News
News
X

Devatha October 21st Update: దేవిని తీసుకెళ్లిపోతానని తెగేసి చెప్పిన ఆదిత్య- గుండెలు పగిలేలా ఏడుస్తున్న రుక్మిణి

దేవి కనిపించకుండా పోవడంతో అంతా వెతుకుతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
సత్య మాధవ్ కి ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించడం లేదంట నిజమేనా అని అడుగుతుంది. మీరు కలిసినప్పుడు చెప్పింది నిజమే అనిపిస్తుందని సత్య అంటుంది. రాధ ఇంత వరకి ఇంటికి రాలేదు ఆదిత్య దగ్గరకి వెళ్ళే ఉంటుందని మాధవ్ నీచంగా మాట్లాడతాడు. కూతురు కనిపించకపోతే భర్తతో వెళ్ళాలి కానీ ఆదిత్యతో కలిసి వెళ్ళడం ఏంటి అసలు ఏమనుకోవాలి అని సత్య అనుమానపడుతుంది. రుక్మిణి దేవి కోసం వెతుకుతూ ఉంటే ఆదిత్య ఎదురు పడతాడు. ఏం చేద్దామని అనుకుంటున్నావ్ నా బిడ్డని నా దగ్గరకి రాకుండా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అరుస్తాడు. నిన్నటి నుంచి కనిపించకుండా పోతే ఏమైపోయినట్టు అని పోలీసులకి ఫోన్ చేసి మాట్లాడతాడు.

Also Read: వేద ముందు యష్ ని బ్యాడ్ చేస్తున్న మాళవిక- అమితమైన ప్రేమ చూపించిన ఖుషి

అసలు దేవి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది, ఆ మాధవ్ గాడు ఏమైనా అన్నాడా అని రుక్మిణిని అడుగుతాడు. అలాంటిది ఏమి లేదని ఏడుస్తూ చెప్తుంది. ఏమి లేకపోతే ఎందుకు వెళ్లిపోతుందని కోపంగా వెళ్ళిపోతాడు. సత్య దేవిని నా కూతురే అనుకోవడం నాకు చాలా మంచిది అయింది, దేవిని వాళ్ళ కంటే ముందు నేనే పట్టుకుని ఇంకొంచెం పెద్ద డ్రామా ఆడతాను తనని ఆదిత్యకి శాశ్వతంగా దూరం చేస్తాను అని మాధవ్ కారులో వెళ్తు అనుకుంటాడు. ఆదిత్య కారు ఎదురుపడుతుంది. దేవి కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే కదా అని ఆదిత్య కోపంగా వచ్చి మాధవ్ కాలర్ పట్టుకుంటాడు.

దేవి నీ కూతురు ఏంటి నా కూతురు అని మాధవ్ అంటే ఆదిత్య మాత్రం ఇంకోసారి ఆ మాట అంటే నాలుక చీరేస్తాను అని అరుస్తాడు. నీ వల్ల నా బిడ్డకి ఏదైనా జరిగితే నీ అంతు చూస్తాను అని ఆదిత్య వార్నింగ్ ఇస్తాడు. దేవి కనిపించక రుక్మిణి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆదిత్య ఫోన్ చేసి దేవి కనిపించిందా అని అడుగుతాడు. లేదని అనేసరికి దేవి కనిపిస్తే నేరుగా నాతో నా ఇంటికే వస్తుంది నేను తీసుకెళ్లిపోతాను జరగబోయేది అదే అని ఫోన్ పెట్టేస్తాడు. రుక్మిణి ఆ మాటలకి షాక్ అవుతుంది. అటు ఇంట్లో దేవుడమ్మ దేవి కోసం బాధపడుతుంది. దేవి మీద ఆదిత్య కన్న బిడ్డ మీద చూపించిన ప్రేమ చూపిస్తాడు అని దేవుడమ్మ అంటుంది. ఆదిత్య కూడా ఫోటో పట్టుకుని రోడ్ల మీద దేవి కోసం తిరుగుతూ ఉంటాడు. చీకటి పడినా కూడా వెతుకుతూనే ఉంటారు.

News Reels

Also read: పరంధామయ్య సర్ ప్రైజ్- తులసికి పూలతో ఘన స్వాగతం

ఆదిత్య, రుక్మిణి ఒక చోట కలుస్తారు. దేవి కనిపించగానే నేనే తన తండ్రిని అనే విషయం నువ్వే చెప్పాలి, నేను తనని నాతో తీసుకుని వెళ్లిపోతాను అని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్ళడం మాధవ్ చూస్తాడు. సత్య మళ్ళీ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే దేవుడమ్మ వస్తుంది. వాడు దేవిని వెతకడానికి వెళ్ళాడు కద వచ్చేసరికి లేట్ అవుతుంది వెళ్ళి తినేసి పడుకోమని దేవుడమ్మ చెప్తుంది. మళ్ళీ మాధవ్ ఆదిత్య, రుక్మిణి కలిసి ఉన్న ఫోటో సత్యకి పంపిస్తాడు.

Published at : 21 Oct 2022 08:39 AM (IST) Tags: Suhasini devatha serial devatha serial today episode Devatha Serial Written Update Devatha Serial October 21st Update

సంబంధిత కథనాలు

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Janaki Kalaganaledu December 5th: పోలీస్ ఆఫీసర్‌గా మాధురి కేసు తీసుకోమన్న రామా - రంగంలోకి దిగిన జానకి ఐపీఎస్

Janaki Kalaganaledu December 5th: పోలీస్ ఆఫీసర్‌గా మాధురి కేసు తీసుకోమన్న రామా - రంగంలోకి దిగిన జానకి ఐపీఎస్

Gruhalakshmi December 5th: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయిన సామ్రాట్- బేరాలు ఆడటంలో మాస్టర్స్ చేసిన తులసి

Gruhalakshmi December 5th: కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయిన సామ్రాట్- బేరాలు ఆడటంలో మాస్టర్స్ చేసిన తులసి

Guppedantha Manasu December 5th: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని

Guppedantha Manasu December 5th: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని

Karthika Deepam December 5th: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

Karthika Deepam December 5th: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు