News
News
X

Ennenno Janmalabandham August 9th Update: తల్లి కాబోతున్న కాంచన- వేద మీద కోపంతో రగిలిపోతున్న మాలిని, బాధలో చిత్ర

యష్ కావలని వేదని మాలిని దగ్గర ఇరికించి తిట్టిస్తాడు. ఈరోజు ఎపిసోడ్ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది.

FOLLOW US: 

యష్ చేతికి గాయం కావడంతో మాలిని వేదని తిడుతుంది. తిట్టించినందుకు చాలా సంబరపడతాడు యష్. వేద చెడామడా తిట్టేస్తుంది యష్ ని. నీ కోపంలోనే నాకు కామిడీ ఉంటుందని యష్ నవ్వుతాడు. ఇక వేద తన చేతికి కట్టు కడుతుంది. వేద కూడా భుజానికి దెబ్బ తగలడంతో బాధపడుతుంది. ఏమైందని అడుగుతాడు కానీ వేద చెప్పేందుకు ఇబ్బంది పడుతుంటే చూపించు ఏమైందని అంటాడు. భుజం మీద గాయం కావడంతో యష్ తనకి మందు రాస్తాడు.

కాంచన ఖైలాష్ ని కలిసేందుకు వస్తుంది. బెయిల్ కోసం ఎదురు చూసి చూసి పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు వదిలేలా ఉన్నాను అని ఖైలాష్ అనేసరికి కాంచన అలా మాట్లాడకండి మీకేమైన అయితే నేనే కాదు మన బిడ్డ కూడా అన్యాయం అయిపోతుందని అంటుంది. ఏంటి బిడ్డా అని ఖైలాష్ సంతోషపడతాడు. ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చానని అంటుంది. ఇక ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే కాంచన వస్తుంది. తనని చూసి అందరూ నవ్వడం ఆపేస్తారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావని రత్నం కాంచనని అడుగుతాడు. నేనేమైనా చిన్న పిల్లనా తప్పిపొడనికి తెలియకుండా వెళ్లిపోవడానికి అని కాంచన ఏడుస్తూ అంటుంది. ఎక్కడికి వెళ్లావ్ అని రత్నం మరోసారి ఆడగటంతో మా ఆయన దగ్గరకి ఆయనతో మాట్లాడాలి చూడాలని అనిపించింది అందుకే వెళ్లొచ్చాను అని చెప్తుంది.

Also Read: విష్ణు బుర్రలో విషం నింపుతున్న మల్లిక- జ్ఞానంబతో జానకిని తిట్టించేందుకు మల్లిక ఎత్తుగడ

అక్కా ఖైలాష్ ఏం చేశాడో చూసినా అతని గురించి ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఆ మాయలోనుంచి ఎందుకు బయటికి రావడం లేదని యష్ కోపంగా అంటాడు. మాయ కాదు యష్ మాంగల్యం అని కాంచన ఏమోషనల్ గా చెప్తుంది. నా భర్త ఎప్పటికీ తప్పు చేయ్యడన్న నమ్మకమని అంటుంది. ఆ నమ్మకం నిజం కాదని తెలిసినా ఎందుకు నమ్ముతున్నావని రత్నం అంటాడు. నాకు తెలిసిన నిజం నా భర్త మాత్రమే నాన్న మిగిలినది ఏదైనా నాకు అబద్ధమే.. నా భర్తతో నేను మాట్లాడటానికి వెళ్తే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని కాంచన బాధగా అడుగుతుంది, అక్కా నీకు బాధ కలిగించాలని మా ఉద్దేశం కాదు నిజానిజాలు మంచి చెడులు తెలుసుకోకుండా ఖైలాష్ ని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదని యష్ చెప్తాడు. ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత లెక్కేసుకోవాల్సింది తప్పొప్పులు కాదు యష్ ప్రేమానురాగాలు.. మీ బావతో నాకు ఏ సమస్య లేదంటే ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అంటుంది. ఎవరి మాటలో విని నన్ను నా భర్తని కష్టపెడుతుంది చాలు నాకు ఓదార్పు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ బాధని మాత్రం పెంచకండి అనేసి కాంచన ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

చిత్ర వసంత్ గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఖుషి వసంత్ ని చిత్ర దగ్గరకి తీసుకుని వస్తుంది. ఏమైంది పిన్ని ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది. లేదమ్మా కంట్లో ఏదో నలక పడిందని చెప్తుంది. కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావ్ చూడు బాబాయ్ మార్నింగ్ నుంచి పిన్ని ఇలాగే బాధపడుతుంది. నువ్వు అయినా అడుగు నీకేమైన చెప్తుందేమో అని ఖుషి అంటుంది. ఏమైంది చిత్ర ఎందుకు బాధపడుతున్నావ్ అని వసంత్ అడుగుతాడు. ఖుషి తీసుకొస్తే వచ్చావా అంటుంది. ఏమైందో తెలిసి కూడా ఇలా అడుగుతున్నావా.. నువ్వు కాన్ఫిడెంట్ గా నాకు ప్రామిస్ చెయ్యి క్షణాల్లో ఈ కన్నీళ్ళు ఆనందభాష్పాలుగా మారిపోతాయని చిత్ర అంటుంది. ఆ మాటలకి వసంత్ మౌనంగా ఉంటాడు. నీకు అంతా మంచి జరుగుతుంది నా మీద నమ్మకం ఉంది కదా అని ఖుషి అంటుంది. ఆ మాటకి చిత్ర మురిసిపోతుంది.

Also Read: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్- నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

మాలిని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని రత్నం అడుగుతాడు. వాడి మూడ్ బాగోలేదు మళ్ళీ అడుగుదాములే అని అంటాడు. అడగక అడగక నేను ఒక మాట అడిగాను వాడు నో చెప్పాడు.. వాడు నో చెప్పినందుకు కాదు.. నాకు ఆ మాట చెప్పే ముందు వాడు వాడి పెళ్ళాం ముఖం చూశాడు అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ అమ్మ కంటే పెళ్ళాం ఎక్కువ అయిందా అని మాలిని ఆవేదన పడుతుంది. నీకు నో చెప్పినందుకు నీ కొడుకుని తిట్టుకో మధ్యలో కోడలు ఏం చేసిందని రత్నం అంటాడు. తనే చేసింది.. అంతా ఆ వేదనే చేసింది తను తలుచుకుంటే భర్తని ఒప్పించగలిగేది. జరిగిందేదో జరిగిపోయింది మీ అక్క భర్తని విడిపించమని ఒక్క మాట చెప్పి ఉంటే గ్యారెంటీగా ఒప్పుకునేవాడు యష్.. కానీ చెప్పిందా చెప్పలేదే అందుకే వేద నాకు నచ్చడం లేదు. తను ఈ ఇంటి కోడలే కదా తను ఈ ఇంటి గురించి ఆలోచించడం లేదు అందుకే తను నాకు నచ్చలేదు అని మాలిని అంటుంది. తనకి జరిగింది చిన్న విషయం కాదు వేద గురించి ఆలోచించావా అని రత్నం అడుగుతాడు. నాకు అదేమీ వద్దు నాకు నా కూతురే ముఖ్యమని అంటుంది.

ఖైలాష్ ని కాంచన ఎందుకు అంతగా నమ్ముతుంది. ఇది తన అమాయకత్వం అనాలో మూర్ఖత్వం అనాలో అర్థం కావడం లేదు. ప్రేమ గుడ్డిది అనేందుకు ఇదే నిదర్శనం అని వేద మనసులో ఆలోచిస్తూ ఉంటే.. ఇంక వేద పడుకోకుండా ఏం చేస్తుందని యష్ నిద్ర లేస్తాడు. అర్థరాత్రి దెయ్యంలా అటు ఇటు తిరుగుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు.

తరువాయి భాగంలో..

స్వీట్ బాక్స్ పట్టుకుని మాళవిక యష్ ఇంటికి వస్తుంది. మళ్ళీ ఏం గొడవ పెట్టడానికి వచ్చావని మాలిని అడుగుతుంది. గొడవ పెట్టడానికి కాదు మలబార్ మాలిని గారు నా మాజీ ఆడపడుచుకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని అంటుంది. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు అని యష్ అడుగుతాడు. కాంచన తల్లి కాబోతుందని అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఇంత శుభకరమైన విషయం లో విషాదం ఎంతో తెలుసా యశోధర్ ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకపోవదమని మాళవిక మంట పెడుతుంది. వెళ్తూ వెళ్తూ వేద దగ్గర ఆగి తన భర్తని తనకి తిరిగి ఇచ్చేయవచ్చు కదా అని అంటుంది.

Published at : 09 Aug 2022 07:23 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial August 9th

సంబంధిత కథనాలు

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

టాప్ స్టోరీస్

గుడివాడలో కొడాలి నానిని ఓడించేది ఎవరు?

గుడివాడలో కొడాలి నానిని ఓడించేది ఎవరు?

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!