Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్- నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్
తులసికి సామ్రాట్ రోజురోజుకి దగ్గర అవ్వడం చూసి నందు ఈర్ష్య పడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అందరూ సామ్రాట్ ని పొగడటం చూసి కుళ్లుకుంటాడు నందు. అది విని లాస్య నాకు కాదు చిప్ దొబ్బింది నీకు అంటుంది. ఆ మాటకి నందు కోపంగా లాస్య అని అరిచి నాకు సామ్రాట్ కి మధ్య హ్యాండ్ రెజ్లింగ్ జరిగేలా ఎందుకు రెచ్చగొట్టావ్ అని అడుగుతాడు. నువ్వు గెలవాలని నీ పెదాల మీద నవ్వు చూడాలని.. సామ్రాట్ ముందు నువ్వు హీరోలా కనిపించాలని.. అయినా గెలిచావ్ కదా ఇంకేంటి బాధ అని అడుగుతుంది. నేను గెలవలేదు అని నందు కోపంగా గట్టిగా అరుస్తాడు. సామ్రాట్ నన్ను గెలిపించాడు. తులసి ఓడిపొమ్మని సామ్రాట్ కి సైగ చేసి చెప్పింది నేను నా కళ్ళారా చూశాను.. అందుకే ఓడిపోయాడు. ఇలా గెలవడం కంటే ఒడిపోవడమే నాకు సంతోషంగా ఉండేదని అసలు విషయం చెప్పేస్తాడు నందు. సారీ నందు నాకు ఈ విషయం తెలియదు నిజంగానే నువ్వు గెలిచావని అనుకుని తెగ పొగిడేశాను. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మన పని అయ్యేంత వరకు సామ్రాట్ ఇగో హార్ట్ అవ్వకుండా చూసుకుందాం మన జాబ్స్ కాపాడుకుందామని లాస్య హితబోధ చేస్తుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం వెంపర్లాడటం ఎందుకు వేరే జాబ్స్ చూసుకుందామని నందు అంటాడు.
Also Read: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య
నీ ఆవేశంతో కష్టాలు తీసుకురాకు.. సామ్రాట్ తో పోటీ పడటం ఆపేసి ఆయనకి నచ్చే విధంగా నడుచుకోమని లాస్య అంటుంది. ముఖ్యంగా తులసి విషయంలో అది గుర్తు పెట్టుకోమని లాస్య హెచ్చరిస్తుంది. సామ్రాట్ తన బాబాయ్ తో కలిసి తులసి ఇంటికి వస్తాడు. చేయాల్సింది అంతా చేస్తావ్ అని సామ్రాట్ తన బాబాయ్ మీద అరుస్తాడు. ఎందుకండి అలా ఆయన మీద చిరాకు పడతారని తులసి అంటుంది. నోరు జారి అడగకూడని ప్రశ్నలు వేసి తులసి గారిని ఇబ్బంది పెట్టావ్.. అదంతా మర్చిపోయి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుందని అన్నావ్ చూడు ఇప్పుడు తులసి గారు ఇంట్లోకి కూడా రానివ్వకుండా అడ్డంగా నిలబడ్డారు అని సామ్రాట్ తెగ ఓవరాక్షన్ చేస్తాడు. మీ బాబాయ్ గారు ఏం తప్పు చేశారని పెద్దాయన అడిగిన దాంట్లో తప్పు లేదని నేనే మర్యాద లేకుండా అలా వచ్చేశానని తులసి అంటుంది. క్షమించమ్మా ఇంకెప్పుడు నిన్ను అలా అడిగి ఇబ్బంది పెట్టను అని సామ్రాట్ బాబాయ్ అంటాడు. నేను అదంతా ఎప్పుడో మర్చిపోయాను అని తులసి అనేసరికీ ఎలా నమ్మడం.. ఒక పని చేద్దాం మీకు సంబంధించినది ఒకటి మా ఇంట్లో మర్చిపోయారు అది తీసుకుంటే నమ్ముతాను అని సామ్రాట్ అంటాడు. వెళ్ళి తులసికి బహుమతిగా ఇచ్చిన వీణ పట్టుకుని తెచ్చి ఇస్తాడు. అది తులసి తీసుకోవడంతో సంతోషిస్తాడు. ప్రాజెక్ట్ ఫైనల్ చెయ్యాలి ఇంటికి రండి మీటింగ్ ఉందని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు.
తులసి కోసం నందు, లాస్య, సామ్రాట్ తన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. తులసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ చెప్తుంది. నీ కారణంగా మా వర్క్స్ అన్ని డిస్ట్రబ్ అయ్యాయి, ఇట్స్ వెరీ బాడ్ అని నందు చిరాకు పడతాడు. ఇక్కడ బాస్ ని నేను తులసి గారి బిజినెస్ పార్టనర్ ని నేను అడిగినా అడగాలనుకున్నా నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి అర్థమైందా అని సామ్రాట్ నందుతో కోపంగా అంటాడు. తులసిగారిని హార్ట్ చేసేలా మాట్లాడే హక్కు మీకు లేదని అనేసరికి లాస్య సారీ చెప్తుంది. చెప్పాల్సింది నాకు కాదు తులసి గారికి అనేసరికి నందు లాస్య తనకి సారీ చెప్తారు. ప్రాజెక్ట్ వివరాలు చెప్తాడు దానికి తులసి ఒకే చెప్తుంది. ఇక మీకు నందుతో ఏం ప్రాబ్లం ఉండదని సామ్రాట్ అంటే నాకేం ఇబ్బంది లేదు ఆయనకే నాతో ప్రాబ్లం అని అంటాడు. ఏం నందు అని అంటే అలా ఏమి లేదని చెప్తాడు.
Also Read: తప్పు ఒప్పుకున్న అనసూయ - తులసి విషయంలో నందుకు వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్
ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కూల్ డిజైన్ చూడటానికి వాళ్ళతో మన బిజినెస్ ప్రపోజల్ గురించి మాట్లాడటానికి నందుని సామ్రాట్ తనతో వైజాగ్ రమ్మని చెప్తాడు. నందు ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పడంతో తులసిని తీసుకుని వెళ్ళమని సామ్రాట్ బాబాయ్ సలహా ఇస్తాడు. నేను అదే అనుకున్నానని సామ్రాట్ చెప్పడంతో నందు బిత్తరపోతాడు. తనతో పాటు వైజాగ్ రమ్మని సామ్రాట్ తులసిని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పి ఏ విషయం చెప్తానని తులసి అంటుంది. ఆ మాటలకి లాస్య కౌంటర్ వేస్తూ ఉంటుంది. ఆ సామ్రాట్ తులసితో తింగరి వేషాలు వేస్తుంటే కోపంగా ఉందని నందు అంటాడు.
తరువాయి భాగంలో..
అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు.. నాకే తెలియదు. అమ్మ బతికుంటే తులసి ఆంటీ లానే ఉండేది కదా. తులసి ఆంటీని అమ్మా అని పిలవాలనిపిస్తుంది అని హనీ సామ్రాట్ తో అనేసరికి షాక్ అవుతాడు.