Krishna Mukunda Murari April 24th: కృష్ణమ్మ కలిపింది ఆ ఇద్దరినీ- మురారీ దంపతులకు కఠినమైన శిక్ష వేసిన భవానీ
ఎట్టకేలకు కృష్ణ పెళ్లి టైమ్ కి వచ్చి కిరణ్ తో నందిని పెళ్లి ఆపుతుంది. దీంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ, గౌతమ్ పెళ్లి మండపం దగ్గరకి రావడం చూసి ముకుంద ఎదురు వెళ్తుంది. పెళ్లి ఇక్కడ జరుగుతుందని నీకు ఎలా తెలిసిందని ముకుంద కంగారుగా అడుగుతుంది. ఎలాగైనా తెలుసుకున్నా నీకు ఎందుకు. నువ్వు రాకూడదని అత్తయ్య సీక్రెట్ గా పెళ్లి చేస్తున్నారని అంటుంది. ఏం జరుగుతుందా అని ముకుంద కూడా కృష్ణ వెనుకాలే వెళ్తుంది. కృష్ణ వాళ్ళు వచ్చేసరికి నందిని పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటుంది. వాళ్ళని చూసి భవానీ షాక్ అవుతుంది. మురారీ కృష్ణకి సైగ చేస్తాడు. కళ్యాణ మండపం అడ్రెస్ చెప్తాను గౌతమ్ ని తీసుకుని రా నువ్వు వచ్చే వరకు పెళ్లి జరగకుండా చూసే బాధ్యత తనదని కృష్ణ మురారీతో మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంటుంది. వీడు ఎందుకు వచ్చాడు ఈ పెళ్ళిలో అతడి చావు చూడటం నాకు ఇష్టం లేదు వెంటనే పంపించేసేయండని భవానీ ఈశ్వర్ తో చెప్తుంది.
ఈశ్వర్ కృష్ణని ఆపుతాడు. వీడు ఎందుకు వచ్చాడు. పెళ్ళికి వచ్చాడని చెప్తుంది. ఎవరు పిలిచారంటే నేనే పిలిచాననని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ గొడవ చేయడం నాకు ఇష్టం లేదు వెళ్లిపొమ్మని ఈశ్వర్ అంటాడు.
Also Read: ఎస్సైకి దిమ్మతిరిగే షాకిచ్చిన జానకి- రామ విడుదల, జ్ఞానంబ హ్యాపీ
భవానీ: నీ భార్యని అతన్ని వెంటనే ఇక్కడ నుంచి పంపించేసేయ్
మురారీ: ఎందుకో తెలుసుకోవచ్చా పెద్దమ్మ
భవానీ: అవన్నీ పెళ్లి అయిన తర్వాత మాట్లాడుకుందాం ముందు వాళ్ళని పంపించు
మురారీ: కృష్ణ నా మాట వినదు పెద్దమ్మ
ఈశ్వర్, ప్రసాద్ కలిసి గౌతమ్ ని బలవంతంగా మండపం నుంచి నెట్టేస్తుంటే మీరు కొడితే పడటానికి నేను వాచ్ మెన్ కొడుకుని కాదు డాక్టర్ ని మర్యాదగా మాట్లాడండి. భవానీ తాళి కట్టించమని తొందరపెడుతుంది. కిరణ్ తాళి కట్టబోతుంటే గౌతమ్ నందినిని పిలుస్తాడు. సీడదూని చూసిన నందిని వెంటనే కిరణ్ ని పక్కకి తోసేసి సిద్దూని కౌగలించుకుంటుంది. సిద్ధూ మనం వెళ్లిపోదాం ఇక్కడ ఉండొద్దు దూరంగా వెళ్లిపోదామని అంటుంటే భవానీ వచ్చి కొట్టబోతుంది. అప్పుడు మురారీ తన పెద్దమ్మ చేతిని పట్టుకుని ఆపేస్తాడు. ఇందుకా ఈ పెళ్లి కృష్ణకి తెలియకుండా మాతో ప్లాన్ చేయించిందని ముకుంద మనసులో అనుకుంటుంది.
మురారీ: నందినిది పసిపిల్ల మనసు తన మీద చెయ్యి చేసుకోవద్దు
భవానీ: అంటే నువ్వు నీభార్య మాట విని నాకు ద్రోహం చేశావా. ఇంతమందిలో నా పరువు పోయేలా చేస్తావా. వీడు ఎవడో తెలుసా వీడి స్థానం ఏంటో తెలుసా
మురారీ: తెలుసు ఇతనొక డాక్టర్
కిరణ్ తల్లి: మతిస్థిమితం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకుంటే ఏంటి ఇది. మా పరువు ఏం కావాలి. మర్యాదస్థులు అనుకున్నాం ఇలా చేస్తారని అనుకోలేదు
Also Read: దివ్యకి అత్తారింట్లో మొదలైన కష్టాలు- కూతురి బాధ తులసి గుర్తిస్తుందా?
మురారీ: క్షమించండి మా పెద్దమ్మ చాలా మంచిది ఇతన్ని ఢిల్లీ పంపించి చదివించింది. కాయి కృతజ్ఞత చూపించాల్సింది పోయి మా అమ్మాయిని ప్రేమించాడు నమ్మకద్రోహం. కానీ నా చెల్లి ఇతడిని ప్రేమించింది. అతను దూరం అయ్యేసరికి మతిస్థిమితం తప్పింది. అతను దూరం అయినా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేదు
కిరణ్: పరవాలేదు మీరు మంచి పని చేశారు
నువ్వు నీ భార్యతో కలిసి చాలా పెద్ద తప్పు చేశావ్ అని మురారీ మీదకి ఈశ్వర్ చెయ్యి ఎత్తెసరికి కృష్ణ అడ్డుపడుతుంది. ఆయన పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట తప్పలేదు. అన్ని ఏర్పాట్లు చేశారు ఆఖరి నిమిషంలో నందిని సూసైడ్ చేసుకోబోతే ఆపి ఈ నిర్ణయం తీసుకున్నారని కృష్ణ చెప్తుంది. నందిని స్లీపింగ్ పిల్స్ వేసుకునే టైమ్ కి మురారీ వచ్చి కాపాడతాడు. నీకు దణ్ణం పెడతాను ఈ పెళ్లిని ఎలాగైనా ఆపమని నందిని వేడుకున్న విషయం చెప్తారు. ఈ పెళ్లి మీ చేతుల మీద జరిపించి పెద్దరికాన్ని నిలుపుకోమని భవానీని కృష్ణ బతిమలాడుతుంది. కానీ భవానీ మాత్రం అరుస్తుంది. ఇక నుంచి నాకు కూతురే కాదు కొడుకు కూడా లేడని భవానీ బాధగా వెళ్ళిపోతుంది.