News
News
X

Gruhalakshmi July 27th Update: సామ్రాట్ ఒడిలో తులసి, రగిలిపోతున్న నందు- అభిని నమ్మనన్న అంకిత

హనీని రెడీ చేసేందుకు తులసి సామ్రాట్ ఇంటికి వస్తుంది. అది చూసి నందుకి లాస్య మరింత నూరిపోస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

హనీ స్కూల్ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు డాన్స్ కూడా నేర్పించమని తులసిని సామ్రాట్ అడుగుతాడు. అయ్యయ్యో నాకు రాదండి అంటుంది తులసి. ఏం పర్వాలేదమ్మా మా సామ్రాట్ కి డాన్స్ వచ్చు నీకు సాయం కూడా చేస్తాడని సామ్రాట్ బాబాయ్ చెప్తాడు. అదంతా చూసి నందు రగిలిపోతూ ఉంటాడు. అభి అంకిత దగ్గరకి వచ్చి మాట్లాడతాడు. నేను వచ్చినందుకు హ్యాపీ గా ఫీల్ అవుతావని అనుకున్నాను కానీ నీ కళ్లలో ఆ ఫీలింగ్ కనిపించడం లేదు.. నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే అన్ని వదులుకుని నీకోసం ఒంటరిగా వచ్చాను. ఏమి లేకపోయినా నువ్వు నా పక్కన ఉంటే చాలు అనుకున్నాను.. నేను రాజీ పడలేదు తృప్తి పడ్డాను కానీ నువ్వు చేసింది ఏంటి అని అంటుంది. జీవితం అన్నా తర్వాత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతా ఉంటాయి వాటిని పెద్దవి చేసి చూడకూడదని అంటాడు. అంకిత నేను నీకోసం వచ్చాను, నేను మారాను నీకోసం వచ్చానని ణువూ నమ్మడానికి నేను ఏం చేయాలి చెప్పు అని అడుగుతాడు. ఎన్నాళ్ళు నన్ను ఇలా దూరంగా ఉంచుటవని అంటాడు. నేను కావాలనుకున్న ప్రేమ ని మనసులో కనిపించే వరకు.. అప్పుడు నా అంతట నేనే నీకు దగ్గర అవుతాను అని అంకిత అనడంతో అభి బాధపడతాడు. 

Also Read: నువ్వు తల్లివెంటీ అని మాళవికని అవమానించిన అభిమన్యు- యష్ ని ఆట పట్టించిన ఖుషి, వేద

ఇక తులసి మీద తెగ ప్రేమ కురిపించేస్తూ ఉంటాడు. అది చూడలేక నందు వెళ్లిపోదామని అనుకుంటారు. ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో పాపం వెళ్లనివ్వండి సార్ అని తులసి వెటకారంగా మాట్లాడుతూ సామ్రాట్ కి చెప్తుంది. సరే మీ ఇష్టం వెళ్ళమని సామ్రాట్ అంటే లేదు సర్ ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ డ్రామా జరుగుతుంటే వదిలేసి ఎలా వెళ్తామని లాస్య అంటుంది. ఇక తులసి కృష్ణుడి పాటకి డాన్స్ చేస్తుంటే సామ్రాట్ చూస్తూ ఉంటాడు. బాస్ ఎప్పుడు రైట్ అంటావ్ కదా ఇప్పుడు కూడా అదే అంటావా అని లాస్య నందుతో గుసగుసలాడుతుంది. తులసి డాన్స్ చేస్తూ కాలు జారి సామ్రాట్ ఒడిలో పడిపోతుంది. అది చూసి లాస్య నందుతో పొరపాటున పడింది అంటావా అని ఎక్కిస్తుంది. అదంతా చూసి నందు రగిలిపోతూ ఉంటాడు. హనికి కాంపిటీషన్లో పాల్గొనడమంటే చాలా ఇష్టం కానీ మాకు అవేమీ చేత కాదు సమయానికి మీరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు చాలా థాంక్స్ అని సామ్రాట్ తులసిని పొగడ్తల్లో ముంచెత్తుతాడు. అవునమ్మా హనీ మీద నీకున్న ఆపేక్ష చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని సామ్రాట్ బాబాయ్ అంటాడు. తులసి అపేక్ష నిజంగానే పాప మీదే అంటావా అని లాస్య నందుతో అంటుంది. 

Also Read: జానకి ఇచ్చిన చీర వద్దన్న రాధ- వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆదిత్య, రామూర్తి కుటుంబాలు

రేపు ప్రోగ్రామ్ టైం కి మీరు కూడా హనీ పక్కన ఉండమని సామ్రాట్ తులసిని అడుగుతాడు. ఏమి అనుకోకండి నాకు కుదరదు నాకోసం సంగీతం క్లాస్ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని చెప్తుంది. అప్పుడే హనీ అక్కడికి వచ్చి మీరు రాకపోతే నేను అసలు కాంపిటీషన్ కి వెళ్ళను అని అంటుంది. అదేంటి హనీ ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేసి వెళ్లకపోతే స్కూల్ కి చెడ్డ పేరు వస్తుందని తులసి అంటుంది. పాపం తులసి ఆంటీ కి నువ్వు పిలిస్తే రావలనే ఉంటుంది ఈరోజు వచ్చింది కదా అంటే మనసంతా ఇక్కడే ఉంటుంది అంటే నీ దగ్గరే ఉంటుంది అర్జెంట్ పని ఉందేమో అందుకే రాను అంటుందేమో పోనీలే అని లాస్య వెక్కిరింతగా మాట్లాడుతుంది. మీరు రాకపోతే నేను ఓడిపోవడం గ్యారెంటీ అని హనీ బాధపడుతుంది. చూశావా ఇంట్లో అందరూ తులసిని సామ్రాట్ కి దగ్గర చెయ్యాలని ఎంత ట్రై చేస్తున్నారో అని లాస్య అంటే తులసి ఒప్పుకోదు అని నందు చెప్తాడు. హనికి ఎంత దూరంగా ఉండాలని అనుకుంటే అంతా దగ్గర అవ్వాల్సి వస్తుందేంటి అని తులసి మనసులో అనుకుని వస్తాను అని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. ఆ మాటకి నందు షాక్ అవుతాడు. స్కూల్ లో కాంపిటీషన్ కి లక్కీ కోసం నందు, లాస్య వస్తారు. అక్కడకి తులసి కూడా వస్తుంది. ఇక తులసి హనీని కృష్ణుడిగా రెడీ చేస్తుంది. ఇక లక్కీ అల్లూరి సీతారామరాజు వేషంలో తులసి దగ్గరకి వస్తాడు. ఈ పోటీలో నేనే గెలవాలని ఆశీర్వదించమని అడుగుతాడు. 

తరువాయి భాగంలో.. 

హనీతో పాటు డాన్స్ చేయాల్సిన టీచర్ తులసితో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడో నేను ఒక ఒక జాబ్ కి అప్లై చేశాను వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు అని తులసికి చెప్తుంది. ఇప్పుడు మీరు వెళ్తే హనీ బాధపడుతుంది కాంపిటీషన్లో గెలవడాని తులసి అంటుంది. మీరు వెళ్తే హనీ గెలవలేదు టెన్షన్ పడుతుందని సామ్రాట్ కూడా టీచర్ తో అంటాడు. ఆంటీ టీచర్ ఎక్కడా అని హనీ ఆడగటంతో తులసి వెతుకుతుంది కానీ కనిపించదు. 

Published at : 27 Jul 2022 10:07 AM (IST) Tags: Gruhalakshmi serial Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial July 27 th

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?