Karthika Deepam July 23 Update Episode 1412 : పసుపు తాడు తీసుకొచ్చి షాక్ ఇచ్చిన రౌడీబేబి, నిరుపమ్ మూడు ముళ్లు వేసేది హిమకా-శౌర్యకా!
Karthika Deepam july 23 Episode 1412: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జులై 23 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam july 23 Episode 1412)
శౌర్య-హిమను బయటకు వెళ్లకుండా చేసేందుకు సౌందర్య ఆనందరావు ప్లాన్ చేసుకుంటారు. శౌర్య ఆటోలో గాలి తీసేస్తారు. అయితే టైర్ పంచర్ అయిందంటూ వేరేవాళ్లకి కాల్ చేసి బాగుచేయమని చెప్పి లోపలకు వెళ్లి కూర్చుంటుంది. ఇక హిమను ఎలా ఆపాలా అని ప్లాన్ చేసుకుంటూ ఒంట్లో బాగాలేనట్టు యాక్ట్ చేస్తాడు ఆనందరావు. ఇంతలో హిమ రెడీ కిందకు వస్తుంది.
సౌందర్య: ‘ఇంట్లో పేషెంట్‌ని పట్టించుకోవు గానీ.. ఆసుపత్రికి వెళ్తావా.. తాతయ్యని చూడు ఎలా ఉన్నారో’
శౌర్య: తాతయ్యా హాస్పిటల్ కి వెళదాం పద
సౌందర్య: ‘ఇంట్లో డాక్టర్ ఉండగా ఆసుపత్రికి ఎందుకే’... అయినా హాస్పిటల్ కి వెళ్లి నిరుపమ్ ని శౌర్యని పెళ్లిచేసుకునేలా ఒప్పిస్తుంది అందుకేగా వెళ్లేది..
శౌర్య: హాస్పిటల్లో పెద్దగా పేషెంట్స్ ఉండరు..డాక్టర్ సాబ్ తో ప్రేమకబుర్లు చెప్పేందుకే కదా వెళతానంటోంది
మొత్తానికి హిమ హాస్పిటల్ కి వెళ్లడం మానేస్తుంది. దిగులుగా కూర్చుని ఆలోచనలో పడుతుంది. నిరుపమ్-శౌర్యకి ఎలా పెళ్లిచేయాలని ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు ప్రేమ్ వస్తాడు.
ప్రేమ్: ఎప్పుడూ దిగులుగా ఉంటావేంటి..అయినా నువ్వు కావాలనే మాట్లాడడం లేదు..నాపై ఏదో కోపం ఉందిలే..
హిమ: ఏమీ లేదు.. నిరుపమ్-శౌర్య కి పెళ్లిచేయాలి దానికి నువ్వు హెల్ప్ చేయాలి
ప్రేమ్: నిరుపమ్-శౌర్యకి పెళ్లి చేసేస్తే...నా ప్రేమకు రూట్ క్లియర్ అవుతుంది అనుకుంటాడు. ‘హిమా ప్రేమ పెరగాలంటే.. ఇద్దరూ ఒకే చోట ఉండాలి.. తరచూ కలుసుకోవాలి. మాట్లాడుకోవాలి.. కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకోవాలి. ఇప్పుడే నిరుపమ్ కి కాల్ చేసి రమ్మంటాను
హిమ: తాతయ్యకి బాలేదని రమ్మంటాను
Also Read: కార్తీక్,దీప రీఎంట్రీ పక్కా - నిరుపమ్ తో శౌర్య పెళ్లిచేసేందుకు ఒక్కటైన హిమ-ప్రేమ్
నిరుపమ్, శోభ కాఫీ షాప్‌లో ఉంటారు. నిరుపమ్‌ని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది
శోభ: హాస్పిటల్, పేషెంట్స్ ఎప్పుడూ ఉండేవే కదా..నీతో సరదాగా కాఫీ తాగాలని అనిపించింది
నిరుపమ్: ‘నాకు అలానే తల పగిలిపోతుంది అంతా బాగున్నట్లే కనిపిస్తోంది కానీ అలా జరిగేలా లేదు
శోభ: పోయి పోయి ఆయుష్షు తక్కువని తెలిసి ఆ హిమను పెళ్లిచేసుకుంటున్నావ్..నీకేం తక్కువ
నిరుపమ్: హిమకు అసలు క్యాన్సర్ లేదు
శోభ: లేకపోతే ఉందని చెప్పినట్టు..ఏంటి ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తావంటూ వార్నింగ్ ఇచ్చావా
నిరుపమ్: ‘ప్రేమ అన్నింటినీ క్షమిస్తుంది తెలుసా’
శోభ: నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావ్
నిరుపమ్:తను అబద్ధం చెప్పడానికి కారణాలు ఉండే ఉంటాయి కదా
శోభ: హిమకు క్యాన్సర్ లేనట్టు నిరుపమ్ కి తెలిసింది..ఇప్పుడు నేను నిరుపమ్ ని ఎలా దక్కించుకుంటాను
నిరుపమ్: ఆటో జ్వాల ఎవరో కాదు..హిమ సిస్టర్ శౌర్యనే
శోభ: ఆటో జ్వాలే శౌర్య అయితే నీకొచ్చే లాభం ఏంటి
నిరుపమ్: లాభ నష్టాలు చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు జీవితం
ఇంతలో నిరుపమ్ కి కాల్ చేసిన ప్రేమ్..తాతయ్యకి బాలేదు నువ్వు రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు
సారీ శోభ..తాతయ్యకి ఏదో హెల్త్ ప్రాబ్లెమ్ అంట నేను వెళతాను అని చెప్పి బయలుదేరుతాడు
నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేస్తే నేను-హిమ ఒక్కటైపోతాం అనుకుంటాడు ప్రేమ్
నా దగ్గర అవకాశాలన్నీ పోయాయ్..ఇప్పుడేంటి నా పరిస్థితి అనుకుంటుంది శోభ
Also Read: రిషి పెట్టిన పరీక్షలో గెలుపెవరిది, వసు-సాక్షిలో రిషి అసిస్టెంట్ ఎవరు
సౌందర్య-ఆనందరావు
సౌందర్య మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది..ఇద్దర్నీ ఇంట్లో ఉంచాం సరే కానీ ఉప్పు నిప్పులాంటి ఇద్దర్నీ ఎలా కలుపుతాం అనుకుంటారు. కోపంతో ఉన్న శౌర్యని అద్దంలా చూసుకోవాలి. హిమను చూసినా హిమ మాట్లాడినా కోపంతో ఊగిపోతోంది మనం చెప్పిది అసలు వినిపించుకోవడం లేదుకదా..వీళ్లిదర్నీ కలపడానికి ఏదో ఒక ఆలోచన తట్టకుండా పోదు.. తొందరపడకూడదు అనుకుంటారు
స్వప్న-శోభ
స్వప్న దగ్గరకు వెళ్లిన శోభ ఇప్పుడేం చేద్దాం అంటుంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదన్న స్వప్నపై విరుచుకుపడుతుంది శోభ. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు..నాకు నిరుపమ్‌తో పెళ్లి చెయ్యాల్సిందే. లేదంటే నేను ఊరుకోను లేకపోతే..లేకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను’ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శోభ
కంగారుగా ఇంటికొచ్చిన నిరుపమ్..తాతయ్యకి ఏమైంది హిమా నువ్వు చూసుకోవాలి కదా అని ఫైర్ అవుతాడు.
శౌర్య: ఇద్దరూ నటులే మళ్లీ ఏదో ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటారు
హిమ: తాతయ్య మీకు లోపల ఏం కష్టం ఉందో చెప్పండి
ప్రేమ్: ఏంటి శౌర్య ఏంటి సంగతి..శౌర్యకి నాపై ఇంకా కోపం పోయినట్టు లేదు..
నిరుపమ్ ఆనందరావుని చెక్ చేస్తుండగా..ఏదో బాగాలేనట్టు యాక్ట్ చేస్తుంటాడు ఆనందరావు
ప్రేమ్: శౌర్య నువ్వు తాతయ్య దగ్గరకు వెళ్లు..హెల్త్ బాగాలేదు కదా
శౌర్య: నువ్వెళ్లి చూడు..నేనేమైనా డాక్టర్ నా..
ఇంతలో ఆటో టైర్ పంచరైందంట కదా ఇది సుమతి పంపించిందంటూ ఓ వ్యక్తి వచ్చి ఆటో బాగుచేస్తాడు...
Also Read: హుండీలో శౌర్య వేసిన చీటీ తీసి చదివి షాక్ అయిన హిమ, రౌడీ బేబీని గెలిపించే పనిలో ప్రేమ్
ఏదో ఒకటి చేసి వాళ్లిద్దర్నీ కలిపే వరకూ నేను నిద్రపోను అంటాడు ప్రేమ్. ఆ ఇద్దరూ శౌర్య-హిమ అనుకుంటుంది సౌందర్య, ప్రేమ్ మాత్రం మనసులో శౌర్య-నిరుపమ్ గురించి ఆలోచిస్తాడు. మరోవైపు తాతయ్య మీకు బాగానే ఉందంటాడు నిరుపమ్.
ఆటోలో బయలుదేరేందుకు సిద్ధమవుతుంది శౌర్య..ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్య ఇప్పుడు అర్జెంటుగా వెళ్లాలా..
శౌర్య: ఆయనకేమైంది బాగానే ఉన్నారు కదా..ఈ ఇంట్లో అందరి పెరఫామెన్స్ లు చూడలేకపోతున్నాను
సౌందర్య: తాతయ్యకి ఒంట్లో
శౌర్య: ఆయనకు బాగాలేకపోతే నేనేం చేయాలి..ఉన్నారుగా డాక్టర్లు చాలామంది..
సోమవారం ఎపిసోడ్ లో
నన్ను హిమని ఒక్కటి చేయ్ శౌర్య అని అడుగుతాడు నిరుపమ్. ఈ పెళ్లి నాకిష్టం లేదు ఎప్పటి నుంచో చెబుతున్నా నువ్వే వినిపించుకోవడం లేదంటుంది హిమ. మీ నాటకం చాలా బావుందన్న శౌర్య వెంటనే వెళ్లి పసుపుతాడు తీసుకొచ్చి నిరుపమ్ కి ఇస్తుంది...అక్కడంతా షాక్ లో నిల్చుని ఉంటారు..