రమ్ అమాయకంగా చెప్తాడు.
Also Read; మాళవికతో ఛాలెంజ్ చేసిన వేద- యష్ తో కలిసి రొమాంటిక్ డేట్
దివ్య దగ్గరకి వెళ్ళడానికి వెళ్లేందుకు ఇంట్లో తులసి హడావుడి చేస్తుంది. అత్తారింట్లో దివ్యని అత్త రాచి రంపాన పెడుతుందా ఏంటని అనసూయ సరదాకి అనేసరికి నందు బాధపడతాడు. సరదాకి కూడా ఆ మాట అనొద్దని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఈ మధ్య చాలా టెన్షన్ పడుతున్నారని తులసి అంటుంది. లాస్య వచ్చి బయల్దేరదామా అని వస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళగానే నీ స్థానం మారిపోతుంది తులసి నీ స్థానంలోకి వస్తుందని అనసూయ అనేసరికి లాస్య మొహం మాడిపోతుంది. తులసిని ఇంట్లోనే ఉండమని లాస్య అంటే తను కాదు ఉండాల్సింది నువ్వు తులసి కాదని చెప్తుంది. అనసూయ దంపతులు తులసి, నందులతో కలిసి రాజ్యలక్ష్మి ఇంటికి బయల్దేరతారు. ఏం జరుగుతుంది నన్ను వదిలి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటని లాస్య తిట్టుకుంటుంది. వెంటనే రాజ్యలక్ష్మికి ఫోన్ చేస్తుంది.
పూజకి వచ్చిన నందు, తులసిని అందరి ముందు అవమానించి పంపించాలని రాజ్యలక్ష్మిని అడుగుతుంది. మీ గొడవల్లోకి తనని లాగొద్దని అంటుంది. కానీ లాస్య మాత్రం బతిమలాడుతుంది. పూజ పనులన్నీ కొత్త కోడలితో చేయిస్తున్నారా అని పంతులు అడుగుతాడు. ప్రతి దానికి దివ్యని తిడుతూ ఉంటారు. ఏ పని సరిగా రావడం లేదు ఎందుకు పనికి రానా అని దివ్య మనసులో బాధపడుతుంది.