News
News
X

Janaki Kalaganaledu July 26th UPdate: జానకి ఐపీఎస్ చదువుతున్నట్టు తెలుసుకున్న జ్ఞానంబ- మల్లిక ప్లాన్ సక్సెస్

జానకి ఐపీఎస్ చదువుతున్న విషయం జ్ఞానంబకి తెలిసిపోతుంది. దీంతో కథనం ఉత్కథాగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

మల్లిక తమ్ముడు రామా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు వెళ్ళిన చోటికి వస్తాడు. మల్లిక ఫోన్ చేసి జానకి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకున్నవా అని అడుగుతుంది. వాళ్ళు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ దగ్గరకి వచ్చారని చెప్తాడు. అంటే ఏంటి ఆదేమన్న కొత్త చీరల కొట్టా వాళ్ళు ఏమన్నా కొంటున్నారా అని అడుగుతుంది. కాదు కలెక్టర్, పోలీసు అవడానికి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇక్కడ చదువుకుంటారక్కా అని చెప్తాడు. అది విని మల్లిక షాక్ అవుతుంది. పోలేరమ్మకి తెలియకుండా బావగారు జానకిని చదివిస్తున్నారన్నమాట. అంటే ఆయన పోలేరమ్మ ముందు సత్య హరిశ్చంద్రుదు క్యారెక్టర్ వేస్తూ బయట మాత్రం మాయల మాంత్రికుడు వేషం వేస్తున్నారన్నమాట అని అనుకుంటుంది. వెంటనే ఈ విషయం వెళ్ళి చెప్పేయ్యాలి అని అత్తయ్యగారు అత్తయ్యగారు అని పిలిస్తూ వెళ్తుంది.

Also Read: మాధవ చెంప ఛెళ్లుమనిపించిన ఆదిత్య- తన కన్నింగ్ ప్లాన్ రాధకి చెప్పి ఛాలెంజ్ చేసిన మాధవ

అది విని జ్ఞానంబ అరుస్తుంది. ఇంకో సారి జానకి గురించి ప్రస్తావించొద్దు అని చెప్పాను కదా వెళ్ళు ఇక్కడ నుంచి అని తిడుతుంది. వెళ్తాను అత్తయ్యగారు ఒక్కసారి మీరు లాకర్ లో పెట్టిన జానకి సర్టిఫికెట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి అని మల్లిక అంటుంది. అది విని జ్ఞానంబ, గోవిందరాజులు షాక్ అవుతారు. లాకర్లో జానకి చదువుకున్న కాగితాలు ఉన్న విషయం నీకేలా తెలుసని అంటుంది. ఇంతక ముందు నాకు తెలియదు అత్తయ్యగారు ఇందాక జానకి బావగారు వాటిని దొంగతనంగా తీసుకు వెళ్తుంటే తెలిసిందని చెప్తుంది. నీకు పని పాటా లేదా ఎన్ని సార్లు చెప్పినా వినవా మళ్ళీ కొత్త కథ చెప్తున్నావ అని గోవిందరాజులు తిడతాడు. మల్లిక అబద్ధం చెప్తుంది అని అంటాడు. ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పాను కానీ నామాట మీరు నమ్మలేదు కానీ ఇప్పుడు ఒక్కసారి నమ్మి లాకర్ తెరిచి చూడండి ప్లీజ్ అత్తయ్యగారు అని బతిమలాడుతుంది. తన మాటలు పట్టించుకొవ్వద్దు అని గోవిందరాజులు చెప్పేందుకు ట్రై చేస్తాడు కానీ జ్ఞానంబ మాత్రం అనుమానపడుతుంది. 

Also Read: హనికి సాయంగా సామ్రాట్ ఇంటికి వచ్చిన తులసి, మురిసిపోయిన సామ్రాట్- తులసి మీద సామ్రాట్ కన్నేశాడంటూ నందుకి ఎక్కిస్తున్న లాస్య

జ్ఞానంబ వెళ్ళి బీరువా తెరిచి చూస్తుంది. అందులో సర్టిఫికెట్స్ ఫైల్ లేకపోవడంతో జ్ఞానంబ షాక్ అవుతుంది. జానకి వాళ్ళు నటిస్తూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. వాళ్ళు వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్లారో ఏం చేస్తున్నారో చూపిస్తాను మీరు నాతో రండి అత్తయ్యగారు అని మల్లిక జ్ఞానంబ వాళ్ళని తీసుకుని వెళ్తుంది. ఈ విషయం వెంటనే రామాకి ఫోన్ చేసి చెప్పాలని గోవిందరాజులు అనుకుంటాడు కానీ మల్లిక చెయ్యనియ్యకుండా చేస్తుంది. తన ప్లాన్ సక్సెస్ అవుతుందని మల్లిక తెగ సంతోషపడుతుంది. జ్ఞానానికి విషయం తెలిస్తే నా కొడుకు కోడలు భవిష్యత్ ఏమవుతుందో అని గోవిందరాజులు టెన్షన్ పడుతూ ఉంటాడు. రామాకి ఫోన్ చేసే అవకాశం కూడా లేకపోయిందని బాధపడతాడు. ఇక కాలేజీలో జానకి తన ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపిస్తుంది. తర్వాత బెస్ట్ స్టూడెంట్ అవార్డుల కార్యక్రమం జరిగే దగ్గరకి రామా, జానకి వెళతారు. బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ లో ఫస్ట్ వచ్చినట్టు జానకి పేరు ప్రకటిస్తారు. సరిగా అదే సమయానికి జ్ఞానంబ వచ్చి అది చూసి షాక్ అవుతుంది. చూడండి అత్తయ్యగారు జానకి మీ నమ్మకాన్ని పోగొట్టి మిమల్ని ఎలా మోసం చేసిందో కళ్ళారా చూడండి. మిమ్మల్ని వ్యయాలు ఎలా పిచ్చోళ్లని ఎలా చేశారో చూడండి అని మల్లిక ఎక్కిస్తుంది. జానకికి అవార్డ్ ప్రజెంట్ చేస్తారు. అది చూసి రామా సంతోషిస్తాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఇద్దరు.. ఒకరు మా నాన్న రెండు నా భర్త అని చెప్తుంది. 

Published at : 26 Jul 2022 11:11 AM (IST) Tags: janaki kalaganaledu serial janaki kalaganaledu serial today Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu July 26th

సంబంధిత కథనాలు

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా