News
News
X

Ennenno Janmalabandham July 26th Update: వేదకి పూలతో స్వాగతం చెప్పి ఇంటికి తీసుకొచ్చిన యష్- మాలినికి క్షమాపణలు చెప్పిన సులోచన

వేద ఇంటికి రాను అని చెప్పేసరికి ఖుషి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తన కోసం వేద, యష్ వెతుకుతూ చాలా బాధపడతారు. ఖుషి పెంపుడు కుక్క చిట్టి వాళ్ళని తనదగ్గరకి చేరుస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

చిట్టి వేద, యష్ లను ఖుషి దగ్గరకి తీసుకుని వెళ్తుంది. తనని చూసి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళతారు. ఆగమ్మా.. మీరిద్దరు కలిసిపోయారా అని ఖుషి వాళ్ళని అడుగుతుంది. కలిసిపోయామని ఇద్దరూ ఒకేసారి చెప్తారు. 'చిన్నప్పటి నుంచి నాకు అమ్మ అంటే ఎంతో తెలియదు. మా అమ్మ ఏది అని నానమ్మని అడిగాను లేదని చెప్పింది. అప్పుడు ఎంత బాధపడ్డానో తెలుసా.. మా ఫ్రెండ్స్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ అమ్మ ఉంది. వాళ్ళకి వాళ్ళ అమ్మే అన్నం తినిపిస్తుంది, హోమ్ వర్క్ చేస్తుంది, నిద్రపుచ్చుతుంది, స్కూల్ కి తీసుకొస్తుంది. కానీ నాకు అమ్మ లేదు అమ్మ అంటే ఎంతో తెలియదు.. ఏడుపొచ్చేది తెలుసా.. మా డాడీ కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. ఆఫీసు పని మీద ఎక్కడెక్కడికో వెళ్ళేవాడు. ఒకసారి మ ఫ్రెండ్ నన్ను ఒక మాట అన్నది.. నువ్వు అమ్మ నాన్న లేని అనాథవి అన్నది.. అప్పుడు నాకెంత ఏడుపొచ్చిందే తెలుసా. దేవుడికి ప్రేయర్ చేశాను నాకు అమ్మని ఇవ్వు అని. అప్పుడు నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావ్. ఫస్ట్ టైం నిన్ను చూడగానే నువ్వే మా అమ్మవి అని నాకు అనిపించింది. నిన్ను అమ్మా అని పిలిస్తే భలే ఉంటుంది తెలుసా.. నీతో ఆదుకోవాలి, నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలి అనిపిస్తుంది. నాకు నువ్వే కావాలి అమ్మా. డాడీ నువ్వు ఇంక ఎప్పుడు అమ్మని తిట్టొద్దు. అమ్మతో గొడవ పడొద్దు, మనతోనే మన దగ్గరే ఉండాలి. మన ముగ్గురం ఒక పార్టీ. నేను డాడీ లేకపోయినా ఏడుస్తా, అమ్మ లేకపోయినా ఏడుస్తా. ఈసారి మీరిద్దరి గొడవ పడితే నేను దూరంగా వెళ్లిపోతా.. అప్పుడు మాళవిక పంపిస్తాను అన్నదే హాస్టల్ కి అలా వెళ్లిపోతాను.. మీకు కనిపించను.. నేను రాను.. మీతో కటీఫ్' అని అంటుంది. ఆ మాటలకి వేద ఎమోషనల్ అవుతుంది. నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్లము అని ఇద్దరు ఖుషికి ప్రామిస్ చేస్తారు.  

Also Read: లగేజ్ తీసుకుని అత్తారింటికి వచ్చేసిన నిరుపమ్-షాక్ లో సౌందర్య కుటుంబం, శోభ ఈవిల్ ప్లాన్

వేద ఇంటికి వస్తుందని ఖుషి చాలా సంతోషంగా ఉంటుంది. ఇల్లంతా అందంగా అలంకరిస్తుంది. సులోచన కూడా వేదని అత్తారింటికి సంతోషంగా పంపించేందుకు హడావుడి చేస్తుంది.  యష్ వేద ఇంటికి వస్తాడు. నేను మిమ్మలని నొప్పించాను క్షమించండి అని యష్ వేద తల్లిదండ్రులతో అంటాడు. అదేంటి అల్లుడు గారు మేము నొచ్చుకున్నాం బయటపడ్డాం.. మీరు నలిగిపోయారు కానీ బయటపడలేదు. ఏ ఇంట్లో చూసిన చిన్న పిల్లలు గొడవ పడతారు పెద్ద వాళ్ళు సర్ది చెప్తారు.. కానీ ఇక్కడ పెద్ద వాళ్ళు గొడవ పడితే చిన్న పిల్ల గొడవ తీర్చిందని సులోచన అంటుంది. ఇక వేదని యష్ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఖుషి ఆనందంగా వేదకి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది. వేద నడిచేందుకు ఖుషి పూల దారి వేస్తుంది. నా కోడలిని ఈ ఇంటి నుంచి ఎవరైతే చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లారో వాళ్ళే మళ్ళీ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి నాకు అప్పగించాలి అని మాలిని కోపంగా అంటుంది.

Also Read: మా నాయన దుర్మార్గుడని ఆదిత్యకి చెప్పిన దేవి- నీకోసమే ఇదంతా చేశానంటూ మాధవ పైశాచికత్వం

'తన కూతుర్ని కాపారానికి పంపించేటప్పుడు రెండు మాటలు చెప్తుంది. ఒకటి నీ భర్తే నేకు దేవుడు, రెండు నీ అత్తామామలే ఇక నీకు తల్లిదండ్రులు. నీకు నీ భర్తే దేవుడు.. కానీ ఎంత దాకా భర్తే దేవుడై ప్రేమగా చూసుకునేంతవరకు.  అత్తామామలు అమ్మానాన్నలు అయ్యి బాధ్యతలు మర్చిపోనంత వరకు.. పెళ్లి చేసి అప్పగింతలు చేసేస్తే తిరిపోయేది కాదు తల్లి కూతుళ్ల బంధం. కూతురి కాపురంలో కలత వస్తే కనురెప్ప పాటులో కదిలి వెళలేదే కన్నతల్లి. తను కూతురు ఇంకొక ఇల్లాలు కావొచ్చు, కోడలు కావొచ్చు.. కానీ బిడ్డ బిడ్డే. తను కన్ను మూసి కాటికి వెళ్ళేదాకా తన బిడ్డ గురించి తపత్రాయపడకపోతే ఆ తల్లి ఎందుకు.. కూతురు కోసం నిలబడకపోతే ఆ తల్లి జన్మ ఎందుకు. నా కూతురుకి కష్టం వచ్చింది. నేను అండగా ఉన్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది దీన్ని వదిలేద్దాం. నా కూతురు గౌరవాన్ని కాపాడేందుకు ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళాను. మాలలి మీ ఇంటి కోడలిగా ఈ ఇంటి గౌరవం నిలబెట్టేందుకు నా కూతుర్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డని మీ బిడ్డగా కడుపులో పెట్టుకుని చూసుకోండి అది చాలు నాకు' అని సులోచన ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఓ తల్లి తన బిడ్డ జీవితం కోసం ఆరాటపడే ఆ సన్నివేశం అందరినీ కంట తడి పెట్టిస్తుంది. నా ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే నన్ను క్షమించండి అని సులోచన అంటుంది. నా కూతురు కాపురం బాగుండాలని తల దించుకుని వెళ్తున్నాను. అదే నా కూతురికి ఏదైనా కష్టం వస్తే దించిన తల ఎత్తి మరి ప్రశ్నిస్తాను అని చెప్పి సులోచన వెళ్ళిపోతుంది. 

తరువాయి భాగంలో.. 

వేద, ఖుషి బోనం ఎత్తుకుని గుడికి వస్తారు. అక్కడికి మాళవిక కూడా బోనం ఎత్తుకుని వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు.  

Published at : 26 Jul 2022 07:44 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial July 26th

సంబంధిత కథనాలు

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

టాప్ స్టోరీస్

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !