News
News
X

Ennenno Janmalabandham September 27th: సా గు తు న్న వసంత్ ఎంగేజ్మెంట్- వేద, యష్ కీచులాట, చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన పంతులు

వసంత్, నిధిల నిశ్చితార్థం చెయ్యడానికి యష్ ఏర్పాట్లు చేస్తాడు. దాన్ని చెడగొట్టేందుకు వేద ప్లాన్స్ వేస్తుంది. వారం రోజులుగా వసంత్ ఎంగేజ్మెంట్ సాగుతూ వస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రెండు బాటిల్స్ పాయిజన్ తెచ్చి ఇవ్వు అక్క ఒకటి ఆ వసంత్ కి తాగించి రెండోది నేను తాగేస్తాను అని చిత్ర వేదతో అంటుంది. అవునే కొంపదీసి మనది ఉత్తిత్తి నిశ్చితార్థం అని తెలిసిపోయిందా ఏంటి అని సులోచన అంటుంది. అప్పుడే మాలిని సులోచన అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చేసరికి అందరూ కంగారుగా లేచి నిలబడతారు. మనం మాట్లాడుకోవడం వినేసిందా ఏంటి అని సులోచన ఇంట్లో వాళ్ళతో గుసగుసలాడుతూ ఉంటే వినకుండా ఎలా ఉంటాను ఉత్తిత్తి నిశ్చితార్థం అంటే ఏంటి అని మాలిని అంటుంది. ఎంగేజ్మెంట్ ఆగిపోయేలా ఉందని యష్ నాటకం స్టార్ట్ చేస్తాడు. నేను జరగదు అనేది వసంత్ ఎంగేజ్మెంట్ కాదు చిత్ర వాళ్ళ ఎంగేజ్మెంట్ అని యష్ అంటాడు. ఫంక్షన్ హాల్ ఇంతవరకు బుక్ చెయ్యలేదు ఏంటి అని యష్ వేదని అడిగేసరికి అందరు నీళ్ళు నములుతూ తడబడతారు.

Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

5 గంటలకి మీ చెల్లి చిత్ర ఎంగేజ్మెంట్ జరిపించి తర్వాత 7 గంటలకి మా తమ్ముడు వసంత్ నిశ్చితార్థం నిధితో నీ చేతుల మీదుగానే జరిపించు అని యష్ వేదతో అంటాడు. ఉత్తిత్తి నిశ్చితార్థం అని చెప్పి మమ్మల్నే బోల్తా కొట్టిద్దామని అనుకున్నావా బెస్ట్ సీఈవో ఇక్కడ అని యష్ అంటే అప్పుడే ఏమి అయిపోలేదని వేద ఛాలెంజ్ చేస్తుంది. నిధి అందంగా ముస్తాబై వస్తుంది. చాలా చక్కగా ఉన్నావ్ అని మాలిని మెచ్చుకుంటుంది. ముందు వసంత్ నిధిల నిశ్చితార్థం జరిగేలా చెయ్యడానికి పంతుల్ని రంగంలోకి దించుతుంది వేద. జాతకాలు సరిగా చూడలేదు పొరపాటున ముహూర్తం పెట్టాను ముందు వసంత్ నిధిల నిశ్చితార్థం జరగాలి తర్వాత చిత్ర, వైభవ్ వాళ్ళది అని పంతులు చెప్తాడు. లేదంటే అశుభం జరుగుతుందని అంటాడు.

శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటుంటే ఏంటి ఆ మాటలు అని వేద ఏమి తెలియనట్టు అంటుంది. మరి ఏం చెయ్యమంటారు అని పంతులు కోపంగా అంటాడు. సరే మీ ఇష్టప్రకారం ముందు వసంత్ వాళ్ళది తర్వాత చిత్ర వాళ్ళ నిశ్చితార్థం చేద్దాం అని సులోచన అంటుంది. కానీ అందుకు మాలిని ఒప్పుకోదు.. ఇందులో ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని అనేసరికి దామోదర్ వస్తాడు. వాళ్ళకి జాతకల మీద పట్టింపు ఉంది ఇంత చిన్న విషయానికి ఎందుకు రాద్దాంతం ముందు వసంత్ వాళ్ళ నిశ్చితార్థం చేద్దాంఅని అంటాడు. వేద చిన్నగా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకోవడం యష్ గమనిస్తాడు. సరే అని వసంత్ నిశ్చితార్థం ఏర్పాట్లు పనిలోకి వెళ్లిపోతారు.

Also Read: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్ 

పంతుల్ని, పంచంగాన్ని బాగానే మేనేజ్ చేశావ్ అని యష్ వేదని అంటాడు. నేనేమీ చేశాను అమాయకంగా అడుగుతుంది. నటించకు ఏం జరిగిందో తెలుసుకోలేనంత అమాయకుడిని ఏమి కాదు అని యష్ అంటాడు. నువ్వు ట్విస్ట్ ఇస్తాను అన్నప్పుడే ఏదో ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తే పోయేది తప్పు చేశాను అని యష్ అంటే నేను దాన్ని బ్రేక్ చేసి బయటకి రావడం వచ్చేస్తాను అని వేద అంటుంది.  

Published at : 27 Sep 2022 07:43 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham September 27th

సంబంధిత కథనాలు

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ