Ennenno Janmalabandham July 27th Update: నువ్వు తల్లివెంటీ అని మాళవికని అవమానించిన అభిమన్యు- యష్ ని ఆట పట్టించిన ఖుషి, వేద
వేద యష్ ని ఖుషి కలిపేస్తుంది. ఇక అందరూ సంతోషంగా బోనాల పండగ జరుపుకునేందుకు సిద్ధం అవుతారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఖుషి ఇప్పుడు నీ కూతురు కాదు ఆ వేద కూతురు అని అభి అంటాడు. ఆ మాటకి మాళవిక ఏడుస్తూ నువ్వు కూడా అలా మాట్లాడతావెంటీ అభి అంటుంది. నిజం మాట్లాడుతున్నా ఖుషి నీ కూతురని నువ్వు అనుకుంటే సరిపోదు తను నువ్వు తన తల్లివని యాక్సెప్ట్ చెయ్యాలని అభి అంటాడు. అది ఖుషి తప్పు కాదు అందరూ చేరి తన మనసుని విషం చేసేశారు తన మనసు మార్చేశారు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని సార్లు నాకు దూరం చేసిన తట్టుకున్నాను. కానీ ఈరోజు తను కంపించకుండా పోయింది ఎంత నిర్లక్ష్యం వాళ్ళది కూతుర్ని కాపాడుకోవడం తెలియదా అని అంటుంది. మాళవిక ఖుషిని వెతుక్కోడానికి వెళ్తుంటే అభికీ ఫోన్ వస్తుంది. ఖుషి దొరికిందని చెప్తారు. అది అసలు తప్పిపోలేదంట వాళ్ళ అమ్మ నాన్నని కలపడానికి డ్రామాలు ఆడింది వాళ్ళు ఇప్పుడు కూతురు కోసం కలిసిపోయారంట అని చెప్తాడు. అయినా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏంటి కొత్తగా నా కూతురు అని మెలోడీ డ్రామా వేస్తున్నావ్ నిజంగా నీలో తల్లి ప్రేమ లేదు ఆ వేద మీద అక్కసుతో ఇలా మాట్లాడుతున్నావని అభి చురకలేస్తాడు. నీకు ఇలాంటివన్ని అసలు సెట్ అవవు వాళ్ళు నీ గతం అదంతా నీ బుర్రలో నుంచి తీసేసి అవతలపారేయ్ అని అంటాడు.
Also Read: జానకి ఐపీఎస్ చదువుతున్నట్టు తెలుసుకున్న జ్ఞానంబ- మల్లిక ప్లాన్ సక్సెస్
బీరువాలో బట్టలు సర్దుకునే దగ్గర వేద, యష్ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే ఖుషి వచ్చి ఏంటి మీరు మళ్ళీ గొడవ పడుతున్నారా అని అడుగుతుంది. ఇక వేద అమాయకంగా ముఖం పెట్టి మీ డాడీ నామీద గొడవ పెట్టుకుంటున్నారు బీరువాలో నా బట్టలు పెట్టుకొనివ్వడం లేదని చెప్తుంది. దాంతో ఖుషి యష్ మీద ఫైటింగ్ కి దిగుతుంది. మమ్మీ చీరలన్నీ నువ్వే సర్ది పెట్టు అని ఖుషి ఆర్డర్ వేస్తుంది. పాపం యష్ చేసేది లేక చీరలన్నీ సర్దుతూ ఉంటే వేద, ఖుషి నవ్వుకుంటూ ఉంటారు. వేదకి వచ్చిన గండం తొలగిపోయినందుకు బోనం ఎత్తుతానని మొక్కుకున్నానని చెప్తుంది. ఇక మాలిని కూడా ఖుషి కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. అంతా సవ్యంగా జరిగితే బోనం ఎత్తుతానని మొక్కుకున్నట్టు మాలిని అంటుంది. అందుకు ఇంట్లో అందరూ సరే అంటారు. అత్తయ్య వాళ్ళని కూడా పిలుద్దామని యష్ అంటాడు. సులోచన, మాలిని ఇద్దరు కలుసుకుని బోనం చేసుకుంటున్నామని చెప్తారు. నేనే ముందు బోనం ఎత్తుతానని మొక్కుకున్నానని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.
యష్ ఇంట్లో బోనాల సందడి మొదలవుతుంది. చిత్ర అందంగా రెడీ అయ్యి గుమ్మం దగ్గర నిలబడి వసంత్ కోసం చూస్తూ ఉంటుంది. చిత్ర నువ్వు ఈ డ్రెస్స్ లో చాలా బాగున్నవంటూ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా చిత్ర ఎమోషనల్ అవుతుంది. చిత్ర మన పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది పండగ అయిన తర్వాత యశోధర్ తో మాట్లాడతాను అని చెప్తాడు. కానీ నాకు ఆ నమ్మకం లేదని చిత్ర ఏడుస్తూ వెళ్తుంది. వేద, మాలిని బోనాలు సిద్ధం చేస్తుంటారు. వియ్యంకులు ఇద్దరు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనకూడదు కానీ ఆ ఖైలాష్ గాదు చేసిన పనికి వీళ్ళిద్దరూ చాలా టెన్షన్ పెట్టారు మనల్ని టెన్షన్ పెట్టారు. నా కళ్ల ముందు ఇద్దరు కోడళ్లని చూశాను. ఒక భార్య ఎలా ఉండకూడదు అనేదానికి మాళవిక నిదర్శనం అయితే ఒక భార్య ఎలా ఉండాలి అనేదానికి వేద నిదర్శనం అని రత్నం అంటాడు. అసలైన భార్యాభర్తలు అంటే కలిసి ఉండటం కాదు కలిసిపోవడమని ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటారు.
తరువాయి భాగంలో..
బోనం సమర్పించే గుడి దగ్గరకి వేద వాళ్ళతో పాటు మాళవిక కూడా వస్తుంది. నేను ఈ పాపకి అమ్మని, కన్నతల్లిని. ఇది కనకుండానే అమ్మ అనిపించుకుంటున్న డూప్లికేట్ అమ్మ. అక్కడ ఉన్న సోదమ్మా ఎవరు తల్లి ఎవరు కాదు బోనాల తల్లి సన్నిధికి మీ ఇద్దరిలో ఎవరి బోనం ముందు చేరితే వారికి ఆ తల్లి ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్తుంది. ఇక మాళవిక వేద ఇద్దరు బోనం తీసుకుని మెట్లు ఎక్కుతుంటే వేద కలికి గాజు పెంకు గుచ్చుకుంటుంది. అయినా వేద అలాగే నడుస్తుంది.