Devatha July 27th Update: జానకి ఇచ్చిన చీర వద్దన్న రాధ- వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆదిత్య, రామూర్తి కుటుంబాలు
దేవిని ఎలాగైనా ఆదిత్యకి దూరం చేసేందుకు మాధవ కుట్రలు పన్నుతాడు. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అమెరికా ప్రయాణం క్యాన్సిల్ అయినందుకు సత్య బాధపడుతుంటే ఇంట్లో అందరూ ఓదార్చేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అది నువ్వే చెయ్యాలి అని దేవుడమ్మ సత్యతో చెప్తుంది. అటు జానకి కూడా వరలక్ష్మి వ్రతం పూజ పెట్టుకున్నట్టు రామూర్తికి చెప్తుంది. ముత్తైదువులని అందరినీ పిలిచి ఘనంగా పూజ చేద్దామని జానకి రాధకి చెప్తుంది. పూజ కోసమని జానకి రాధ కోసం చీర తీసుకొచ్చి ఈ చీర నువ్వు కట్టుకోవాలి నీకు నచ్చిందా అని అడుగుతుంది. అదంతా మాధవ చాటుగా చూడటం రాధ గమనిస్తుంది.. ఈ చీర మీరు తెచ్చారా లేదా ఎవరైనా ఇచ్చారా అని రాధ జానకిని అడుగుతుంది. జానకి నీళ్ళు నములుతూ నేనేం తెచ్చాను అంటుంది. పెద్దవాళ్ళు మీరంటే నాకు గౌరవం ఉంది అబద్ధాలు చెప్పకండి అని నిలదిస్తుంది. వ్రతం చెయ్యాలి అమ్మని మొక్కాలి అంటే కొత్త చీర అవసరం లేదు మనసు నిమ్మలంగా ఉంటే చాలు పెనిమిటి మంచిగా ఉండాలని ఆడవాళ్ళు చేసే వ్రతం అది.. మీ లెక్క నేను చేస్తా కానీ ఈ చీర కట్టుకుని అయితే కాదు అని మాధవ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది.
Also Read: నువ్వు తల్లివెంటీ అని మాళవికని అవమానించిన అభిమన్యు- యష్ ని ఆట పట్టించిన ఖుషి, వేద
దేవుడమ్మ ఆదిత్యకి తలంటు స్నానం చేయిస్తుంది. ఇక దేవి, చిన్మయి కూడా పూజ కోసం చక్కగా రెడీ అవుతారు. అది చూసి ఇంట్లో అందరూ మురిసిపోతారు. అక్కాచెల్లెళ్లు అంటే మీలాగా ఉండాలని జానకి దిష్టి తీస్తుంది. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని రామూర్తి కూడా అంటాడు. మిమ్మల్ని విడదీసే మూడో మనిషి లేరని మీరు అనుకుంటున్నారు.. కానీ విడదీసే ప్రయత్నం నేనేం చేస్తున్నా అది పాపమని నాకు అర్థం అవుతుంది కానీ నా బిడ్డ ఆ ఇంటికి చేరాలి నా పెనీవీటి దగ్గరకి చేరాలంటే తప్పదు అని రుక్మిణి మనసులోనే బాధపడుతుంది. ఇక అందరూ గుడికి బయల్దేరతారు. నేను రాను ఆఫీసర్ అయిన తర్వాతే వస్తా అని దేవి అంటుంది. అదేంటి దేవమ్మ అలా అంటున్నావని రాధ అడుగుతుంది. నువ్వు ఎప్పుడు మాతో రావు ఎందుకు అని మేము అడిగామా అని దేవి రాధని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక ఇంట్లో అందరూ దేవిని రమ్మని అడుగుతుంది కానీ రానని చెప్పి వెళ్ళిపోతుంది. మాధవ సారు దేవమ్మకి వల్ల నాయన గురించి తప్పుగా చెప్పినప్పటి నుంచి మనసులో ఏవేవో పెట్టుకుని పరేషన్ అవుతుందని రాధ బాధపడుతుంది.
Also Read: జానకి ఐపీఎస్ చదువుతున్నట్టు తెలుసుకున్న జ్ఞానంబ- మల్లిక ప్లాన్ సక్సెస్
ఇక ఆదిత్య వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది. నాకు బిడ్డల్ని ఇవ్వమని సత్య కోరుకుంటుంది. నా కోడలు తన బిడ్డ ఎక్కడ ఉన్న క్షేమంగా ఉండాలి అంతకన్న నేను కోరుకునేది ఏమి లేదని దేవుడమ్మ మనసులో మొక్కుకుంటది. 'ఆ మాధవ నా కూతురు మనసు మార్చేశాడు, నాకే నా కూతురు తన తండ్రి దుర్మార్గుడు అతను ఎక్కడ ఉన్న వెతికి పట్టించు అని చెప్తుంది అంటే ఇప్పుడు నేనేం చేయాలి, నేనే తండ్రిని అని ఎలా నమ్మించాలి. పిల్లలు రావాలి.. రుక్మిణి రావాలి అని ఇక్కడ అమ్మ వ్రతాలు, నోములు చేస్తుంది.. అక్కడ వాళ్ళు రాకుండా తీసుకొచ్చే అవకాశం లేకుండా మాధవ అడ్డుపడుతూ ఉన్నాడు రుక్మిణిని తీసుకురావాలన్న, దేవి కి తన తండ్రి దుర్మార్గుడు కాదు తన కోసమే అల్లాడిపోతున్నాడని తెలియాలంటే ముందు మాధవ నోరు మూయించాలి తను చెప్పింది అబద్ధమని తన నోటితోనే చెప్పించాలి' అని ఆదిత్య మనసులో అమ్మవారిని కోరుకుంటాడు. ఇక గుడిలో రుక్మిణి పూజ చేస్తుంది. నా పెనిమిటి చల్లగా ఉండాలి నా బిడ్డ నా పెనిమిటి దగ్గరకి చేరేలా చూడు తల్లి అని మొక్కుకుంటుంది.