Karthika Deepam July 25 Update Episode 1413 : లగేజ్ తీసుకుని అత్తారింటికి వచ్చేసిన నిరుపమ్-షాక్ లో సౌందర్య కుటుంబం, శోభ ఈవిల్ ప్లాన్
Karthika Deepam july 25 Episode 1413: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జులై 25 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam july 25 Episode 1413)
హిమ శౌర్యను ఇంట్లో ఉంచేందుకు సౌందర్య-ఆనందరావు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. శౌర్య-నిరుపమ్ ని ఎలా కలపాలా అని ప్రేమ్ ఆలోచిస్తుంటాడు.. అటు నిరుపమ్ ని చూసి శౌర్య కోపంగా వెళ్లిపోతుంది. తాతయ్యకి ఏం కాలేదు మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకండి అని చెప్పేసి వెళ్లిపోతారు మనవళ్లు.
శోభ
అటు అప్పుల వాళ్లు బెదిరిస్తున్నారు, ఇటు నిరుపమ్ పని అవడం లేదు...స్వప్నాంటీకి క్లారిటీ లేదు..నేను ఏం చేయాలని కోపంతో ఊగిపోతుంటుంది. అమెరికా నుంచి ఎందుకొచ్చాను, ఏం చేస్తున్నాను..అందరూ తెలివైన వాళ్లు అయ్యారు, నేనే తెలివితక్కువదాన్ని అయిపోయాను.. నిరుపమ్ ని పెళ్లిచేసుకోవాలని నేను వస్తే..నిరుపమ్ హిమనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. శౌర్యేమో నిరుపమ్ ని ప్రేమిస్తోంది..హిమ మాత్రం నిరుపమ్ ని పెళ్లిచేసుకోను అంటోంది..ఈ రేస్ లో నేను వెనుకబడి ఉన్నాను..ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ఫోన్ రింగవుతుంది..ఏదో మాట్లాడిన శోభ..అలాగే అని కాల్ కట్ చేస్తుంది..
Also Read: పసుపు తాడు తీసుకొచ్చి షాక్ ఇచ్చిన రౌడీబేబి, నిరుపమ్ మూడు ముళ్లు వేసేది హిమకా-శౌర్యకా!
హిమ
కార్తీక్-దీప ఫొటో ముందు నిల్చుని మాట్లాడుతుంటుంది హిమ. నేను ఏం చేసినా శౌర్యకు కోపం తగ్గడంలేదు నేను ఏం చేయాలి అమ్మా అని ఏడుస్తుంది. శౌర్యకి హెల్ప్ చేయాలని తన మంచికోసమే చూస్తున్నాను కదా నాపై ఎందుకు కోపం వచ్చింది.. శౌర్య తిట్టినా, కొట్టినా నిజం చెప్పేస్తే ఈ బాధ ఉండదు కదా..శౌర్య దృష్టిలో నేను చెడ్డదానిగా మిగిలిపోవద్దు అనుకుంటుంది. ఇంతలో పక్కనే నిరుపమ్ నిల్చుని ఉండడం చూసి షాక్ అవుతుంది. శౌర్య ఎక్కడుందని అడిగి అక్కడినుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. సౌందర్య వచ్చి ఏం జరిగిందే అని అడిగితే.. బావ వచ్చి శౌర్య గదిలోకి వెళ్ళాడు నానమ్మ మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో అని భయంగా ఉందంటుంది.
Also Read: స్టోర్ రూమ్ లో వలలో చిక్కుకున్న రిషి-వసు, వీడియో షూట్ చేసి కుట్రకు తెరతీసిన సాక్షి
శౌర్య-నిరుపమ్
జరిగినదంతా తలుచుకుని శౌర్య బాధపడుతుండగా రూమ్ లోక వెళ్లిన నిరుపమ్ నీతో మాట్లాడాలి అంటాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి డాక్టర్ సాబ్ అంటుంది. నేను చెప్పేది విను అంటాడు నిరుపమ్
నిరుపమ్: హిమను నేను ప్రేమించాను..హిమను మార్చిన నువ్వే మా మమ్మీని మార్చు శౌర్య..హిమతో నా పెళ్లి నువ్వే చేయాలి
శౌర్య: షాక్ అయి చూస్తుంటుంది
హిమ: నాకు ఈ పెళ్లి ఇష్టంలేదంటూ ఎంట్రీ ఇస్తుంది. ఈ మాట ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను..నువ్వే వినిపించుకోవడం లేదు..
శౌర్య: బావుంది..చాలా బావుంది..( ఇది కూడా హిమ ప్లాన్ అనుకుంటుంది శౌర్య). కోపంగా రూమ్ లోంచి బయటకు వెళ్లి దేవుడి దగ్గర్నుంచి పసుపుతాడు తీసుకొచ్చి మెడలో కట్టు డాక్టర్ సాబ్ అంటుంది.మీ డ్రామా చూడలేకపోతున్నాను. అమరప్రేమ చూసి నాకు విసుగొచ్చింది. ఇది తీసుకుని హిమ మెడలో కట్టండి అంటుంది. ప్రేమ అని ఒకరు, పెళ్లి అని మరొకరు, ఇష్టం అని ఒకరు, ఇష్టం లేదని మరొకరు అంటారు. ఇది కట్టండి..ఈ మహానాటకానికి తెరపడుతుంది..
నిరుపమ్: శౌర్య చేతిలో తాళి తీసుకుంటాడు నిరుపమ్ ( సౌందర్య-ఆనందరావు షాక్ అయి చూస్తుంటారు)
హిమ: బావా ఆగు
శౌర్య: ఆగు ఏంటి ఆగు..ఎందుకు ఆగాలి..ఈ నాటకాలు ఆగాలి
హిమ: నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాను కదా..
శౌర్య: ఇకనైనా ఆపు..అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను..నా జీవితంతో ఆటలాడుతున్నావ్ కదే. నేను మీకు అడ్డొచ్చాను, ఇంకెప్పుడైనా అడ్డొస్తానని డౌటా..మీరు తెలివైన వాళ్లు, నేను తెలివితక్కువదాన్ని
సౌందర్య: ఏంటే ఇది..
శౌర్య: నీకు తెలియదు నానమ్మా..ఈ మహాతల్లి లీలలు అనేసి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుని కూర్చుని ఏడుస్తుంటుంది..
నిరుపమ్: నిన్నే పెళ్లిచేసుకుంటాను..నీతో జీవితాంతం కలసి ఉంటానని హిమతో తెగేసి చెబుతాడు. నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా నా మనసు అస్సలు మార్చుకోను.మనిద్దరి పెళ్లి జరుగుతుంది....
నీ జీవితంలో ఏం కావాలో దేవుడిచ్చినప్పుడు ఎందుకు వదిలేసుకుంటున్నావ్ అని సౌందర్య, ఆనందరావు సర్దిచెబుతారు
రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
సౌందర్య..శౌర్యకి జడవేస్తూ నీ కోరికలేంటో చెప్పు అంటుంది సౌందర్య. ఇంట్లో జరిగే నాటకాలు ఆపు అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలోనే అక్కడికి నిరుపమ్ లగేజ్ సర్దుకొని కొద్ది రోజులు ఇక్కడే ఉండడానికి వచ్చాను అనడంతో అందరూ షాక్ అవుతారు.
Also Read: కార్తీక్,దీప రీఎంట్రీ పక్కా - నిరుపమ్ తో శౌర్య పెళ్లిచేసేందుకు ఒక్కటైన హిమ-ప్రేమ్