Guppedantha Manasu జులై 23 ఎపిసోడ్: స్టోర్ రూమ్ లో వలలో చిక్కుకున్న రిషి-వసు, వీడియో షూట్ చేసి కుట్రకు తెరతీసిన సాక్షి
Guppedantha Manasu July 23 Episode 510:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జులై 23 శనివారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 23 Episode 510)
ఓ చిన్న పరీక్ష పెట్టి తన అసిస్టెంట్ ని సెలెక్ట్ చేస్తానంటాడు రిషి. మూడు ప్రశ్నలు ఇద్దర్నీ అడుగుతాను..వారు చెప్పే సమాధానం మీకు నచ్చితే చేయెత్తి ఓటేయండి..ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లని సెలెక్ట్ చేద్దాం అంటాడు రిషి. ఇంత ప్రాసెస్ అవసరమా అని గౌతమ్ అంటే ఏ ఒక్కరినీ అగౌరవ పరచడం ఇష్టం లేదని క్లారిటీ ఇస్తాడు.
రిషి మొదటి ప్రశ్న: జీవితం అంటే ఏంటి?
సాక్షి: జీవితం అంటే ప్రయాణం, ఓ నది ప్రవహించినట్టు గెలుపు ఓటములు చూస్తూ పయనించడమే
వసు: జీవితం అంటే నిర్వచనం లేదు..జీవితం అంటే పోరాటం, జ్ఞాపకాల పూలగుచ్చం, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం
రిషి రెండో ప్రశ్న: ప్రపంచంలో స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఎవరిది
సాక్షి: తల్లి ప్రేమ నిజమైనది, నిస్వార్థమైనది
వసు: తల్లి ప్రేమ స్వచ్ఛమైనదే కావొచ్చు అందులో కూడా స్వార్థం ఉంటుందేమో అని నా అభిప్రాయం. ఎవరో ఏంటో తెలియకుండా సాటి మనిషికి సాయం చేసే ప్రతివాళ్లదీ నిస్వార్థమైన ప్రేమే
రిషి మూడో ప్రశ్న: ఓ మనిషి ఎలా ఉండాలి
సాక్షి: ధైర్యంగా ఉండాలి తాను నమ్మినదానికోసమే నిలబడాలి..అవసరం అయితే ఎంతదూరమైనా వెళ్లాలి. అలా బతికేవాడే నిజమైన మనిషి
వసు: మనిషి చెట్టులా బతకాలి. నీడనివ్వాలి,గాలినివ్వాలి, పుష్పాలనివ్వాలి, ఫలాలనివ్వాలి, మొదలు నరికేస్తే మళ్లీ మొలకెత్తాలి, అందరకీ ఆదర్శంగా ఉండాలి,భూమి మీద ఎన్నో రకాల జీవరాశులున్నాయి అన్నింటికీ సమాన విలువ ఇవ్వాలి. ఓ చీమ ప్రాణం విలువ తక్కువ, ఏనుగు ప్రాణం విలువ ఎక్కువ కాదు..అన్నింటినీ సమానంగా చూడడమే మనిషి. పుస్తకంలా ఉండాలి ఎంతమంది చదివినా ఉపయోగపడినట్టు మనిషి ఉపయోగపడాలి. ప్రకృతి సమతుల్యాన్ని , పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాడు మనిషి ...ప్రకృతిని కాపాడటం తన బాధ్యత. కాలుష్యం లేని వాతావరణాన్ని రేపటి తరానికి మనం అందించాలి. అన్నీ కలుషితం అయినట్టే ఆలోచనలు కూడా కలుషితం. మనిషి మనిషిని ప్రేమించాలి, మట్టిని ప్రేమించాలి.
వసు సమాధానం విని అంతా లేచి నిలబడి చప్పట్లు కొడతారు...
ఈ రౌండ్ లో ఓటింగ్ అవసరం లేదు సార్..సాక్షికి ఓటేయ్యం వసుధారకే ఓటేస్తాం అంటారు ఓ లెక్చరర్..వసునే గెలిపిస్తాం , ఆ సమాధానాన్ని గౌరవిస్తాం..మనిషి గురించి గొప్పగా చెప్పింది..నిజంగా మనిషంటే అలాగే ఉండాలి సార్..ఇకనుంచి అలాగే ఉండడానికి ట్రై చేస్తాం అంటారు. ఆమెను ఫాలో అవుతూ మొత్తం అందరూ వసుకే ఓటేస్తారు..
వసుధార గెలిచిందని ప్రకటించిన రిషి.. కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు...( సాక్షి తప్ప అందరూ హ్యాపీ)
రిషి: గెలుపు, ఓటములు పక్కనపెడితే నువ్వు చెప్పిన చివరి సమాధానం చాలా బావుంది. సాక్షి ఈ పోటీలో ఓడిపోయినా జగతి మేడంకి అసిస్టెంట్ గా పనిచేస్తుంది.
థ్యాంక్యూ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి...
Also Read: పసుపు తాడు తీసుకొచ్చి షాక్ ఇచ్చిన రౌడీబేబి, నిరుపమ్ మూడు ముళ్లు వేసేది హిమకా-శౌర్యకా!
కారు దగ్గర నిల్చున్న రిషి..వసు చాలా బాగా మాట్లాడింది..ఇన్ని తెలివితేటలున్నాయి మరి నా మనసు అర్థం చేసుకోదేంటి అనుకుంటాడు. ఇంతలో ఓ స్టూడెంట్ రావడంతో వసుధార కనిపించిందా అని అడుగుతాడు. అయినా తన గురించి వద్దనుకుంటూనే ఎందుకు ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. ఇంతలో దేవయాని నుంచి కాల్ వస్తుంది..
దేవయాని: సాక్షిని నీకు అసిస్టెంట్ గా తీసుకున్నావ్ కదా నాకు కాల్ చేసి చెప్పింది చాలా సంతోషం. నాకు తెలుసులే నీది మంచి మనసు..సాక్షి పాపం అలా ఆత్మహత్య ప్రయత్నం చేసిందనే కారణంతో తన మూడ్ మార్చాలని కాలేజీకి పిలిచావ్ కదా.
రిషి: తనని అసిస్టెంట్ గా తీసుకున్నాను కానీ నాకు అసిస్టెంట్ గా కాదు జగతి మేడంకి అసిస్టెంట్ గాతీసుకున్నాను
దేవయాని: రిషి..ఏమైంది నీకు..సాక్షిని జగతికి అసిస్టెంట్ గానా.
రిషి: తనమీద సానుభూతి వ్యక్తిగతం..తన పని కాలేజీకి సంబంధించింది. ఉంటాను పెద్దమ్మా...
సాక్షిని తీసుకెళ్లి జగతి దగ్గర వేశాడు..ఇంతకన్నా అవమానం ఏముంటుంది అనుకుంటుండగా కాఫీ తీసుకురావాలా అని అడుగుతుంది ధరణి..
Also Read: రిషి పెట్టిన పరీక్షలో గెలుపెవరిది, వసు-సాక్షిలో రిషి అసిస్టెంట్ ఎవరు
జగతి క్యాబిన్లో పుష్పకి వర్క్ కేటాయిస్తారు జగతి మేడం.. అటు సాక్షి మాత్రం చిరాగ్గా కూర్చుంటుంది. రిషికి అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటే జగతి ఆంటీకి అసిస్టెంట్ గా చేశారు. ఇది కూడా ఒప్పుకోపోతే కాలేజీకికూడా రానివ్వరేమో అనుకుంటుంది.
జగతి: సాక్షి అని పిలవగానే ఆంటీ అంటుంది..ఆంటీ కాదు మేడం
సాక్షి: నాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు
జగతి: అన్నీ మనకు నచ్చినట్టే చేయడం కుదరదు. సాక్షి ఇంగ్లీష్ , భాష, తెలివైంది కూడా మెయిల్స్ పంపించే వర్క్ తనకి అప్పగించు పుష్ప అంటుంది
పుష్ప: సాక్షి గారు పదండి
సాక్షి: సాక్షి గారూ కాదు కాల్ మీ మేడం
రిషి మామూలోడు కాదు సాక్షి అంచనాలను తారుమారు చేశాడు అనుకుంటుంది జగతి..
Also Read: అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే - సరికొత్తగా మళ్లీ వసుకి ప్రపోజ్ చేసిన రిషి
ఇంట్లో అటు అటు తిరుగుతూ వసు ఆలోచనల్లో పడతాడు రిషి. బోర్డుపై నెమలీక బొమ్మ కింద ఉన్న చేయి నాదేనా.. వసుధార గురించి ఆలోచించొద్దు అనుకుంటూనే ఆలోచిస్తున్నాను. తను ఏం చేస్తుంటుంది..కాల్ చేద్దామా..
వసు నిద్రపోతుండగా ఫోన్ రింగవుతుంది..కాల్ లిఫ్ట్ చేస్తుంది వసుధార
వసు: సార్ చెప్పండి
రిషి: ఏం చెప్పాలి..ఆ బొమ్మ ఎవరు గీశారు
వసు: ఏ బొమ్మ సార్..
రిషి: కాలేజీకి పొద్దున్నే వచ్చెయ్ ...గుడ్ నైట్
నేనెందుకు కాల్ చేశాను..మాట్లాడకుండా కాల్ ఎందుకు కట్ చేశాను..వసు జ్ఞాపకాలు నాకు తెలియకుండా నన్ను ప్రభావితం చేస్తున్నాయా..
గౌతమ్, మహేంద్ర అక్కడకు వచ్చి ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావ్ అంటే కాలేజీలో చదువుల పండుగ గురించి అంటాడు రిషి. మేం కూడా ఆలోచిస్తున్నాం అంటూనే వసుధార ని ఐడియా అడుగుదాం అంటాడు గౌతమ్. మనకు ఆలోచనలు లేవనా అన్న రిషి..ఒక్కో టీమ్ కి ఒక్కో రకం జెండా తయారు చేద్దాం అంటాడు.
గౌతమ్: ఇదే మాట వసుకి చెప్పరా..ఈ ఐడియాకు అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇస్తుంది
గుడ్ నైట్ డాడ్ నాకు నిద్రస్తోంది..
యూత్ ఐకాన్ కి కాల్ చేసి చెబుదామా అనుకుంటూ..ప్రతిసారీ నేనే ఎందుకు కాల్ చేయాలి...
సోమవారం ఎపిసోడ్ లో
స్టోర్ రూమ్ లో జెండాలు వెతుక్కుంటుండగా వసుధార వస్తుంది అక్కడకు. నువ్వేంటి ఇక్కడ అని రిషి అంటే మీరేంటి సార్ ఇక్కడ అంటుంది వసు.రిషి కత్తెర అడగంతో తీసుకొస్తుండగా అక్కడున్న కుర్చీ తన్నుకుని తూలుతుంది.వసుని కిందపడకుండారిషి పట్టుకుంటే..ఇదే అవకాశంగా వీడియో తీస్తుంది సాక్షి...