News
News
X

Gruhalakshmi July 26th Update: హనికి సాయంగా సామ్రాట్ ఇంటికి వచ్చిన తులసి, మురిసిపోయిన సామ్రాట్- తులసి మీద సామ్రాట్ కన్నేశాడంటూ నందుకి ఎక్కిస్తున్న లాస్య

హనీ తులసిని సాయం కోరుతుంది. ఇక సామ్రాట్ తులసి మీద కన్నేశాడంటూ నాడుకి ఎక్కిస్తుంది లాస్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

అభి, ప్రేమ్ ఇద్దరు తులసి ఇంటికి వచ్చేస్తారు. శ్రుతి ఎక్కడ రాలేదేంటి అని తులసి ప్రేమ్ ని అడుగుతుంది. తను రాలేదని చెప్పేసరికి గొడవ పడ్డారా ఏంటి అని అనసూయ అంటుంది. వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు రావని, పొరపాటున కూడా ప్రేమ్ శ్రుతిని బాధపెట్టేలా ప్రవర్తించడు అందుకే గొడవలు రావు అని తులసి అంటుంది. వాళ్ళ కౌసల్య అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు అందుకని అక్కడికి వెళ్ళిందని ప్రేమ్ కవర్ చేస్తాడు. ఒకసారి శ్రుతికి ఫోన్ చెయ్యవా మాట్లాడతాను అని తులసి అడుగుతుంది. వాళ్ళ అత్తయ్యని తీసుకుని ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్ళింది వచ్చాక కాల్ చేస్తాను అన్నదని ప్రేమ్ అబద్ధం చెప్తాడు. సరే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకొమ్మని చెప్పి సంగీత పాఠాలు చెప్పేందుకు వస్తుంది. హనీ బయట ఒక్కటే కూర్చుని ఉండటం చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. మా స్కూల్ లో చిల్డ్రన్ కాంపిటీషన్ జరుగుతుంది.. నన్ను సెలెక్ట్ చేశారు. మా టీచర్ నన్ను కృష్ణుడి గెటప్ వెయ్యమని చెప్పింది కానీ నన్ను రెడీ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్తుంది. మీ డాడీ తాతయ్య ఉన్నారు కదా అని తులసి అంటే వాళ్ళకి ఏమైనా కావాలని చెప్తే కొనివ్వడం తప్ప రెడీ చెయ్యడం రాదని హనీ అంటుంది. మీరు నా ఫ్రెండ్ కదా నాకు హెల్ప్ చెయ్యొచ్చు కదా ఎలాగైనా సరే నేను ఈ కాంపిటీషన్ లో గెలవాలి మీరు నాకు హెల్ప్ చెయ్యండి ప్లీజ్ ఆంటీ అని అడుగుతుంది. దానికి తులసి సరే అంటుంది. 

Also Read: మాధవ చెంప ఛెళ్లుమనిపించిన ఆదిత్య- తన కన్నింగ్ ప్లాన్ రాధకి చెప్పి ఛాలెంజ్ చేసిన మాధవ

శ్రుతి ప్రేమ్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఉండలేను ప్రేమ్ తో మాట్లాడేస్తాను, దూరం పెంచుకుంటున్నట్టు అవుతుందని శ్రుతి బాధపడుతుంది. డైరెక్ట్ గా ప్రేమ్ తో మాట్లాడేందుకు ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇంటికి టులేట్ బోర్డ్ చూసి ప్రేమ్ ఎక్కడా అని పక్క ఇంటి వాళ్ళని అడుగుతుంది. వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్తున్నా అని చెప్పి సామాను అంతా సర్దుకున్నాడు. నువ్వు ప్రేమ్ తో లేవా, మీరిద్దరు విడిపోయారా, కలిసి ఉండటం లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అప్పుడే అక్కడికి కౌసల్య వస్తుంది. ప్రేమ్ దగ్గరకి వెళ్తున్నట్టు మాట మాత్రం కూడా చెప్పకుండా ఎందుకమ్మా ఇంత దూరం వచ్చావ్ నేను ఆపుతాను అనుకున్నవా నేను నీ క్షేమం కోరేదాన్ని కానీ నిన్ను బాధపెట్టి తమాషా చూడాలని అనుకునేదాన్ని కాదుగా. తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని. ప్రేమ్ నీ గురించి నాకు అక్కడ తన తల్లికి అబద్ధం చెప్పాడు. నువ్వు కరిగిపోయి తన దగ్గరకి వెళ్తే నీ విలువ తను ఎప్పటికీ తెలుసుకోలేడు. రాజీ పడి బ్రతికేస్తావా నీ ఇష్టం. మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను అంటుంది. ఆ మాటకి శ్రుతి పద మన ఇంటికి వెళ్దామని అంటుంది. 

తులసి బిజినెస్ ప్రపోజల్ ఒకే చేసినందుకు సామ్రాట్ మీద ఎగిరిపడుతుంది లాస్య. తులసి ఐడియా కూడా మరి అంతా తీసిపారేసేంత చండాలంగా ఏమి లేదులే లాస్య అని నందు అంటాడు. కోట్ల టర్నోవర్ నిజీనేశ్ నడుపుతున్న సామ్రాట్ గారు నిమిషాల్లోనే తులసి ప్రపోజల్ని ఒకే చేసారంటే ఐడియా నచ్చ బట్టే కదా అని నందు అంటే కాదు తులసి నచ్చింది కాబట్టి అని లాస్య అంటుంది. ఇలా మాట్లాడుతున్నందుకు నీకు కాలుతుందేమో కానీ నిజం మాత్రం ఇదే అంటుంది. కళ్ళతో చూశాను కాబట్టే చెబుతున్నాను.. తులసి మాట్లాడుతున్నంత సేపు సామ్రాట్ చూపులు తన చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేమతో చూసే చూపులో ఆపేక్ష కనిపిస్తుంది, మెచ్చుకోలుగా చూసే చూపులో ఎంకరేజ్ మెంట్ కనిపిస్తుంది, గౌరవంగా చూసే చూపులో మానవత్వం కనిపిస్తుంది, కానీ సామ్రాట్ చూసే చూపులో నాకు ఆశ కనిపించింది.. నువ్వు రాముడు మంచి బాలుడు టైపు కాబట్టి సినిమా అర్థం కావడం లేదు. ఇప్పుడే టైటిల్స్ పడ్డాయి.. కొద్ది రోజులకి సామ్రాట్ తులసి బాగా క్లోజ్ అవుతారు. అలా క్లోజ్ అయ్యేలాగా సామ్రాట్ కథ నడుపుతాడు చూస్తూ ఉండు అని లాస్య నందుకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు లాస్య.. తులసి అలాంటిది కాదని నందు అంటే కానీ సామ్రాట్ మాత్రం అలాంటి వాడే అని అంటుంది.   

Also Read: వేదకి పూలతో స్వాగతం చెప్పి ఇంటికి తీసుకొచ్చిన యష్- మాలినికి క్షమాపణలు చెప్పిన సులోచన

హనీని కృష్ణుడి గెటప్ లో రెడీ చేసేందుకు సామ్రాట్ తిప్పలు పడతాడు. ఇలా అయితే నేను కాంపిటీషన్ లో గెలిచినట్టే అని హనీ అంటుంది. అప్పుడే అక్కడికి నందు, లాస్య వస్తారు. నువ్వు వచ్చావ్ కదా కాస్త హెల్ప్ చెయ్యమని సామ్రాట్ లాస్యని అడుగుతాడు. నాకు మేకప్ వేసుకోవాడమే కాదని గెటప్ వేయడం రాదు సర్ అని అంటుంది. మీ వల్ల కాదని తెలిసి నేను తులసి ఆంటీని రమ్మని చెప్పానని సామ్రాట్ కి చెప్తుంది. అప్పుడే తులసి కూడా వస్తుంది. మీరు రావడం కొంచెం లేట్ అయ్యి ఉంటే వీళ్ళు నన్ను కృష్ణుడిగా కాదు అంజనేయుడిగా రెడీ చేసేవాళ్ళు అని అంటుంది. తులసి హనీని కృష్ణుడి గెటప్ లో అందంగా రెడీ చేసి తీసుకొస్తుంది. 

Published at : 26 Jul 2022 09:43 AM (IST) Tags: Gruhalakshmi serial Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial July 26th

సంబంధిత కథనాలు

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!

Tollywood: 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ - ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కన్నన్‌ అరెస్ట్‌!

Tollywood: 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ - ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కన్నన్‌ అరెస్ట్‌!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Thalapathy Vijay: మహేష్ బాబు థియేటర్ లో విజయ్ - ఏం సినిమా చూశారో తెలుసా?

Thalapathy Vijay: మహేష్ బాబు థియేటర్ లో విజయ్ - ఏం సినిమా చూశారో తెలుసా?

Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్

Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు