అన్వేషించండి

Ennenno Janmalabandham April 25th: మాళవికతో ఛాలెంజ్ చేసిన వేద- యష్ తో కలిసి రొమాంటిక్ డేట్

యష్ వేదని వదిలేసి అమెరికా వెళ్లిపోవడానికి సిద్ధపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద, యష్ డేట్ కి వచ్చిన రెస్టారెంట్ కి మాళవిక కూడా వస్తుంది. శ్రీమతి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండా పక్కకి చూస్తారేంటని వేద అడుగుతుంది. యష్ మాత్రం చాలా బాధగా ఉంటాడు. నన్ను, ఖుషిని మీరు చాలా మిస్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు కదా మమ్మల్ని వదిలి వెళ్లాలని మీకు లేదు కదా అంటుంది. సంతోషానికి నువ్వు దగ్గర అవాలంటే నేను దూరం అవక తప్పడం లేదని యష్ మనసులోనే బాధపడతాడు. నన్ను వదిలి వెళ్ళడం అవసరమా అంటుంది. వెళ్ళక తప్పడం లేదని చెప్తాడు.

వేద: మీ బదులు ఎవరో ఒకరిని పంపించొచ్చు కదా ఉండిపోవచ్చు కదా నాకోసం

యష్: అది నీ కోసమే నేను ఏం చేసినా అది నీకోసమే ఇప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత మెల్లగా అదే సర్దుకుంటుంది. సూప్ తాగుతూ వేద కావాలని తన స్పూన్ కింద పడేసుకుని యష్ ది తీసుకుని తాగుతుంది. ఎలా వేద నీతో ఈ ఎటాచ్ మెంట్ వదిలేసి ఎలా వెళ్ళేది. నా కోసం ఆలోచించుకుంటే ఉండిపోవాలని అనిపిస్తుంది. నా కోసం కాదు నీకోసం వెళ్తానని అనుకుంటాడు. కాసేపటికి వేద, యష్ రొమాంటిక్ గా కాసేపు డాన్స్ చేస్తారు. అది చూసి మాళవిక కుళ్ళుకుంటుంది. వేద నడుచుకుంటూ వెళ్తుండగా మాళవికని ఢీ కొడుతుంది. కళ్ళు కనిపించడం లేదా అని ఇద్దరూ పోట్లాటకి దిగుతారు.

Also Read: కృష్ణమ్మ కలిపింది ఆ ఇద్దరినీ- మురారీ దంపతులకు కఠినమైన శిక్ష వేసిన భవానీ

మాళవిక: నీ మొగుడు నిన్ను వదిలేసి వెళ్లిపోతున్నాడంట కదా

వేద: ఏం మాట్లాడుతున్నావ్

మాళవిక: అమెరికా షిఫ్ట్ అయిపోతున్నాడంట కదా

వేద: షిఫ్ట్ అవడం లేదు ఆఫీసు పని మీద వెళ్తున్నాడు. ఎక్కువ ఊహించుకుని కుళ్ళుకోకు

మాళవిక: నువ్వు కాపురం చేసేది నేను వదిలేసిన మొగుడితో నేను వద్దనుకున్న కూతురితో ఇంక నీకంటూ ఏముంది నిన్ను చూసి కుళ్ళుకోవడానికి

వేద: నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త ఉన్నాడు. మనసారా నన్ను ప్రేమించే మొగుడు. ఆయన చేత ఆ మాట ఈరోజు ఇప్పుడే చెప్పిస్తా. అందరి ముందు ఇప్పుడే ఇక్కడే ఐలవ్యూ చెప్పించుకుంటా

మాళవిక: అది జరగని పని

వేద: వెయిట్ అండ్ వాచ్

బెస్ట్ కపుల్ గా మిస్టర్ అండ్ మిసెస్ యశోధర్ వేద సెలెక్ట్ అయ్యారని రెస్టారెంట్ సిబ్బంది ప్రకటిస్తారు. వేద భర్తని తీసుకుని సంతోషంగా నిలబడితే మాళవిక వచ్చి తన పక్కన నిలబడుతుంది.

Also Read: ఎస్సైకి దిమ్మతిరిగే షాకిచ్చిన జానకి- రామ విడుదల, జ్ఞానంబ హ్యాపీ

మాళవిక: ఏంటి యష్ నాతో కాపురం చేసే రోజుల్లో 10 నిమిషాలు కూడా నన్ను వదిలి ఉండలేకపోయే వాడివి అలాంటిది పది రోజులు అమెరికా వెళ్తున్నావంట కదా. తప్పు లేదులే నువ్వు పిచ్చిగా ప్రేమించింది నన్ను, పనికిరాని పెళ్ళాం వేద అనబోతుంటే యష్ నోరు మూసుకోమని అంటాడు.

వేద: నా కాపురాన్ని నేను నిలబెట్టుకుంటాను

రెస్టారెంట్ లో ఎంటర్ టైన్మెంట్ టాస్క్ లో భాగంగా యష్ కళ్ళకి గంతలు కడతారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని జిగ్ జాగ్ గా నిలబడితే వాళ్ళలో వేద ఎక్కడ ఉందో కనిపెట్టాలని చెప్తారు. యష్ మాళవిక దగ్గరకి వెళ్ళి టచ్ చేయబోతుంటే వేద చాలా ఫీల్ అవుతుంది. మాళవిక సంతోషపడుతుంది. కానీ వెంటనే యష్ చేతిని వెనక్కి తీసి వేద దగ్గరకి వెళ్ళి తనని టచ్ చేస్తాడు. దీంతో వేద సంతోషంగా తనని హగ్ చేసుకుంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget