News
News
X

Ennenno Janmalabandham October 24th: యష్, వేద మధ్య అగాథం- పాత మొగుడి మీద మోజుతో అభిమన్యుకి హ్యాండ్ ఇస్తున్న మాళవిక

ఆదిత్య కోసం మాళవికని రక్షించాలని నిర్ణయించుకుంటాడు యశోధర్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
మాళవిక అర్థరాత్రి యష్ కి ఫోన్ చేస్తుంది. యష్ వేదకి నిజం చెప్తాను అని మాళవికతో అంటాడు. అప్పుడే వేద నిద్ర లేచి యష్ కోసం వెతుకుతూ బయటకి వస్తుంది. పరిస్థితి అర్థం చేసుకుంటుంటుందని క్షమించగల గొప్ప మనసు తనకి ఉంది. వేద నాకు భార్య నేను తనని మోసం చేయలేను అని యష్ అంటాడు. వేద నీకు భార్య కానీ ఆదికి తల్లి కాదు కదా నన్ను కాపాడుకోవడం నీకు చాలా ముఖ్యం, నీ ఒక్కగానొక్క కొడుకు కోసం అయిన నువ్వు చెయ్యాలి. మధ్యలో ఆ వేద ఎవర్తి అని సీరియస్ అవుతుంది. యష్ కూడా ఏంటి బెదిరిస్తున్నావా అని నేను ఆది గురించి ఆలోచించాను కాబట్టే ఇలా ఉన్నా అని కోపంగా అంటుంటే అప్పుడే వెనుక వేద ఉంటుంది. వేదని చూసి యష్ మాట మార్చి ఆఫీసు ఫోన్ వేళాపాళా లేదని తిట్టుకుంటూ వెళతాడు. ఫోన్ అక్కడే పెట్టడంతో మాళవిక మెసేజ్ చేస్తుంది.

Also Read: వరంగల్ వెళ్ళి వర్షంలో ఇరుక్కుపోయిన సామ్రాట్, తులసి- నందుకి సపోర్ట్ గా నిలిచిన అనసూయ

మాళవిక నీకు అండగా ఉంటాను అన్నారు, ఆ ఒక్క మాట చాలు యష్ నాకు కొండంత బలం వచ్చింది, నాకు అండగా తోడుగా నువ్వు నిలబడితే అంతకంటే కోరుకునేది ఇంకేముంటుంది అని మాళవిక పంపిన మెసేజ్ ని వేద చూస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఆయన ఫోన్ మాట్లాడింది మాళవికతోనా మరి వసంత్ అని అబద్ధం చెప్పారు ఏంటి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని వేద బాధపడుతుంది. తెలిసే తప్పు చేస్తున్నాన ఇది వేదకి నాకు మధ్య ఎంత అగాథం సృష్టిస్తుందో అని అటు యష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. యష్ గతంలో తనకి కొనిచ్చిన డ్రెస్ చూసుకుని మాళవిక మురిసిపోతుంది. ఇది నీకు బాగా ఇష్టమైన డ్రెస్, ఇది వేసుకుని నిన్ను గతంలోకి తీసుకుని వెళ్ళాలి కదా ఆనాటి పాత యష్ ని బయటకి రప్పించాలి కదా, ఈ డ్రెస్లో నా అందాన్ని చూసి నువ్వు పడిపోవడం ఖాయం. నిన్ను మళ్ళీ లొంగదీసుకోవడానికి అందానికి మించి ఆయుధం నా దగ్గర లేదని మాళవిక  అంటుంది.

Also Read: దేవిని తీసుకెళ్లిపోతానని తెగేసి చెప్పిన ఆదిత్య- గుండెలు పగిలేలా ఏడుస్తున్న రుక్మిణి

News Reels

వేద నిద్రలేవకపోయేసరికి ఖుషి వచ్చి నిద్రపేందుకు చూస్తుంది. యష్ మాత్రం వద్దు నేను ఉన్నా కదా నిన్ను స్కూల్ కి రెడీ చేస్తాను అని తనకి అన్నీ పనులు చేస్తాడు. మాళవిక యష్ కి ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకున్నా అని రెడీ అవుతూ మురిసిపోతుంటే అభిమన్యు వస్తాడు. ఎవరిని మర్డర్ చెయ్యడానికి ఇంతగా ముస్తాబు అయ్యావు అని అడుగుతాడు. ఈరోజు ఆది స్కూల్ రీఓపెన్ డే వాడిని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను అని అంటే నేను వస్తాను తర్వాత మనం ఇద్దరం కలిసి బయటకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం చాలా రోజులైందని అభి అంటాడు. కానీ మాళవిక మాత్రం ఇప్పుడు కాదు అని వెళ్లిపోయేసరికి ఏదో తేడా కొడుతుందని అనుమానపడతాడు. ఇక యష్ ఖుషిని తీసుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఖుషి అప్పుడు యష్ ని పిలిచి నువ్వు అమ్మని ఏమైనా అన్నావా, తను ఎందుకో అప్సెట్ అయ్యింది అందుకే తను ఇంకా నిద్రలేవలేదు.. అమ్మని నువ్వు ఏమి అనకు ప్లీజ్ అని అడుగుతుంది. వేద అమ్మని బాగా చూసుకో, తనకి ఇష్టం లేని పని ఏది చెయ్యొద్దు అని చెప్తుంది.

Published at : 24 Oct 2022 07:36 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial October 25th Episode

సంబంధిత కథనాలు

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.