Janaki Kalaganaledu August 8th Update: విష్ణు బుర్రలో విషం నింపుతున్న మల్లిక- జ్ఞానంబతో జానకిని తిట్టించేందుకు మల్లిక ఎత్తుగడ
జానకి ఐపీఎస్ చదివేందుకు జ్ఞానంబ ఒప్పుకుంటుంది. కానీ కొన్ని షరతులు పెడుతుంది. వాటికి జానకి కూడా సరే అంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి ఐపీఎస్ చదువుకోవడానికి జ్ఞానంబ ఒప్పుకుంటుంది. చదువుకునేందుకు కొన్ని షరతులు పెడుతుంది. వాటికి జానకి సరే అంటుంది. రామా మాత్రం షరతులకి వద్దు అంటాడు కానీ జానకి మాత్రం వినదు. జ్ఞానంబ గోడ మీద ఐదు అంకెలు వేస్తుంది. నీకు ఐదు అవకాశాలు ఇస్తున్నా ఒక్కో అవకాశాన్ని నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఇందులో ఒక్కో అంకె కొట్టేస్తాను. అన్ని తప్పులు ముగిశాక ఐదో అంకెనయి కొట్టేశాక నేను తీసుకునే ఎటువంటి కఠిన నిర్ణయమైన నువ్వు పాటించి తీరాలి అని చెప్తుంది. అందుకు జానకి సరే అంటుంది. తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధగా ఉంటాడు. నేను చదువుకోవడానికి అత్తయ్యగారు ఒప్పుకున్నారు ఇంక ఎందుకు బాధపడ్తున్నారని జానకి అంటుంది. చదువుకోవడానికి ఒప్పుకున్ననందుకు ఆనందపడాలో షరతులు పెట్టినందుకు బాధపడలో అర్థం కావడం లేడని రామా అంటాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నారని అంటుంది.
Also Read: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య
అమ్మ పెట్టిన షరతులు దాటి ప్రవర్తించాల్సి వస్తే అప్పుడు మీ చదువు ఆగిపోతుంది కదా అని బాధపడతాడు. కష్టం లేకుండా విజయం బాధ లేకుండా సంతోషం ఉండదు. లంకలో ఉన్న సీతమ్మ తల్లిని తీసుకురావడానికి ఎన్నో అవంతారాలు ఎదుర్కొన్నారు రాముల వారు. దేవుడికే తప్పలేదు మానవ మాత్రులం మనం ఎంత చెప్పండి. అత్తయ్యగారి దగ్గర మాట పడకుండా నేను కచ్చితంగా ఐపీఎస్ సాధించి తీరతాను.. మీ మనసులో ఉన్న భయాలన్నీ తీసేసి సంతోషంగా ఉండండి అని జానకి ధైర్యం చెప్తుంది. ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటారు. మల్లిక ఇక తన గదిలో వీరంగం సృష్టిస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ ఏమైందని విష్ణు అడుగుతాడు. జరుగుతున్న పరిస్థితులు చూసి జాగ్రత్త పడమని అంటున్నాను. మీ అమ్మ పెద్ద కొడుకుని ఒకలాగా చిన్న కొడుకుని ఒకలాగా చూస్తుందని అంటుంది. మా అమ్మ ఎప్పుడు అలా చూడడు అని విష్ణు అంటాడు. మరి మీ వదినని ఐపీఎస్ ఎందుకు చదివిస్తున్నట్టు అని అడుగుతుంది. ఎందుకంటే వాడినకి చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అవ్వాలని కల కాబట్టి అని చెప్తాడు.
మరి నాకు నా మొగుడితో పట్నంలో ఉండాలని కోరిక మరి దానికి మీ అమ్మ ఒప్పుకుంటుందా అని మల్లిక అడుగుతుంది. అది వేరు ఇది వేరని చెప్తాడు. ఎంత చెప్పినా మీ అమ్మకి పెద్ద కొడుకు అంటేనే ప్రాణం మీ అమ్మ అందరి కంటే ఎక్కువ ప్రేమని విలువని పెద్ద కొడుకు మీదే చూపిస్తుంది. అందుకే అసలు చదువుకొని అమ్మాయిని భార్యగా తీసుకురావాలని మంగమ్మ శపథం చేసిన మీ అమ్మ ఈరోజు ఐపీఎస్ చదవడానికి ఒప్పుకుంది. మీ అన్నయ్య చాలా స్వార్థపరుడు. మీ వదిన జానకి తెలివైనది. ఐపీఎస్ అవుతుంది. అప్పుడు ఈ స్వీట్ కొట్టు వదిలేసి పట్నం వదిలిపోతాడు. హోదా దక్కుతుంది. పెళ్ళాం ఐపీఎస్ అయితే పట్నంలో షికారు చేయవచ్చని మీ అన్నయ్య ఆలోచన. ఇప్పటికైనా తెలుసుకోండి మనం మీ వదిన ఐపీఎస్ చదవకుండా ఇంట్లో గొడవ చేసి ఆపేద్దామని సలహా ఇస్తుంది.
Also Read: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్- నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్
జానకి నిద్ర లేచి తన పుస్తకాల కోసం వెతుకుతుంది. వాటిని మల్లిక తీస్తుంది. నిన్ను పోలేరమ్మతో తిట్టించాలని నీ పుస్తకాలు తీసుకుంటుంది. జ్ఞానంబ గదిలోకి వాటిని తీసుకొస్తుంది. ఇవి వంశపారపర్యంగా వస్తున్న తోరాలు ఇవన్తే పోలేరమ్మకి పిచ్చ సెంటిమెంట్, విట్నీ ఎవరయినా ముట్టుకుంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. అలాంటిది జానకి నీ బుక్స్ ని ఇక్కడ పెట్టడం కోసం వీటిని కిందపడేసావంటే భయనం బీభత్సం అని వాటిని కింద పెట్టి వాటి స్థానంలో జానకి పుస్తకాలు పెడుతుంది. ఇక జానకి పుస్తకాలు కనిపించడం లేదని రామాని అడుగుతుంది. మల్లిక వాటిని పెట్టి గదిలో నుంచి బయటికి వచ్చేస్తుంది. గదిలోకి వెళ్ళిన జ్ఞానంబ పూజా సామన్లు అన్నీ కింద పడి ఉండటం చూస్తుంది. వాటిని లోపల పెట్టేందుకు బీరువా తియ్యగా అందులో పుస్తకాలు కనిపిస్తాయి. అవి చూసి జానకిని కోపంగా పిలుస్తుంది.