Krishna Mukunda Murari April 25th: మనసుల్ని మెలిపెట్టేసిన ఎమోషన్- భవానీ మాటలకు గుండెలు పగిలేలా ఏడ్చిన మురారీ
నందిని, గౌతమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
భవానీ వాళ్ళు కోపంగా వెళ్లిపోతారు. మురారీ, కృష్ణ దగ్గరుండి వాళ్ళకి పెళ్లి జరిపిస్తారు. ప్రేమించిన సిద్ధూ తన మెడలో తాళి కట్టినందుకు నందిని చాలా సంతోషంగా ఉంటుంది. ఇంటి దగ్గర కృష్ణ కోసం రేవతి ఎదురు చూస్తూ ఉండగా భవానీ అండ్ కో కోపంగా ఇంటికి వస్తారు. ఏమైంది నందిని, కృష్ణ మురారీ ఏమైయ్యారని అడుగుతుంది. ఏమైందో నీకు తెలియదా, నీ ముద్దుల కోడలు ఫోన్ చేసి చెప్పలేదా అని ఈశ్వర్ కోపంగా అడుగుతాడు. అప్పుడే కృష్ణ, మురారీ ఇంటికి వస్తారు.
భవానీ: కళ్ళనిండా కన్నీళ్ళతో ఉంటుంది. ఒక బంధం శాశ్వతంగా విడిపోతున్నందుకు ఇవి కన్నీళ్ళు. ఇదే నాకు ఆఖరి దుఖం ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం
మురారీ: అంత పెద్ద మాట అనొద్దు పెద్దమ్మ
భవానీ: చాలు ఆ పిలుపు పిలిచే హక్కు పోయింది నీకు బయట నుంచి వచ్చిన ఈ అమ్మాయికి నా గురించి తెలియదు కానీ నీకు తెలియదా రేవతి నిన్ను కన్నది కేవలం కనేసి నిద్రపోయేది నీ ఊయల నా దగ్గరే ఉండేది. నీకు అన్నీ నేనే చేసేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నా కొడుకువని అనుకునేదాన్ని. కానీ మీరంతా ఒకటై నన్ను ఒంటరిని చేసి నా పరువు తీశారు ఇక ఈ ఇల్లు ఏమైపోతే నాకేంటి. మీరంతా ఏకమై నా మీద యుద్ధం ప్రకటిస్తే ఇంటి శత్రువులను క్షమించాల్సిన అవసరం నాకు ఏంటి
Also Read: కృష్ణమ్మ కలిపింది ఆ ఇద్దరినీ- మురారీ దంపతులకు కఠినమైన శిక్ష వేసిన భవానీ
మురారీ: నిన్ను మోసం చేయాలని కాదు ఒక చెల్లికి అన్నగా న్యాయం చేయాలని అనుకున్నా. కానీ ఒక తల్లికి కొడుకుగా మాట తప్పిన వాడిని అవుతానని మర్చిపోయాను. అన్నగా గెలిచినా కొడుకుగా ఒడిపోయాను, నీ ఓటమికి నేనే బాధ్యుడిని. నువ్వు నన్ను కొడుకుని కాదని అంటే నేను ఒప్పుకోలేను పెద్దమ్మ
రేవతి: నువ్వు మాట్లాడకపోతే వాడు ఎలా తట్టుకుంటాడు
భవానీ: నీకు మాట్లాడే అర్హత లేదు రేవతి. మీరందరూ ఒక్కటై పోయి నన్ను మోసం చేశారు
మురారీ: నందిని మనసులో ఇంకా సిద్ధూ ఉన్నాడు తనని మర్చిపోలేకపోతున్నాడు. ఇద్దరూ ఒకరికోసం ఒకరు తపించిపోతున్నారు. అందుకే వాళ్ళని ఒక్కటి చేశాను అంతే కానీ నీకు వ్యతిరేకంగా ఏదో చేయాలని కాదు.
కృష్ణ: ఇందులో ఏసీపీ సర్ చేసింది ఏమి లేదు తప్పు నాది నందిని ప్రేమించిన సిద్దూ గౌతమ్ సర్ అని తెలిశాక ఆ ప్రేమికులను కలిపాను. జంటను కలపడానికి సాయం చేయమని అడిగాను అది నందినికి అని చెప్పలేదు
భవానీ: నువ్వు వచ్చి నా కుటుంబాన్ని చెల్లా చెదురు చేశావ్. ఈ తప్పు నీది కాదు నీ మాయలో పడి నాకు ద్రోహం చేసిన వాళ్ళది. నాకు ఇంత కడుపు కోత మిగిల్చిన వాళ్ళతో ఈ ఇంట్లో ఎవరూ కృష్ణ, మురారీతో మాట్లాడకూడదు.
మురారీ: నువ్వు కూడా నాతో మాట్లాడవా
భవానీ: ఈ కుటుంబంలో ఎవరూ మాట్లాడరు. నా కుటుంబం నుంచి మానసికంగా మీ భార్యాభర్తలను వేలేస్తున్నా
మురారీ: నన్ను చూడు పెద్దమ్మ నాతో మాట్లాడవా అని ఎమోషనల్ గా అడుగుతాడు. నీ కొడుకు ఏమైపోయినా పర్వాలేదా
Also Read: ఎస్సైకి దిమ్మతిరిగే షాకిచ్చిన జానకి- రామ విడుదల, జ్ఞానంబ హ్యాపీ
భవానీ: నాకు కొడుకు ఉన్నాడు ఒకడు ఆదర్శ్ ఏమైపోయాడు ఇంకొకతి ఆడపిల్ల ఈ పెళ్ళితో అది పోయిన దానితో సమానం. ఇక నువ్వు కూడ నాకు లేవు. ముగ్గురిని పెంచి కూడా ఈరోజు నేను గొడ్రాలిగా మిగిలిపోయాను అసలు నాకు పిల్లలు లేరు
రేవతి: ఎవరూ మాట్లాడొద్దు అన్నా పట్టించుకోలేదు కానీ మీరు మాట్లాడను అంటే వాడు య్ ఏమైపోతాడు
కృష్ణ: దీనికి కారణం నేనే నన్ను వెలివేయండి. ఇప్పుడు మీరు ఆయన్ని దూరం పెడితే ఏమైపోతారు
ముకుంద: ఎవరు మాట్లాడొద్దు అంటే ఎలా మురారీతో మాట్లాడకుండా ఎలా ఉండాలి