Janaki Kalaganaledu April 24th: ఎస్సైకి దిమ్మతిరిగే షాకిచ్చిన జానకి- రామ విడుదల, జ్ఞానంబ హ్యాపీ
రామ అరెస్ట్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ ఇంట్లో బారసాల కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. గోవిందరాజులు జ్ఞానంబ అన్న మాటలు తలుచుకుని బాధపడతాడు. ఈరోజు మన మనవడి బారసాలకి నువ్వేమి పట్టనట్టు ఉండటం ఏం బాగోలేదు అఖిల్ బాధపడుతున్నాడు. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్. రామ గురించి బాధ నాకు ఉంది కానీ దిగమింగుకుంటున్నా. నువ్వు ఇలా అందరికీ దూరంగా ఉండటం బాగోలేదు. చేతులు జోడిస్తున్న నీకు మనవడి బారసాల వేడుకలో పాల్గొనమని బతిమలాడతాడు. భర్త మాటలకు జ్ఞానంబ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మల్లిక బారసాల జరగదులే అంటూ ధీమాగా కూర్చుంటుంది. ఏది ఆగేది లేదని విష్ణు అంటాడు. జ్ఞానంబ బిడ్డని కూడా ఎత్తుకోకుండా గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. మల్లిక వచ్చి జానకి ఎక్కడ కనిపించడం లేదని మంట రగిలిస్తుంది.
Also Read: దివ్యకి అత్తారింట్లో మొదలైన కష్టాలు- కూతురి బాధ తులసి గుర్తిస్తుందా?
జానకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందని చెప్తాడు. ఇంట్లో కళ్ళెదురుగా ఉంటే సతాయిస్తామేమో అని తప్పించుకుని వెళ్ళిపోయి ఉంటుందని పుల్ల వేస్తుంది. బావని బెయిల్ కూడా రాని కేసులో బుక్ చేశారంట అందరూ అనుకుంటున్నారని పుల్ల విరుపు మాటలు మాట్లాడుతుంది. ఆ మాట విని జ్ఞానంబ మరింత కంగారుపడుతూ వెళ్ళిపోతుంది. అఖిల్ వచ్చి ఏంటి అమ్మ అలా వెళ్లిపోతుందని అడుగుతాడు. బావ వస్తాడో రాడోనని దిగులు పెట్టుకుంది ఇక బారసాల జరగడం కష్టమేనని మల్లిక పుల్ల పెడుతుంది. ఈ బారసాల జరగకపోతే ఇక మాకు సంబంధించిన శుభకార్యాలు ఏవి ఇంట్లో జరగవు ఈ మాట అమ్మకి చెప్పమని అఖిల్ కోపంగా వెళ్ళిపోతాడు. ఇంటి భవిష్యత్ నీ చేతిలోనే ఉందని జానకి అని గోవిందరాజులు మనసులో అనుకుంటాడు.
మొగుడు విషయంలో జానకికి ఇచ్చిన గడువు పూర్తయ్యింది ఉద్యోగానికి రిజైన్ చేయాలి కదా ఇంకా రాలేదేంటి నన్ను రెచ్చగొట్టడమా అని మనసులో అనుకుని సుగుణని పిలిచి ఫోన్ చేయమని చెప్తాడు. తను రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పమని అంటాడు. అప్పుడే జానకి స్టేషన్ లోకి అడుగుపెడుతుంది. ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నావ్ నీ రాజీనామా నా చేతిలో పెట్టి రామని తీసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యావా అనిన సంబరంగా అడుగుతాడు. రామని తీసుకుని వెళ్ళడానికి వచ్చానని జానకి చెప్తుంది. జెస్సీ వాళ్ళ తల్లిదండ్రులు ఫంక్షన్ కి వస్తారు. మీ వాళ్లేవరూ రాలేదు ఏంటని మేరీని అడుగుతుంది. నేనే పిలవలేదు అల్లుడు అన్న జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు వాళ్ళు వస్తే నా అల్లుడు పరువు పోతుందని అలా చేసినట్టు చెప్తుంది. జ్ఞానంబ మౌనంగా ఉండటం చూసి ఏంటి అలా ఉన్నారు మీ పెద్ద కోడలు ఎక్కడని అడుగుతుంది.
జానకి: నేను డ్యూటీ చేయడానికి స్టేషన్ కి రాలేదు రామని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను
మనోహర్: రాజీనామా చేయకపోతే రామని తీసుకువెళ్లాల్సింది ఇంటికి కాదు కోర్టుకి
జానకి: లాయర్ ని పిలుస్తుంది. బెయిల్ పేపర్స్ తెచ్చి లాయర్ మనోహర్ చేతిలో పెడతాడు.
మనోహర్: రామని అసలు కోర్టులోనే ప్రవేశపెట్టనప్పుడు కోర్టు బెయిల్ ఎలా ఇస్తుంది
Also Read: బొమ్మ అదుర్స్- గుండు బాస్ తో గుటకలు వేయించిన వసు, రిషి కల నెరవేర్చిన జగతి
లాయర్: స్టేషన్ బెయిల్ కి అప్పీలు చేశాం
మనోహర్: నేను ఇవ్వను కదా
జానకి: ఇంట్లో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు పూచీకత్తు మీద బెయిల్ తీసుకోవచ్చు. మా అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు కొడుకు కోసం కలవరిస్తున్నారు ఇదిగో మెడికల్ సర్టిఫికెట్స్
మనోహర్: నేను స్టేషన్ బెయిల్ ఇచ్చేదే లేదు అనగానే అప్పుడే ఫోన్ వస్తుంది. అది చూసి షాక్ అవుతాడు. ఇంట్లో బారసాల జరుగుతుంటే జ్ఞానంబ మొహం మాడ్చుకుని తిరుగుతుంది.